iDreamPost
android-app
ios-app

సమాధి నుంచి ఉత్తరాలు పంపే దెయ్యం.. OTT టాప్ లెవెల్ హర్రర్ మూవీ

  • Published Jul 17, 2024 | 1:41 PM Updated Updated Jul 17, 2024 | 1:41 PM

OTT Best Horror Thriller: హర్రర్ జోనర్ లో ఎన్ని సినిమాలు వచ్చినా కానీ.. ఒక్కోటి ఒక్కోలా ఉంటూ ఉంటాయి కాబట్టి.. ప్రతి సినిమాను కూడా చూడాలనే అనిపిస్తూ ఉంటుంది. అయితే ఉత్తరాలు రాసే దెయ్యం కథ విన్నారా.. అసలు ఇలాంటి సినిమా ఒకటి ఉందని తెలుసా.. మరి ఈ సినిమా ఏంటో చెక్ చేసేయండి.

OTT Best Horror Thriller: హర్రర్ జోనర్ లో ఎన్ని సినిమాలు వచ్చినా కానీ.. ఒక్కోటి ఒక్కోలా ఉంటూ ఉంటాయి కాబట్టి.. ప్రతి సినిమాను కూడా చూడాలనే అనిపిస్తూ ఉంటుంది. అయితే ఉత్తరాలు రాసే దెయ్యం కథ విన్నారా.. అసలు ఇలాంటి సినిమా ఒకటి ఉందని తెలుసా.. మరి ఈ సినిమా ఏంటో చెక్ చేసేయండి.

  • Published Jul 17, 2024 | 1:41 PMUpdated Jul 17, 2024 | 1:41 PM
సమాధి నుంచి ఉత్తరాలు పంపే దెయ్యం.. OTT టాప్ లెవెల్ హర్రర్ మూవీ

ఇప్పుడు డిమాండ్ అంతా హర్రర్ కథలకే ఉంది. అందుకే తెలుగులో కూడా ఇప్పుడు కొత్త కొత్త కథలతో.. ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో ఇప్పటివరకు ఎన్నో హర్రర్ మూవీస్ వచ్చినా కానీ.. ప్రతి మూవీ కూడా డిఫరెంట్ గా ఉంటూ ఉంటుంది. కాబట్టి వచ్చిన ప్రతి సినిమాను ఆదరిస్తూనే ఉంటున్నారు ప్రేక్షకులు. అయితే ఎప్పుడైనా ఉత్తరాలు రాసే దెయ్యం కథ గురించి విన్నారా.. అసలు ఇలాంటి ఓ సినిమా ఉందని తెలుసా ? ఈ సినిమాను ఇప్పటివరకు చూడకపోతే మాత్రం ఓ మంచి హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ ను మిస్ అయినట్లే. మరి ఈ సినిమా ఏంటీ ఈ సినిమాను మీరు చూసారా లేదా. ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. అనే విషయాలను చూసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమాను నిజంగా జరిగిన కథ నుంచి తీశారు. 1990 లో జాన్ అనే అతను తన భార్య పిల్లలతో ఓ కొత్త ఇంటి కోసం వెతుకుతూ ఉంటాడు. ఊరికి దూరంగా ఎవరు లేని ప్రదేశంలో.. ప్రశాంతంగా ఉండే ప్రదేశంలో ఉండాలని చూస్తూ ఉంటాడు. దింతో ఇంటి బీచ్ కు దగ్గరలో అలాంటి ఓ ఇంటినే చూసుకుంటాడు. ఆ ఇల్లు అతనికి బాగా నచ్చుతుంది. అయితే ఆ ఇంట్లో వారికి కరెంట్, టెలిఫోన్ సప్లై ఉండదు. కొన్ని విచిత్ర సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక ఆ తర్వాత రోజు.. ఆ ఇంటికి ఓ ఉత్తరం వస్తుంది. కానీ జాన్ దానిని పట్టించుకోడు. ఇక జాన్ కూతురిని ఎదో దెయ్యం వెంబడిస్తున్నట్లుగా అనిపిస్తుంది కానీ అది ఆమె అంతగా పట్టించుకోదు. అలాగే వరుసగా రెండు రోజులు ఆ ఇంటికి ఫ్రెడ్డీ అనే పేరు మీద ఉత్తరాలు వస్తూనే ఉంటాయి. అలా రోజు రావడంతో దాని గురించి ఆరాగా తీస్తాడు జాన్. కానీ పోస్ట్ మ్యాన్ ఏమో నేను అసలు మీ ఇంటికి ఏ ఉత్తరాలు వేయలేదని చెప్తాడు. దీనితో జాన్ ఆ ఉత్తరాలను తీసి చదవడం మొదలు పెడతాడు. దానిలో ఓ ప్రేమికురాలు , ప్రేమికుడు కోసం రాసిన ఉత్తరాలల అనిపిస్తూ ఉంటాయి.

అయితే సరిగ్గా అతను ఆ ఉత్తరాలలో ఏవైతే చదువుతున్నాడో.. అదే సమయంలో వాళ్ళ ఇంట్లో కూడా అదే సంఘటనలు జరుగుతూ ఉంటాయి. దీనితో అతనికి అనుమానాలు పెరుగుతాయి. ఇక అప్పటినుంచి అసలు ఉత్తరాలు ఎవరు వేస్తున్నారో తెలుసుకుందాం అనుకుంటాడు. కానీ అతను తెలుసుకోలేకపోతాడు. వాళ్ళ ఇంట్లో ఏవైతే జరగబోతాయో అవన్నీ కూడా.. ముందే ఆ లెటర్స్ లో వస్తూ ఉంటాయి. ఇక రోజు రోజుకి అనుమానంతో పాటు.. భయం కూడా పెరుగుతుంది. దీనితో వాళ్ళు ఆ ఇంటి నుంచి మరో ఇంటికి వెళ్తారు. అక్కడ కూడా వాళ్లకు ఉత్తరాలు వస్తూనే ఉంటాయి. అసలు ఆ ఉత్తరాలు రాస్తున్నది ఎవరు? ఆ కుటుంబాన్నే ఎందుకు టార్గెట్ చేసింది? వాళ్ళ కుటుంబలో జరుగుతున్న సంఘటనలు ముందే ఎలా తెలుస్తున్నాయి ? అసలు దీని వెనుక దాగి ఉన్న కథేంటి ? ఇవన్నీ తెలియాలంటే “ఫీనిక్స్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను ఇప్పటివరకు చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమాను చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది కూడా చూడండి.. తండ్రి ఆత్మే కూతుర్ని వెంటాడితే.. OTTలో ఈ హారర్ చిత్రానికి చెమటలు పట్టేస్తాయి!