Swetha
OTT Best Anthology Drama - Rupanthara: ఈ వారం ఓటీటీ లోకి చాలానే ఇంట్రెస్టింగ్ సినిమాలు , సిరీస్ లు ప్రేక్షకులను.. ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ ఆంథాలజీ డ్రామా యాడ్ అవుతుంది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.
OTT Best Anthology Drama - Rupanthara: ఈ వారం ఓటీటీ లోకి చాలానే ఇంట్రెస్టింగ్ సినిమాలు , సిరీస్ లు ప్రేక్షకులను.. ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ ఆంథాలజీ డ్రామా యాడ్ అవుతుంది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.
Swetha
ఈ వారం ఓటీటీ లో ఈ సినిమాలను అసలు మిస్ కావొద్దు అంటూ.. ప్రతి వారం కొన్ని మూవీ సజ్జెషన్స్ వస్తూనే ఉంటాయి. అలాంటి మస్ట్ వాచ్ చిత్రాలలో ఈ వారం ఈ సినిమాను కూడా యాడ్ చేసుకుని అసలు మిస్ చేయకుండా చూసేయండి. తెలుగు ఉంటె మాత్రమే సినిమాలు చూస్తాం అనుకుంటే మాత్రం .. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను మిస్ అవుతుంటారు. ఈ సినిమా కూడా అలాంటిదే. ఇది ఒక కన్నడ ఆంథాలజీ డ్రామా. జూలై 26 న థియేటర్స్ లో రిలీజ్ అయినా ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ లోకి రాబోతుంది. మరి ఈ సినిమా ఎప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుంది అనే విషయాలను చూసేద్దాం.
ఈ సినిమా పేరు రూపాంతర . మిథిలేష్ ఏదావలత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రాజ్ బి శెట్టి ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు. సాధారణంగా ఆంథాలజీ కథలంటే… అనేక వేరు వేరు కథలను కలిపి చూపిస్తూ ఉంటారు. ఈ సినిమా కూడా అంతే. ఈ సినిమా అంతా కూడా ఐదు కథల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఐదు డిఫరెంట్ కథలైనా కూడా.. దర్శకుడు వాటిని కలిపి చూపించిన తీరు ప్రేక్షకులను మెప్పించింది. దీనితో కన్నడలో ఈ సినిమాను సూపర్ హిట్ చేశారు ప్రేక్షకులు. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిపోయింది. ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకోగా.. సెప్టెంబర్ 13 నుంచి స్ట్రీమింగ్ కు తీసుకురానున్నారు. అయితే తెలుగులో కూడా వస్తుందా లేదా అనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. సహజంగా ఆంథాలజీ కథలంటే.. వేరు వేరు కథలు ఉంటూ.. దేనికి దానికి ప్రత్యేకమైన ముగింపు ఉంటుంది. కానీ ఈ సినిమా అలా కాదు.. ఇవి ఐదు వేరు వేరు కథలైనా కానీ.. ఓకే చోట కలుస్తాయి. సినిమా స్టార్టింగ్ లో తన భవిష్యత్తులో ఉండే ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడడం కోసం ఓ కథను చెప్తూ ఉంటాడు. అతను మొత్తం నాలుగు కథలను చెప్తాడు.. మొదట ఓ వృద్ధ జంట కథ.. తర్వాత ఓ బిచ్చగాడి కథ.. మూడోది ఒక స్థానిక గుండా అక్కడ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో గొడవ పడడం.. నాలుగో కథ చిన్నతనం నుంచి కష్టాల బారిన పడిన ఓ వ్యక్తి.. ఎలా డ్రగ్స్ కు ఎడిక్ట్ అయ్యాడు అని.. మరి ఈ నాలుగు కథలకు.. ఆ వ్యక్తి ప్రాణాలకు సంబంధం ఏంటి ? అసలు ఈ కథలన్నీ ఒకే పాయింట్ దగ్గర ఎలా కలుస్తాయి? ఈ విషయాలు తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.