తెలుగు సినిమా ప్రస్థానంలో ఒక దర్శకుడి రెండు దశాబ్దాల ప్రస్థానంలో అసలు పరాజయం ఎరుగక పోవడమంటే అరుదైన ఘనత. అంత గొప్ప చరిత్రలో నిలిచిపోయిన మాయాబజార్ తీసిన కెవి రెడ్డి లాంటి వాళ్ళు సైతం ఫ్లాపులు డిజాస్టర్లు చూశారు కానీ జక్కన్నకు మాత్రం ఆ మరక అంటలేదు. పైపెచ్చు ఆర్ఆర్ఆర్ దెబ్బకు అంతర్జాతీయ స్థాయిలో రస్సో బ్రదర్స్ లాంటి ఇంటర్నేషనల్ ఫిలిం మేకర్స్ తోనూ ప్రశంసలు అందుకున్నాడు. ప్రపంచపు అతి పెద్ద ఐమ్యాక్స్ థియేటర్లో తెలుగు భాషే […]
ఇండియా తరఫున అఫీషియల్ నామినేషన్ గా గుజరాతి సినిమా వెళ్లినప్పటికీ ఆర్ఆర్ఆర్ బృందం మాత్రం తమకు అవార్డు వచ్చే ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. ముఖ్యంగా ఇటీవలే యుఎస్ లో జరిగిన బియాండ్ ఫెస్ట్ లో భాగంగా అతి పెద్ద ఐమాక్స్ స్క్రీన్ మీద జరిగిన ప్రీమియర్ కొచ్చిన స్పందన వాళ్లకు కొత్త ఎనర్జీనిచ్చింది. అందుకే ఒకటి రెండు కాకుండా అన్ని విభాగాలకు సంబంధించి జెనరల్ క్యాటగిరీలో నామినేషన్ పంపించుకున్నారు. భారత ప్రభుత్వం తరఫున దీనికి […]
ఆర్ఆర్ఆర్ విడుదలై ఆరు నెలలు దాటేసింది. ఓటిటిలో ఎప్పుడో వచ్చేసింది. శాటిలైట్ ఛానల్ ప్రీమియర్స్ అన్ని భాషల్లో జరిగిపోయాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు హిందీ నెట్ ఫ్లిక్స్ లో, మిగిలిన భాషలకు జీ5లో అందుబాటులో ఉంది. కొన్ని కీలకమైన సన్నివేశాలు, ఎపిసోడ్లు హిందీ వెర్షన్ హక్కుదారు పెన్ స్టూడియోస్ యుట్యూబ్ అఫీషియల్ ఛానల్ లో అందుబాటులో ఉంచేసింది. ఇలాంటి పరిస్థితిలో ఎంత గ్రాండియర్ కైనా థియేటర్ లో జనం మళ్ళీ చూడటం కష్టమే. అయినా కూడా యుఎస్ […]
ఎన్నో ఆశలు పెట్టుకుంటే వాటిని ఆవిరి చేస్తూ ఆర్ఆర్ఆర్ బదులు గుజరాతీ సినిమా చేల్లో షోని ఇండియా తరఫున ఆస్కార్ అఫీషియల్ ఎంట్రీగా పంపడం మూవీ లవర్స్ తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. ఇంతా చేసి ఇప్పుడు నామినేట్ చేసిన చిత్రం కూడా 1988లోనే అకాడెమి అవార్డు గెలుచుకున్న ‘సినిమా పారాడిసో’కి ఫ్రీమేక్ అన్న విషయం అగ్నికి మరింత ఆజ్యం పోస్తోంది. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా దేశ విదేశాల్లో వంద రోజులు తర్వాత కూడా ప్రశంసలు […]
ఇంకా నిర్మాణంలో ఉన్న దర్శకుడు శంకర్ సినిమా తాలూకు అప్డేట్లే సరిగా రావడం లేదు.ఈలోగా రామ్ చరణ్ 16వ సినిమా గురించి రకరకాల ప్రచారాలు మొదలైపోయాయి. గతంలోనే జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరికి చెర్రీ కమిట్ మెంట్ ఇచ్సిన సంగతి తెలిసిందే. యువి సంస్థ తరఫున కొన్ని నెలల క్రితమే అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చింది. అయితే లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఇది క్యాన్సిల్ అయ్యిందట. ఫైనల్ వెర్షన్ హీరోతో అందరికీ నచ్చేలా సంతృప్తికరంగా లేకపోవడంతో […]
బాహుబలి, RRR లాంటి సినిమాలకు సక్సెస్ ఫుల్ స్టోరీస్ అందించిన స్టార్ రైటర్, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) పై సినిమాకి సన్నాహాలు చేస్తున్నారు. RSS జాతీయ సమాఖ్య సభ్యుడు రామ్ మాధవ్ రచించిన “ది హిందూత్వ పారడైమ్” పుస్తక పరిచయం విజయవాడలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయేంద్ర ప్రసాద్ ఈ మేరకు వెల్లడించారు. నాలుగేళ్ళ క్రితం ఆరెస్సెస్ పై కథ రాయాలని కొందరు కోరగా నాగ్ […]
ఆస్కార్ 2023లో ఇండియాకు ఒక అవార్డు గ్యారంటీయేనని, ఒక హాలీవుడ్ ఫిల్మ్ పోర్టల్ అంచనావేసింది., SS రాజమౌళి సినిమా, ఆర్ఆర్ఆర్( RRR)ను ఇండియా తరుపున, అధికారిక ఎంట్రీగా పంపితే, ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగం (Best International Feature Film) లో గెలవడానికి మంచి అవకాశం ఉందని అంటోంది. ఎస్ఎస్ రాజమౌళి RRR సినిమా హాలీవుడ్ ను గట్టిగా ఆకర్షించింది. మార్వెల్ ఫిల్మ్స్కు హార్డ్ ఫ్యాన్స్ కూడా, RRRని నమ్మదగని సినిమా అనుభవంగా వర్ణింనించారు. ఇప్పుడు, […]
బాహుబలి, ఆర్ఆర్ఆర్ లతో అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా జెండా రెపరెపలాడేలా చేసిన దర్శకుడు రాజమౌళితో ఓటిటి దిగ్గజం నెట్ ఫ్లిక్స్ ఇటీవలే ఒప్పందం కుదుర్చుకున్నట్టు మీడియా టాక్. ఇందులో భాగంగా వెబ్ సిరీస్, మూవీస్ ని పర్యవేక్షించే బాధ్యత ఆయన తీసుకుంటారట. కథకులుగా అధిక భాగం విజయేంద్ర ప్రసాదే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆల్రెడీ రజాకార్ల నేపథ్యంలో ఓ సబ్జెక్టుని ఆయన స్టార్ట్ చేశారు. డైరెక్షన్ ఎవరు చేస్తారనేది చెప్పలేదు కానీ కృష్ణవంశీ లేదా […]
అసలు రాజ్యసభకు నామినేషన్ అందుకోవాలంటే కావాల్సిన అర్హతేంటి. ఆ పదవి వచ్చాక దేశం పట్ల సమాజం పట్ల మనకు ఎలాంటి బాధ్యతలు ఉంటాయి. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా జరుగుతున్న చర్చ. ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ కు ఆ గౌరవం దక్కడం పట్ల సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అంతటి ఉన్నతమైన గౌరవానికి ఆయన అర్హుడని బిజెపి ప్రభుత్వం ఏ ప్రాతిపదికన నిర్ణయం తీసుకుందనే కోణంలో పెద్ద పోస్ట్ మార్టమే జరుగుతోంది. ఇళయరాజా గురించి […]
ఇండియన్ సినిమా త్రాచు బాలీవుడ్ నుంచి దక్షిణాది సినిమా రంగంవైపు మొగ్గుచూపుతోంది. ఇండియన్ సినిమా అంటే మిగిలిన ప్రపంచానికి బాలీవుడ్. కాని ఇండియాలో లెక్కవేస్తే తెలుగు సినిమా రంగానికి సరితూగడంలేదు. ఇండియా వినోద పరిశ్రమ విలువు $24 బిలియన్లు. మాస్ పల్స్ ను పట్టేసిన రీజనల్ సినిమాలు ఇప్పుడు ఇండియన్ సినీ మార్కెట్ ను శాసిస్తున్నాయి. దక్షిణాది సినీ నిర్మాతలు యాక్షన్-ప్యాక్డ్ మూవీలను వరసపెట్టి వదులుతుంటే, నార్త్ ఇండియా అభిమానులు ఆవురావురమంటూ మహారాజపోషకులైపోతున్నారు. “K.G.F.”,“పుష్ప” యాక్షన్ ఫ్రాంచైజీలైపోయాయి. […]