iDreamPost
android-app
ios-app

Kalki 2898 AD: కల్కి OTT స్ట్రీమింగ్‌పై అధికారిక ప్రకటన.. ఎప్పటి నుంచంటే

  • Published Aug 17, 2024 | 9:54 AM Updated Updated Aug 17, 2024 | 9:54 AM

Kalki 2898 AD-OTT Release: డార్లింగ్‌ ప్రభాస్‌ నటించిన కల్కి చిత్రం ఓటీటీ విడుదల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తోన్న ప్రేక్షకులు గుడ్‌న్యూస్‌. స్ట్రీమింగ్‌పై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఆ వివరాలు..

Kalki 2898 AD-OTT Release: డార్లింగ్‌ ప్రభాస్‌ నటించిన కల్కి చిత్రం ఓటీటీ విడుదల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తోన్న ప్రేక్షకులు గుడ్‌న్యూస్‌. స్ట్రీమింగ్‌పై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఆ వివరాలు..

  • Published Aug 17, 2024 | 9:54 AMUpdated Aug 17, 2024 | 9:54 AM
Kalki 2898 AD: కల్కి OTT స్ట్రీమింగ్‌పై అధికారిక ప్రకటన.. ఎప్పటి నుంచంటే

పాన్ ఇండియా సూపర్ స్టార్, డార్లింగ్‌ ప్ర‌భాస్ హీరోగా తెరకెక్కిన సినిమా కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మైథాలజీ అండ్ ఫిక్షనల్ థ్రిల్లర్‌ మూవీలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటించింది. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌హాసన్‌, దిశా పటానీ, మృణాల్ ఠాకూర్, మాళవిక మోహనన్‌, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ వంటి దిగ్గజ నటీనటులు, దర్శకులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. జూన్ 27న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కల్కి.. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల మోత మోగించింది. సుమారు 1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ప్రభాస్‌ ఖాతాలో మరో బ్లాక్‌బాస్టర్‌ని యాడ్‌ చేసింది. ఇక ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో కల్కి ఓటీటీ స్ట్రీమింగ్‌పై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇంతకు ఎప్పటి నుంచంటే..

కల్కి ఓటీటీ రిలీజ్‌ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తోన్న ప్రేక్షకులకు శుభవార్త. స్ట్రీమింగ్‌పై అధికారిక ప్రకటన వచ్చేసింది. కల్కి నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే ఆగస్టు 23న ఈ చిత్రం ఓటీటీల్లో స్ట్రీమింగ్‌ అవుతుందని అందరూ భావించారు. కానీ ఇప్పుడు మాత్రం ఓ రోజు ముందుగానే అనగా.. ఆగస్టు 22 నుంచి ఓటీటీల్లో స్ట్రీమింగ్‌ రెడీ అయినట్లు తెలుస్తోంది. తెలుగు, మలయాళ, తమిళ్‌, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ మేరకు అమెజాన్‌ ప్రైమ్‌ ఓ పోస్టర్‌ని విడుదల చేసింది. దాంతో కల్కి ఓటీటీ స్ట్రీమింగ్‌పై అధికారిక ప్రకటన వచ్చేసినట్లయ్యింది.

Kalki into OTT

 

View this post on Instagram

 

A post shared by Netflix India (@netflix_in)

ఇదిలా ఉంటే గురువారం (ఆగస్టు 15) తో కల్కి థియేటర్లలో విడుదలై 50 రోజులు పూర్తయ్యాయి. ఈ క్రమంలో చిత్ర బృందం ఒక స్పెషల్ పోస్టర్‌ను సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసింది. తమ సినిమాను ఆదరించిన ప్రతి ఒక్కరికీ కల్కి టీమ్‌ ధన్యవాదాలు తెలిపింది. ఇక కల్కి సినిమా 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లోని సంధ్య థియేటర్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సెలబ్రేషన్స్‌లో దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ కూడా పాల్గొన్నారు. థియేటర్ యాజమాన్యంతో పాటు పలువురు అభిమానులు ఆయనను ఘనంగా సన్మానించారు. అలాగే 50 రోజులకు సంబంధించి భారీ కేక్ ను కూడా కట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.