iDreamPost
android-app
ios-app

OTT లో అదిరిపోయే క్రైమ్ థ్రిల్లర్… దీనిని కానీ మిస్ అయ్యారా!

  • Published Jun 08, 2025 | 11:00 AM Updated Updated Jun 08, 2025 | 11:00 AM

OTT Suggestions : కామిడి , రొమాంటిక్ సినిమాలకంటే కూడా క్రైమ్ థ్రిల్లర్స్ కే ప్రేక్షకులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులోనూ మలయాళ సినిమాలంటే ఒకింత ఎక్కువే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఓ మంచి మలయాళ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ ఒకటి ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతుంది

OTT Suggestions : కామిడి , రొమాంటిక్ సినిమాలకంటే కూడా క్రైమ్ థ్రిల్లర్స్ కే ప్రేక్షకులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులోనూ మలయాళ సినిమాలంటే ఒకింత ఎక్కువే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఓ మంచి మలయాళ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ ఒకటి ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతుంది

  • Published Jun 08, 2025 | 11:00 AMUpdated Jun 08, 2025 | 11:00 AM
OTT లో అదిరిపోయే క్రైమ్ థ్రిల్లర్… దీనిని కానీ మిస్ అయ్యారా!

కామిడి , రొమాంటిక్ సినిమాలకంటే కూడా క్రైమ్ థ్రిల్లర్స్ కే ప్రేక్షకులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులోనూ మలయాళ సినిమాలంటే ఒకింత ఎక్కువే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఓ మంచి మలయాళ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ ఒకటి ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సినిమా ఏంటి ఈ సినిమా కథేంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలు చూసేద్దాం.

ఈ సినిమా కథ విషయానికొస్తే… కన్నన్, ముత్తు అనే ఇద్దరు వ్యక్తుల చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ముత్తు గోల్డ్ ఆర్నమెంట్స్ తయారు చేస్తూ ఉంటాడు. కన్నన్ వాటిని ముంబై లాంటి పెద్ద నగరాలకు ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు. అయితే వాటిలో చాలా లొసుగులు ఉంటూ ఉంటాయి. వాటి గురించి పోలీసులకు తెలియకుండా వీరు మేనేజ్ చేస్తూ ఉంటారు. అలా ఓ రోజు కన్నన్ , ముత్తు ఇద్దరు వేరే ఒకరితో కలిసి బంగారం డెలివెరి కోసం కోయంబత్తూర్ వెళ్తారు. అక్కడ పనంతా అయ్యాక కన్నన్ ఒంటరిగా ముంబై వెళ్తాడు. కట్ చేస్తే అతను ఓ హోటల్ లో శవమై కనిపిస్తాడు. అతనిని ఎవరో దారుణంగా హత్య చేసారని పోస్ట్ మార్టంలో తేలుతుంది. కన్నన్ ను చంపింది ఎవరు ? ముత్తు ఎలా రియాక్ట్ అవుతాడు ? పోలీసులు ఈ కేసును ఎలా సాల్వ్ చేశారు ? చివరికి ఏమైంది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

సినిమా మొదట్లో మామూలుగానే అనిపించినా.. ముందుకు సాగేకొద్దీ ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో అదిరిపోతు ఉంటుంది. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్స్ ను ఇష్టపడేవారికి ఈ సినిమా బెస్ట్ ఛాయస్ అని చెప్పి తీరాల్సిందే. ఈ సినిమా పేరు తంకం. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే తెలుగు వెర్షన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. కంటెంట్ మాత్రమే ఇంపార్టెంట్ అనుకునేవారు హ్యాపీగా ఓ లుక్ వేసేయొచ్చు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet