iDreamPost
android-app
ios-app

మహేష్ రాజమౌళి – అంతకు మించి

  • Published Dec 05, 2022 | 5:14 PM Updated Updated Dec 05, 2022 | 5:14 PM
మహేష్ రాజమౌళి – అంతకు మించి

ఇంకా స్క్రిప్ట్ దశలో ఉండగానే మహేష్ బాబు రాజమౌళి కాంబో గురించి ఓ రేంజ్ లో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇటీవలే జపాన్, యుఎస్ తదితర దేశాల్లో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లు పూర్తి చేసుకున్న వచ్చిన జక్కన్న ఆస్కార్ వచ్చేందుకు అవకాశమున్న ఏ దారిని వదలడం లేదు. ఇటీవలే న్యూ యార్క్ క్రిటిక్స్ అసోసియేషన్ బెస్ట్ డైరెక్టర్ అవార్డు ప్రకటించాక నమ్మకం ఇంకాస్త పెరిగింది. ఎందుకంటే ఈ పురస్కారం అందుకున్న 22 దర్శకుల్లో 16 మంది అకాడెమి అవార్డు గెలుచుకున్నారు. అందుకే రాజమౌళి గెలుపు మీద భరోసా రెట్టింపయ్యింది. జపాన్ లో ఏకంగా ముత్తు రికార్డుకు దగ్గరగా వెళ్లడం గురించి బాలీవుడ్ నిర్మాతలు ఈర్ష్యతో రగిలిపోతున్నారు

ఇదిలా ఉండగా మహేష్ 29కి సంబంధించిన ఇన్ఫో ఒక్కొక్కటిగా బయటికి వస్తోంది. సుప్రసిద్ధ హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ తరహాలో ఫారెస్ట్ అడ్వెంచర్ గా దీన్ని రూపొందించబోతున్నట్టు రాజమౌళి గతంలోనే హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే . కథకులు విజయేంద్ర ప్రసాద్ ఈ విషయాన్నే ధృవీకరిస్తున్నారు. మహేష్ లాంటి ఈజ్ ఉన్న సూపర్ స్టార్ తో ఇలాంటి గ్రాండియర్ తీస్తేనే న్యాయం జరుగుతుందని అందుకే జక్కన్న చెప్పగానే ఆ లైన్ మీద సబ్జెక్టు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. 90 దశకంలో ఆడియన్స్ ని ఊపేసిన ఇండియనా జోన్స్ రేంజ్ లో ఇప్పటి టెక్నాలజీని ఉపయోగించి తీయడమంటే ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు

2023 వేసవి తర్వాత షూటింగ్ మొదలుకావొచ్చు. కనీసం రెండేళ్లు దీని నిర్మాణానికి అవసరం. త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమా అయ్యాక వెంటనే దీన్ని స్టార్ట్ చేస్తారా లేక మరొకటి త్వరగా చేసేందుకు మహేష్ టైం తీసుకుంటాడా అనేది వేచి చూడాలి. ఏదో విక్రమార్కుడు లాగా కమర్షియల్ ఎంటర్ టైనరైతే త్వరగా అయిపోతుందని అనుకోవచ్చు. కానీ రాజమౌళి చెప్పిన బ్యాక్ డ్రాప్ ప్రకారం అదంత సులభం కాదు. మహేష్ జయంత్ డైరెక్షన్లో అడవి నిధుల నేపథ్యంతో టక్కరి దొంగ చేశాడు కానీ అది ఆశించిన ఫలితం ఇవ్వలేకపోయింది. అందుకే ఈసారి గ్లోబల్ రేంజ్ లో ప్యాన్ వరల్డ్ సినిమాతో రాజమౌళితో చేతులు కలిపాడు. ఏ రేంజ్ లో ఉంటుందో మరి