iDreamPost
android-app
ios-app

OTT లోకి అదిరిపోయే క్రైమ్ థ్రిల్లర్ 19.20.21 మూవీ.. అసలు మిస్ చేయకండి.

  • Published Aug 27, 2024 | 1:55 PM Updated Updated Aug 27, 2024 | 1:55 PM

OTT New Release- Crime Thriller 19.20.21 Movie: ఓటీటీ లోకి సైలెంట్ గా కొత్త సినిమాలు వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ మూవీ వచ్చేసింది. థియేటర్ లో రిలీజ్ అయినా ఏడాదిన్నర తర్వాత ఈ మూవీ ఓటీటీ లోకి వచ్చేసింది. మరి ఈ మూవీ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

OTT New Release- Crime Thriller 19.20.21 Movie: ఓటీటీ లోకి సైలెంట్ గా కొత్త సినిమాలు వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ మూవీ వచ్చేసింది. థియేటర్ లో రిలీజ్ అయినా ఏడాదిన్నర తర్వాత ఈ మూవీ ఓటీటీ లోకి వచ్చేసింది. మరి ఈ మూవీ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

  • Published Aug 27, 2024 | 1:55 PMUpdated Aug 27, 2024 | 1:55 PM
OTT లోకి అదిరిపోయే క్రైమ్ థ్రిల్లర్ 19.20.21 మూవీ.. అసలు మిస్ చేయకండి.

ఈ వారం ఓటీటీ లో చాలా ఇంట్రెస్టింగ్ తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక ఆ సినిమాలతో పాటు ప్రేక్షకులు ఇప్పుడు ఎలాగూ అన్ని భాషల చిత్రాలు ఆదరిస్తున్నారు కాబాట్టి ఈ సినిమాను కూడా ఈజీగా చూసేస్తారు. ఎందుకంటే ఇదొక కన్నడ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా.. ఈ మధ్య కాలంలో సినిమాలన్నీ థియేటర్ లో రిలీజ్ అయినా నెల రోజులకే ఓటీటీ లోకి వస్తుంటే ఈ సినిమా మాత్రం దాదాపు ఏడాదిన్నర తర్వాత ఓటీటీ లోకి వస్తుంది. కాబట్టి ఈ సినిమాను అసలు మిస్ చేయకుండా చూడాల్సిందే. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

కొన్ని సార్లు కథ పరంగా సినిమా మెప్పించినా.. కమర్షియల్ పరంగా మెప్పించలేకపోతే మాత్రం. ఆ సినిమాకు సరైన ఆదరణ లభించదు. ఇప్పుడు చెప్పుకోబోయేది ఇలాంటి సినిమా గురించే..ఈ మూవీ మరేదో కాదు గత సంవత్సరం కన్నడ లో రిలీజ్ అయినా క్రైమ్ డ్రామా 19.20.21. ఈ సినిమాకు ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ లో 9.2 రేటింగ్ ను దక్కింది. ఇక ఇప్పుడు ఇన్నాళ్లకు ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ క్రైమ్ డ్రామా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. కానీ ఇప్పుడు కూడా ఈ మూవీ రెంటల్ లో మాత్రమే అందుబాటులో ఉంచారు. మరి ఫ్రీ గా ఎప్పుడు వస్తుందనేదానిపై మాత్రం క్లారిటీ లేదు. ఇక ఇప్పుడు ఎలాగూ అన్నీ తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఈ సినిమాను కూడా.. త్వరలో తెలుగులోకి అందుబాటులోకి తెచ్చే అవకాశం లేకపోలేదు.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే .. ఈ సినిమాను నిజ జీవిత ఆధారంగా తెరకెక్కించారు మేకర్స్. మనిషి జీవితంలో 20 నుంచి 30 ఏళ్ళ లోపు కాలం చాలా ముఖ్యమైనది. అలాంటి దశలో ఓ స్టూడెంట్ పై కేసు నమోదైతే.. ఆ కేసులో అతనికి బెయిల్ కూడా రాకపోతే.. ఆ స్టూడెంట్ జీవితం ఏమౌతుంది? ఆ తర్వాత ఏం జరుగుతుంది ? అనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు మేకర్స్. కచ్చితంగా ఈ మూవీ యంగ్ స్టర్స్ అందరికి బాగా కనెక్ట్ అవుతుంది.  ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి.  కాబట్టి ఈ సినిమాను అసలు మిస్ చేయకుండా చూసేయండి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.