ఇకపై థియేటర్ కు ఓటిటికి మధ్య ఖచ్చితంగా 50 రోజుల నిబంధన ఉండాలని నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు తీర్మానం చేసుకున్నారు. ఒకవేళ దీన్ని అతిక్రమిస్తే ఎలాంటి కఠిన చర్యలు ఉంటాయో చెప్పలేదు కానీ త్వరలోనే అవీ బయటికి వస్తాయి. వినడానికి ఇది బాగానే ఉన్నా ప్రాక్టికల్ గా ఎంతవరకు మంచి ఫలితాలు ఇస్తుందనే దాని గురించి పలు అనుమానాలున్నాయి. ముఖ్యంగా ఫ్లాప్ అయిన వాటికి ఎంత గ్యాప్ ఇచ్చినా ఒకటే.రిలీజైన మొదటి రోజే […]
బుల్లితెరపై ఎవర్ గ్రీన్ యాంకర్ ఎవరు అంటే.. అందరూ చెప్పే ఒకే పేరు సుమ. మే6న సుమ నటించిన జయమ్మ పంచాయితీ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా పెద్ద హిట్ కానప్పటికీ, ఫర్వాలేదనే టాక్ ను దక్కించుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైంది. జూన్14 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. రెగ్యులర్ కంటెంట్ కు భిన్నంగా పూర్తి గ్రామీణ వాతావరణంలో నడిచిన కథను ఎంచుకున్నారు సుమ. […]
థియేటర్లలో ఎలాగూ కొత్త సినిమాలు వస్తుంటాయి కానీ ఇల్లు కదలకుండా కూర్చున్న చోటే కాలక్షేపం అయ్యే అవకాశం ఇస్తున్నవి ఓటిటిలే. 10వ తేదీన అంటే సుందరానికి, 777 ఛార్లీలతో పాటు ఇంకో రెండు చిన్న సినిమాలు హాల్లో అడుగుపెడుతున్నాయి. వాటికి ధీటుగా స్మాల్ స్క్రీన్ ఎంటర్ టైన్మెంట్ కూడా ముస్తాబవుతోంది. అవేంటో చూద్దాం. జీ5లో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అందుకుంటున్న మూవీ ‘కిన్నెరసాని'(KINNERASANNI). మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ నటించిన ఈ థ్రిల్లర్ జనవరిలో రావాల్సింది. కానీ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారు వారి పాట సినిమా మే 12న థియేటర్లలో రిలీజ్ అయి మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లి మంచి విజయం సాధించింది. పరశురామ్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా రీజనల్ సినిమాగా విడుదల అయి భారీ కలెక్షన్లని కొల్లగొడుతుంది. ఇప్పటికే కేవలం రెండు వారాల్లోనే రెండొందల కోట్ల గ్రాస్ కలెక్షన్స్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఒక […]
చెప్పా పెట్టకుండా అమెజాన్ ప్రైమ్ లో కెజిఎఫ్ చాప్టర్ 2 వచ్చేసింది. ప్రోమోలు, సోషల్ మీడియా పోస్టులు గట్రా హడావిడి ఏమి లేకుండా గుట్టుచప్పుడు కాకుండా స్ట్రీమింగ్ మొదలుపెట్టేశారు. అయితే ఇక్కడో ఝలక్ ఇచ్చారు. ప్రైమ్ లో అకౌంట్ ఉన్నంత మాత్రాన చూసేందుకు లేదు. 199 రూపాయలు చెల్లిస్తేనే మనకు ప్రీమియర్ స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి మొదలుపెట్టాక రెండు రోజుల్లోపే పూర్తి చెయాలి. ఒకవేళ ఏవైనా కారణాల వల్ల కుదరకపోతే మళ్ళీ ఇంకోసారి డబ్బులు కట్టి చూసుకోవాలి. […]
