iDreamPost
android-app
ios-app

తిరిగొచ్చిన మున్నా భాయ్.. మీర్జాపూర్ సీజన్ 4 కోసమేనా?

  • Published Aug 30, 2024 | 10:52 AM Updated Updated Aug 30, 2024 | 10:52 AM

Mirzapur Season 3 Bonus Episode- Munna Bhaiya Coming Back: మీర్జాపూర్ సీజన్ 3కి సంబంధించి బోనస్ ఎపిసోడ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే అసలు ఈ బోనస్ ఎపిసోడ్ ని అసలు ఎందుకు తీసుకొచ్చారు? అంత అవసరం ఏముందంటే?

Mirzapur Season 3 Bonus Episode- Munna Bhaiya Coming Back: మీర్జాపూర్ సీజన్ 3కి సంబంధించి బోనస్ ఎపిసోడ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే అసలు ఈ బోనస్ ఎపిసోడ్ ని అసలు ఎందుకు తీసుకొచ్చారు? అంత అవసరం ఏముందంటే?

  • Published Aug 30, 2024 | 10:52 AMUpdated Aug 30, 2024 | 10:52 AM
తిరిగొచ్చిన మున్నా భాయ్.. మీర్జాపూర్ సీజన్ 4 కోసమేనా?

మీర్జాపూర్.. పాన్ ఇండియా లెవల్లో ఈ వెబ్ సిరీస్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మన ఓటీటీ ఆడియన్స్ ని వెబ్ సిరీస్లకు అలవాటు చేసిన వాటిలో ఈ మీర్జాపూర్ కూడా ఒకటి. భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఓటీటీ అభిమానులు మీర్జాపూర్ కు పట్టం కట్టారు. అయితే ఆ వైభవం తొలి సీజన్ కు మాత్రమే పరిమితం అయ్యింది. రెండో సీజన్ కు మీర్జాపూర్ గ్రాఫ్ కాస్త తగ్గింది అని అభిమానులే చెబుతున్నారు. ఇంక అది సీజన్ 3కి మరింత మసకబారిపోయింది. నిజానికి కథలోకి వెళ్లే కొద్ది వైలెన్స్ కంటే కూడా.. డ్రామా ఎక్కువైపోయింది. కుర్చీకోసం పోటీలికి మహిళలు కూడా వచ్చేశారు. సీజన్ 3 మొత్తం ఫుల్ ఆఫ్ పాలిటిక్స్ దాంతో క్రేజ్ అమాంతం తగ్గిపోయింది. సీజన్ 3కి షాకింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఇంకేముంది.. మేకర్స్ దిద్దుబాటు చర్యలు ప్రారంభించేశారు.

మీర్జాపూర్ సీజన్ 3కి సంబంధించి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో అందరికీ తెలిసిందే. నిజానికి ఇందులో మేకర్స్ ని ఏం అనలేం. ఎందుకంటే వాళ్లు వాళ్ల కథకి తగినట్లు ముందుకెళ్లారు. ప్రతిసారి వైలెన్స్ చూపించాలి అంటే కుదరదు. కొన్నిసార్లు డ్రామా, పాలిటిక్స్, ఎమోషన్స్ ని కూడా ఎలివేట్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఆడియన్స్ మాత్రం దాన్ని జీర్ణించుకోలేకపోయారు. అందుకే ఇప్పుడు మీర్జాపూర్ మేకర్స్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే మున్నా భాయ్ ని తిరిగి తీసుకొస్తున్నారు అని అర్థమవుతోంది. ఇప్పటికే బోనస్ ఎపిసోడ్ గురించి అందరికీ తెలిసిందే. ఈ బోనస్ ఎపిసోడ్ కూడా మీర్జాపూర్ ఇమేజ్ కి జరిగిన డ్యామేజ్ ని ట్రీట్ చేయడానికి వదిలింది అని అర్థమవుతోంది.

ఈ మీర్జాపూర్ సీజన్ 3 బోనస్ ఎపిసోడ్ ని ఆగస్టు 30 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నాం అని ప్రకటించారు. ఇప్పటికి అయితే ఇంకా రాలేదు. ఆగస్టు 30 రాత్రి 12 తర్వాత స్ట్రీమ్ చేస్తారేమో చూడాలి. అసలు ఈ ఎపిసోడ్ ఎందుకు రిలీజ్ చేశారు? ఈ ప్రశ్నకు చాలా సింపుల్ గా సమాధానం చెప్పచ్చు. అదేంటంటే.. మున్నా భాయ్ ని మళ్లీ తిరిగి మీర్జాపూర్ యూనివర్స్ లోకి తీసుకొస్తున్నారు. ఇదైతే ఇప్పటికి ఊహే కావచ్చు. కానీ, జరగబోయేది కూడా ఇదే కావచ్చు అని అభిమానులు ఆనంద పడుతున్నారు. ఎందుకంటే మున్నా ప్రెజెన్స్ ని మీర్జాపూర్ సీజన్ 3లో చాలా మిస్ అయ్యారు. బోనస్ ఎపిసోడ్ గ్లింప్స్ లో కూడా మున్నాతో అదే చెప్పించారు.

బోనస్ ఎపిసోడ్ టీజర్ లో ఒక డైలాగ్ ఉంది.. “మనం ఏదీ సరిగ్గా చేయం.. చేశాక ఆలోచిస్తాం” అంటే అనవసరంగా మున్నా క్యారెక్టర్ ని తీసేశామే అని మేకర్స్ ఫీలవుతున్నారు కావచ్చు. కానీ, ఎలాగైనా మళ్లీ మున్నాని తీసుకురావాలి. అందుకు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి గుడ్డు భాయ్ కి మాత్రమే మున్నా కనిపిస్తూ.. గుడ్డూని తన మాటలతో ఇబ్బంది పెడుతూ ఉండటం. లేదంటే.. సినిమాటిక్ లిబర్టీని కాస్త ఎక్కువ తీసుకుని.. కాలిన్ భయ్యా తరహాలోనే మున్నా కూడా ఎక్కడో ఒక దగ్గర బతికే ఉన్నాడు అని చూపించడం. మున్నా భార్యే ఇన్ని రోజులు అతడిని జాగ్రత్తగా ఉంచి ట్రీట్మెంట్ చేస్తోంది అని చెప్పచు. మేకర్స్ తల్చుకుంటే ఏదైనా జరగచ్చు. ఎలా వచ్చినా కూడా మున్నా తిరిగి రావాలి అని ఆడియన్స్ కూడా కోరుకుంటున్నారు. చూద్దాం.. మరి ఏం జరుగుతుందో? మున్నా తిరిగి రావాలి అంటారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by prime video IN (@primevideoin)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetvakti girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş