Arjun Suravaram
Kill Movie: ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ వల్లన బాలీవుడ్ మూవీస్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 100లో ఒకటో రెండో మాత్రం ఉన్నంతలో పోటీని తట్టుకుని నిలబడుతున్నాయి. అలాంటి ఓ హిట్ సినిమా సడెన్ గా ఓటీటీలోకి వచ్చేస్తుంది.
Kill Movie: ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ వల్లన బాలీవుడ్ మూవీస్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 100లో ఒకటో రెండో మాత్రం ఉన్నంతలో పోటీని తట్టుకుని నిలబడుతున్నాయి. అలాంటి ఓ హిట్ సినిమా సడెన్ గా ఓటీటీలోకి వచ్చేస్తుంది.
Arjun Suravaram
ఈ మధ్యకాలంలో ఓటీటీ కారణంగా సినిమాలు చూడటం చాలా ఈజీ అయింది. దీని వల్లన కేవలం ప్రాంతీయ సినిమాలే కాకుండా ప్రపంచం వ్యాప్తంగా ఉన్న ఎన్నో భాషల మూవీలను సింపుల్ గా చూసేస్తున్నారు. అలానే వారం వారం ఓటీటీలో వచ్చే సినిమాల కోసం మూవీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలోనే వారికి.. చిన్న సినిమాలతో పాటు…బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన సినిమాలు కూడా ఓటీటీలో సందడి చేస్తుంటాయి. ఇక కొన్ని సినిమాలు అయితే థియేటర్లలో హిట్ గా నిలిచిన కూడా..సడెన్ గా ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తుంటాయి. అలాంటి సినిమా ఒకటి ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. మరి.. ఆ మూవీ ఏమిటో, ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం…
ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ వల్లన బాలీవుడ్ మూవీస్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఏ సినిమా కూడా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోవడం లేదు. ఇతర ప్రాంతీయ చిత్రాల హవా ముందు హింది సినిమాలు నిలవలేకపోతున్నాయి. 100లో ఒకటో రెండో మాత్రం ఉన్నంతలో పోటీని తట్టుకుని నిలబడుతున్నాయి. అలాంటి సినిమా గట్టి సినిమాల్లో కిల్ ఒకటి. జులై 5న ఈ సినిమా బాలీవుడ్ లో రిలీజైంది. ఫుల్ ఆన్ యాక్షన్ స్టోరీతో తెరకెక్కించగా.. హిట్ టాక్ తెచ్చుకుంది.
ప్రస్తుతం విడుదలై మూడో వారంలోకి అడుగుపెట్టిన సరే కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి. ఇది ఇలాంటి సమయంలో సడెన్ గా ఓటీటీలోకి రానుంది. కిల్ మూవీని ఓవర్సీస్ ప్రేక్షకుల కోసం రెంట్ విధానంలో అమెజాన్ ప్రైమ్‌లోకి తీసుకురానున్నారు. జూలై 22 సోమవారం రాత్రి 9 గంటల నుంచి ‘కిల్’ మూవీ అమెజాన్ లో స్ట్రీమింగ్‌లోకి రానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా సదరు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నుంచి వచ్చేసింది. అయితే మరీ మూడు వారాల్లోనే ఓటీటీలోకి హిట్ సినిమా రావడం ఏంటని నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
‘కిల్’ సినిమాకు విషయానికొస్తే.. అమిత్ రాథోడ్ (లక్ష‍్య లల్వానీ) ఎన్ఎస్‌జీ కమాండో విధులు నిర్వహిస్తుంటాడు. అతడి లవర్ తులికా (తాన్య మనక్తిలా)కు ఆమె తండ్రి, వేరే అబ్బాయితో నిశ్చితార్థం చేస్తాడు. దీంతో తనతో వచ్చేయాలని తులికాని అమిత్ అడుగుతాడు. అయితే తన తండ్రిని కాదని రాలేనని, అమిత్ కు ఆమె నో చెబుతుంది. ఆ తర్వాత తులికా ఫ్యామిలీ.. ఢిల్లీ నుంచి రాంచీకి రైల్లో వెళ్తుంటారు. తులికాకు తెలియకుండా అమిత్ కూడా అందులోనే ఎక్కుతాడు. కాసేపటి తర్వాత ఓ దొంగల ముఠా ట్రైన్‌పై దాడి చేస్తుంది. తులికా కుటుంబంతో పాటు ప్రయాణికులు ప్రమాదంలో పడతారు. మరి బందిపోట్ల నుంచి తులికా, ప్రయాణికులను అమిత్ కాపాడగలిగాడా? లేదా అనేది స్టోరీ. మరి.. ఎవరైనా ఈ సినిమాను చూడకుండా ఉంటే.. అమెజాన్ లో రెంట్ విధానంలో చూడొచ్చు.