భారీ అంచనాలతో విడుదలై అతి పెద్ద డిజాస్టర్ గా మిగిలిన ఆచార్య ఎఫెక్ట్ రాబోయే మెగా సినిమాల మీద పడుతోంది. చిరంజీవి ఉన్నంత మాత్రాన టాక్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులు గుడ్డిగా ఓపెనింగ్స్ ఇవ్వరని అర్థమైపోయింది. ఆఖరికి రామ్ చరణ్ క్రేజ్ కూడా ఆచార్యకు కొంచెం కూడా ఉపయోగపడకపోవడం షాక్ కలిగించే అంశం. సుమారు 80 కోట్ల దాకా నష్టం మూటగట్టుకున్న ఆచార్య ఓన్లీ తెలుగు వెర్షన్ ప్రకారం బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. అజ్ఞాతవాసి, […]
నిన్న చిన్న సినిమాల థియేటర్ సందడిలోనూ ఓటిటి డైరెక్ట్ మూవీస్ వచ్చాయి. అందులో ఎక్కువగా దృష్టిలో పడ్డది చిన్ని. తమిళంలో సాని కడియం పేరుతో రూపొందిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో చిన్నిగా తెలుగు వెర్షన్ స్ట్రీమ్ అయ్యింది. కీర్తి సురేష్ టైటిల్ రోల్ పోషించడమే ప్రధాన ఆకర్షణగా నిలవగా ఎన్నడూ లేనంత డీ గ్లామర్ గా ఇందులో తను కనిపించడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ట్రైలర్ లోనే ఇది హింసాత్మక రివెంజ్ డ్రామా అనే క్లూ […]
ఒక మెగాస్టార్ సినిమా వారం తిరక్కుండానే వాషవుట్ అయిపోవడం అభిమానులకే కాదు మొత్తం కొణిదెల టీమ్ కే పెద్ద షాక్. ఆచార్య రన్ దాదాపు ఫైనల్ కు వచ్చేసింది. ఎక్కడా కనీసం సగం థియేటర్లు నిండని పరిస్థితి కనిపిస్తోంది. అగ్రిమెంట్ల ప్రకారం రెండో వారం కంటిన్యూ చేయడం తప్ప ట్రేడ్ కు రెవిన్యూ మీద పెద్ద నమ్మకం లేదు. దానికి తోడు హైదరాబాద్ లాంటి నగరాల్లో సెకండ్ వీక్ లో కేవలం యాభై రూపాయలు మాత్రమే ధర […]
ఇండియా వరకు ఓటిటిలో గణనీయమైన మార్కెట్ సంపాదించుకున్న అమెజాన్ ప్రైమ్ త్వరలో కొత్త స్ట్రాటజీతో వినోదాన్ని అందించబోతోంది. ఇప్పటి దాకా ఉన్న పద్ధతి ఏడాదికి లేదా నెల మూడు నెలలు చందా కట్టేసి నాన్ స్టాప్ గా అందులో ఉన్నవి ఎంతసేపైనా చూసుకోవడం. కానీ దీంతో పాటు ఇంకో మోడల్ ని ప్రైమ్ తీసుకురాబోతోంది. దీని ప్రకారం ఏదైనా ప్రీమియర్ షోని ప్రత్యేకంగా మిగిలినవాటితో సంబంధం లేకుండా చూడాలంటే 99 రూపాయలు చెల్లించాలన్న మాట. దీనికో టైం […]
కళ్ళు తిరిగే బడ్జెట్ తో రూపొంది బాహుబలి రేంజ్ లో ఆడుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న రాధే శ్యామ్ ఫైనల్ గా వంద కోట్లకు పైగా నష్టం తెచ్చిన అతి పెద్ద డిజాస్టర్ గా చరిత్రలో నిలిచిపోయింది. బ్రేక్ ఈవెన్ కు సగం దూరం కూడా చేరుకోలేకపోయిన ఈ సినిమా కోసం తమన్, దర్శకుడు రాధా కృష్ణ ఎంత ప్రమోషన్ చేసినప్పటికీ లాభం లేకపోయింది. తాజాగా ఇది ఓటిటిలో వచ్చేందుకు రెడీ అయ్యింది. ఏప్రిల్ 1న అమెజాన్ […]