iDreamPost
android-app
ios-app

సైలెంట్ గా OTT లోకి కన్నడ యాక్షన్ డ్రామా ‘చిల్లీ చికెన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

  • Published Aug 28, 2024 | 11:37 AM Updated Updated Aug 28, 2024 | 11:37 AM

OTT New Releases- Chilli Chicken Movie: ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ మధ్య కొన్ని సినిమాలు సైలెంట్ గా ఓటీటీ లోకి వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ మూవీ ఓటీటీ లోకి వచ్చేసింది. మరి ఈ మూవీ ఏంటో చూసేద్దాం.

OTT New Releases- Chilli Chicken Movie: ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ మధ్య కొన్ని సినిమాలు సైలెంట్ గా ఓటీటీ లోకి వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ మూవీ ఓటీటీ లోకి వచ్చేసింది. మరి ఈ మూవీ ఏంటో చూసేద్దాం.

  • Published Aug 28, 2024 | 11:37 AMUpdated Aug 28, 2024 | 11:37 AM
సైలెంట్ గా OTT లోకి కన్నడ యాక్షన్ డ్రామా ‘చిల్లీ చికెన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

ఈ వారం ఓటీటీ లోకి చాలానే ఇంట్రెస్టింగ్ సినిమాలు వస్తున్నాయి. ఇక వాటిలో తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా ఇతర భాషల సినిమాలపై కూడా ప్రేక్షకులు బాగానే ఆదరణ చూపిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని సినిమాలు ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా సైలెంట్ గా ఓటీటీ లోకి కొన్ని సినిమాలు వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ వారం మరొక ఇంట్రెస్టింగ్ మూవీ స్ట్రీమింగ్ అయిపోతుంది. ఇది నిజ జీవిత సంఘటనల నుంచి ఆధారంగా తీసుకుని.. రూపొందించిన కన్నడ మూవీ. థియేటర్ లో రిలీజ్ అయినా రెండు నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీ లోకి వచ్చేసింది. మరి ఈ మూవీ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా పేరు వింటేనే ప్రేక్షకులకు నోరూరిపోతుంది. ఇంతకీ ఈ సినిమా పేరేంటంటే ‘చిల్లీ చికెన్’. కన్నడలో థియేటర్ లో రిలీజ్ అయినా ఈ సినిమా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సంపాదించుకుంది. బెంగళూరులో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల నుంచి ఆధారంగా తీసుకుని రూపొందించారు. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయినా ఈ మూవీకి.. మొదటి షో నుంచే పాజిటివ్ రివ్యూలు రావడం విశేషం. ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ లో ఈ సినిమాకు 8.5 రేటింగ్ దక్కింది. ఇక ఇప్పుడు ఈ సినిమా సైలెంట్ గా.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతానికి ఈ సినిమా కన్నడలో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో తెలుగు స్ట్రీమింగ్ కు కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదు.

ఇక చిల్లీ చికెన్ కథ విషయానికొస్తే.. చిల్లీ చికెన్ అంటే ఇష్టపడని వ్యక్తి ఉండరు. నిజానికి ఇది ఒక నార్త్ ఈస్ట్ ఇండియా డిష్.. అయినా కూడా దేశవ్యాప్తంగా ఈ డిష్ చాలా పాపులర్. ఏకంగా డిష్ పేరునే మూవీ టైటిల్ గా పెట్టి తీయడం వలన సినిమాపైన అందరికి కాస్త క్యూరియాసిటీ పెరిగింది. ఈ సినిమా మొత్తం కూడా నూడుల్ హోమ్ అనే రెస్టారెంట్ ను నడిపించే.. ఆదర్శ్ అనే యువకుడు, అతని దగ్గర పనిచేసే నలుగురు నార్త్ ఈస్ట్ ఇండియా కుర్రాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. వీరంతా కూడా ఎంతో కష్టపడి ఆ రెస్టారెంట్ ను పై స్థాయికి తీసుకుని వెళ్ళి.. సమాజంలో మంచి పేరు సంపాదించుకుందాం అని చూస్తుంటారు. కానీ ఈలోపే వారిలో ఓ వ్యక్తి అనుమానాస్పద మరణానికి గురవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది ? అతనిని హత్య చేసింది ఎవరు? ఆ తర్వాత వారి జీవితాలలో ఎలాంటి మార్పు చోటు చేసుకుంది ? ఈ మూవీ కథకు టైటిల్ కు సంబంధం ఏంటి ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.