iDreamPost
android-app
ios-app

సైలెంట్ గా OTT లోకి రొ*మాంటిక్ కామెడీ మూవీ ‘హనీమూన్ ఎక్స్ప్రెస్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

  • Published Aug 27, 2024 | 12:47 PM Updated Updated Aug 27, 2024 | 12:47 PM

OTT New Release- Telugu Movie Honeymoon Express: సైలెంట్ గా ఓటీటీ లోకి కొన్ని సినిమాలు ఎంట్రీ ఇచ్చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ఈ వారం కూడా ఓ ఇంట్రెస్టింగ్ తెలుగు సినిమా సైలెంట్ గా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మరి ఈ సినిమా ఏంటో.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

OTT New Release- Telugu Movie Honeymoon Express: సైలెంట్ గా ఓటీటీ లోకి కొన్ని సినిమాలు ఎంట్రీ ఇచ్చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ఈ వారం కూడా ఓ ఇంట్రెస్టింగ్ తెలుగు సినిమా సైలెంట్ గా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మరి ఈ సినిమా ఏంటో.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

  • Published Aug 27, 2024 | 12:47 PMUpdated Aug 27, 2024 | 12:47 PM
సైలెంట్ గా OTT లోకి  రొ*మాంటిక్ కామెడీ మూవీ ‘హనీమూన్ ఎక్స్ప్రెస్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

ఈ వారం ఓటీటీ లో చాలానే ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో తెలుగు సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా.. సైలెంట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఈ వారం కూడా మరొక తెలుగు సినిమా సైలెంట్ గా స్ట్రీమింగ్ అవుతుంది. ఆ సినిమా మరేదో కాదు రెండు నెలల క్రితం థియేటర్ లో రిలీజ్ అయినా.. తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ ‘హనీమూన్ ఎక్స్ప్రెస్’. మరి ఈ సినిమా ఏ ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా కథేంటి.. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలను చూసేద్దాం.

హనీమూన్ ఎక్స్ప్రెస్ అనే ఈ సినిమా జూన్ 21న థియేటర్ లో రిలీజ్ అయింది. కాగా ఈ సినిమాలో చైతన్య రావు, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటించారు. కానీ ఈ సినిమా థియేటర్ లో ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. అయితే ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ లో మాత్రం ఈ సినిమాకు 8.7 రేటింగ్ ఉంది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఎలాంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా సైలెంట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. ఈ వీకెండ్ ఓ మంచి రొమాంటిక్ కామెడీ యాక్షన్ మూవీ చూడాలంటే మాత్రం ఈ సినిమా బెస్ట్ ఛాయస్. మరి ఓటీటీ లో ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో వేచి చూడాలి.

HoneyMoon Express

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. రెగ్యులర్ గా ప్రతి జంట మధ్య ఉండే సమస్యలనే ఈ సినిమాలో కూడా చూపించారు. మొదటి చూపులోనే ప్రేమలో పడిన ఓ జంట మధ్య.. పెళ్లి తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ క్రమంలో ఓ వృద్ధ జంట వీరిని హనీమూన్ రిసార్ట్ కు వెళ్లాల్సిందిగా సూచిస్తారు. అక్కడికి వెళ్లిన తర్వాత వారిద్దరి మధ్య మళ్ళీ పాత బంధాలు చిగురిస్తాయా లేదా.. చివరికి వీళ్ళు కలిసి ఉంటారా లేదా అనేదే ఈ సినిమా కథ. ఈ మధ్య ఎలాగూ థియేటర్ లో హిట్ కానీ సినిమాలు.. ఓటీటీ లో మెప్పిస్తున్నాయి కాబట్టి.. ఈ సినిమా కూడా ప్రేక్షకులకు నచ్చేస్తుంది చెప్పి తీరాలి. కాబట్టి ఈ వీకెండ్ వాచ్ లిస్ట్ లో ఈ సినిమాను కూడా యాడ్ చేసేసుకోండి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.