iDreamPost
android-app
ios-app

వారం లోనే OTT లోకి విజయ్ ఆంటోని ‘తుఫాన్’ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

  • Published Aug 16, 2024 | 11:49 AM Updated Updated Aug 16, 2024 | 11:49 AM

థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలు టాక్ ను బట్టి.. అటు ఇటుగా నెలలోపు ఓటీటీ లోకి వచ్చేస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా స్టార్ హీరో విజయ్ ఆంటోని నటించిన మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయినా వారం రోజుల్లోనే ఓటీటీ లోకి వచ్చేసింది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలు టాక్ ను బట్టి.. అటు ఇటుగా నెలలోపు ఓటీటీ లోకి వచ్చేస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా స్టార్ హీరో విజయ్ ఆంటోని నటించిన మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయినా వారం రోజుల్లోనే ఓటీటీ లోకి వచ్చేసింది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

  • Published Aug 16, 2024 | 11:49 AMUpdated Aug 16, 2024 | 11:49 AM
వారం లోనే  OTT లోకి విజయ్ ఆంటోని ‘తుఫాన్’ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

థియేటర్ లో రిలీజ్ అయినా ఏ సినిమా అయినా.. ఓటీటీ లోకి రావాల్సిందే. అయితే ఓటీటీ రూల్స్ ప్రకారం ఆయా సినిమాలు స్ట్రీమింగ్ కు రావాలంటే కనీసం ఎనిమిది నుంచి పది వారాల సమయం తీసుకోవాలి . కానీ ఈ మధ్య కాలంలో అలా జరగడం లేదు. థియేటర్ లో రిలీజ్ అయినా నెల రోజులకే.. ఆయా సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి. ఇదిలా ఉంటే స్టార్ హీరో విజయ్ ఆంటోని నటించిన మూవీ.. ఏకంగా థియేటర్ లో రిలీజ్ అయినా.. వారం రోజులకే ఓటీటీ లోకి వచ్చేసింది. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఈ సినిమా మరేదో కాదు.. తమిళంలో విజయ్ ఆంటోని నటించిన మ‌జై పిడిక్కాథ మ‌ణితాన్ మూవీ.. ఈ సినిమా తమిళ వెర్షన్ ఆగస్ట్ 2 న థియేటర్స్ లో రిలీజ్ అయింది. అయితే తమిళంతో పాటు తెలుగు వెర్షన్ కు కూడా రిలీజ్ చేద్దాం అనుకున్నారు కానీ.. అదే సమయంలో తెలుగులో స్ట్రెయిట్ సినిమాలు రిలీజ్ కు రెడీ గా ఉండడంతో.. ఆగస్ట్ 11న తెలుగులో ‘తూఫాన్; అనే పేరుతో ఈ సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేశారు. ఆశించిన స్థాయిలో ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో.. తెలుగు వెర్షన్ థియేటర్ లో ఉండగానే.. తమిళ్ వెర్షన్ మూవీ ఓటీటీ లోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ మూవీ తమిళ వెర్షన్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక మరొక వారం రోజుల్లోనే తెలుగు వెర్షన్ కు కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు మేకర్స్. మరి ఓటీటీ ప్రేక్షకులను ఈ మూవీ ఏ మేరకు మెప్పిస్తుందో వేచి చూడాలి.

కాగా ఈ సినిమాకు.. విజ‌య్ మిల్ట‌న్ ద‌ర్శ‌క‌త్వం దర్శకత్వం వహించగా.. విజయ్ ఆంటోనితో పాటు.. మేఘా ఆకాష్, ర‌త్‌కుమార్‌, స‌త్య‌రాజ్, డాలీ ధ‌నుంజ‌య‌ ప్రధాన పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో విజయ్ ఒక సీక్రెట్ ఏజెంట్.. ఈ క్రమంలో అతను అండమాన్ దీవులలోని ఓ ఊరికి వెళ్తాడు. అక్కడ డాలి అనే వడ్డీ వ్యాపారి చెప్పిందే వేదం.. ఇక అదే ఊరిలో మేఘ ఆకాష్ కూడా ఉంటుంది. ఈ క్రమంలో ఆమెతో ఏర్పడిన పరిచయం ఎలా ప్రేమగా మారింది ? డాలి నుంచి ఆ ఊరి ప్రజలను విజయ్ ఎలా కాపాడాడు ? అసలు విజయ్ అక్కడకు ఎందుకు వెళ్ళాడు ? ఆ తర్వాత ఏం జరిగింది ? అనేది తెరపై చూడాల్సిన కథ. మరి ఈ సినిమా ఓటీటీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş