iDreamPost
android-app
ios-app

Raayan OTT: ఫ్యాన్స్ కు పండగే.. అర్థరాత్రి నుంచి ధనుష్ ‘రాయన్’ స్ట్రీమింగ్!

  • Published Aug 22, 2024 | 5:55 PM Updated Updated Aug 22, 2024 | 5:55 PM

Raayan OTT Streaming: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ రాయన్ మూవీ మరికొద్ది గంటల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. దాంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

Raayan OTT Streaming: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ రాయన్ మూవీ మరికొద్ది గంటల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. దాంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

  • Published Aug 22, 2024 | 5:55 PMUpdated Aug 22, 2024 | 5:55 PM
Raayan OTT: ఫ్యాన్స్ కు పండగే.. అర్థరాత్రి నుంచి ధనుష్ ‘రాయన్’ స్ట్రీమింగ్!

రాయన్.. ధనుష్ నటించిన 50వ చిత్రంగా జులై 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాని ధనుష్ అద్భుతమైన డైరెక్షన్ చేశాడు. ఫ్యామిలీ ఎమోషనల్ అండ్ యాక్షన్  డ్రామాగా వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దాంతో ధనుష్ కలెక్షన్ల వర్షం కురిపించాడు. ఏకంగా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించి.. దూసుకెళ్తున్నాడు. ఇక ఈ మూవీ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ్టి(ఆగస్ట్ 23) అర్థరాత్రి నుంచే ఓటీటీలో రాయన్ స్ట్రీమింగ్ కానుంది.

ధనుష్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ రాయన్ మరికొన్ని గంటల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ రాయన్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్న విషయం తెలిసిందే. ఆగస్ట్ 23 అర్థరాత్రి నుంచి రాయన్ స్ట్రీమింగ్ కానుంది. తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఇది అందుబాటులోకి రానుంది. థియేటర్లలో అద్భుతమైన రెస్పాన్స్ ను సొంతం చేసుకుని రూ. 100 కోట్లు కొల్లగొట్టిన ఈ మూవీ ఓటీటీలో ఏ రేంజ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి మరి. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఓ కీలక పాత్రలో కనిపించగా.. ప్రకాశ్ రాజ్, ఎస్‌జే సూర్య, సెల్వ రాఘవన్, అపర్ణ బాలమురళి ఈ మూవీలో నటించారు. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇంకెందుకు ఆలస్యం రాయన్ ని ఓటీటీలో చూసేయండి.

Jojobet GirişJojobetHoliganbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabet