iDreamPost
android-app
ios-app

నేషనల్ బెస్ట్ ఫిల్మ్​గా నిలిచిన ‘ఆట్టం’! OTTలో ఈ మూవీని ఎలా మిస్ అయ్యారు?

  • Published Aug 16, 2024 | 5:17 PM Updated Updated Aug 16, 2024 | 5:17 PM

National Best Film Award Winner Aattam Movie OTT: జాతీయ చలనచిత్ర పురస్కారాలను ఇవాళ ప్రకటించింది జ్యూరీ. ఇందులో ‘ఆట్టం’ అనే సినిమా నేషనల్ బెస్ట్ ఫిల్మ్ అవార్డును కొట్టేసింది.

National Best Film Award Winner Aattam Movie OTT: జాతీయ చలనచిత్ర పురస్కారాలను ఇవాళ ప్రకటించింది జ్యూరీ. ఇందులో ‘ఆట్టం’ అనే సినిమా నేషనల్ బెస్ట్ ఫిల్మ్ అవార్డును కొట్టేసింది.

  • Published Aug 16, 2024 | 5:17 PMUpdated Aug 16, 2024 | 5:17 PM
నేషనల్ బెస్ట్ ఫిల్మ్​గా నిలిచిన ‘ఆట్టం’! OTTలో ఈ మూవీని ఎలా మిస్ అయ్యారు?

70వ జాతీయ చలచచిత్ర పురస్కారాలను కేంద్ర సర్కారు ఇవాళ ప్రకటించింది. 2022, డిసెంబర్ 31 నాటికి సెన్సార్ కంప్లీట్ అయిన ఫిల్మ్స్​కు గానూ ఈ అవార్డులను అనౌన్స్ చేసింది జ్యూరీ. ఉత్తమ తెలుగు చిత్రంగా స్టార్ హీరో నిఖిల్ నటించిన ‘కార్తికేయ 2’ నిలిచింది. ఉత్తమ తమిళ చిత్రంగా ‘పొన్నియిన్ సెల్వన్ 1’, ఉత్తమ కన్నడ చిత్రంగా ‘కేజీఎఫ్: ఛాప్టర్ 2’ పురస్కారాలను గెలుచుకున్నాయి. బెస్ట్ యాక్టర్​గా రిషబ్ శెట్టి నిలిచాడు. ‘కాంతార’ సినిమాలో అద్భుతమైన నటనకు గానూ ఆయన ఈ పురస్కారానికి ఎంపికయ్యాడు. ఉత్తమ నటిగా స్టార్ హీరోయిన్ నిత్యా మీనన్​తో పాటు మీనాక్ష్మి పరేఖ్ నిలిచారు. ఈసారి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డును మలయాళయ చిత్రం ‘ఆట్టం’ సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా గురించి అందరూ తెలుసుకునే పనిలో పడ్డారు.

ఎక్స్​పెరిమెంట్స్​కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చింది ‘ఆట్టం’. నేషనల్ అవార్డు గెలుచుకొని ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. బిగ్ స్క్రీన్స్​లో రిలీజ్ అవడానికి ముందే పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్​లో ‘ఆట్టం’ను ప్రదర్శించారు. కేరళలో ఓ నాటక బృందంలోని 12 మంది నటులు, అందులో ఓ నటి ఉంటారు. నటితో ఓ వ్యక్తి తప్పుగా బిహేవ్ చేస్తారు. ఆ వ్యక్తి ఎవరు? ఆ అసభ్యకరమైన పని చేసిన వాడ్ని పట్టుకున్నారా? అనే కథతో ఈ సినిమా సాగుతుంది. మనుషుల్లో ఉండే భిన్నమైన వ్యక్తిత్వాలు, మనుగడ కోసం దిగజారడాలు, ఎదుటివారిని బలిపశువు చేయడం లాంటి వాటికి దృశ్య కావ్యమే ‘ఆట్టం’ ఫిల్మ్. అలాంటి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉందో తెలుసుకునేందుకు ఆడియెన్స్ ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్​లో అందుబాటులో ఉంది.

‘ఆట్టం’ మూవీని ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయాలనుకుంటే ప్రైమ్ వీడియోలో చూసేయొచ్చు. ఇక, ఈ సినిమాకు నేషనల్ అవార్డు రావడానికి హృద్యమైన కథతో పాటు అందులో నటులు పడే సంఘర్షణను చూపించిన తీరు, ఫెంటాస్టిక్ యాక్టింగ్ కారణమని ఎక్స్​పర్ట్స్ అంటున్నారు. స్మాల్ కాన్సెప్ట్​ను పట్టుకొని మనుషుల నైజం, వ్యక్తితం, దిగజారుడుతనం, స్వార్థం.. లాంటివి డైరెక్టర్ చూపించిన తీరు మరో రీజన్ అని చెబుతున్నారు. సీన్స్​కు తగ్గట్లుగా న్యాచురల్ యాక్టింగ్​తో అందరూ ఇరగదీయడం బిగ్ ప్లస్ అని అంటున్నారు. అటు యాక్టింగ్, ఇటు డైరెక్షన్ రెండూ బాగా కుదిరాయి.. దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ ఆడియెన్స్ మనసులకు టచ్ అయ్యేలా చెప్పడం వల్లే బెస్ట్ ఫిల్మ్ అవార్డును కొట్టేసిందని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ప్రైమ్​లో అందుబాటులో ఉన్న ‘ఆట్టం’ చిత్రాన్ని మీరెప్పుడు చూడబోతున్నారో కామెంట్ చేయండి.