iDreamPost
android-app
ios-app

సైమా అవార్డ్స్ 2023: టాప్ లో RRR, సీతారామం.. పూర్తి వివరాలివే!

  • Author ajaykrishna Updated - 04:24 PM, Sat - 16 September 23
  • Author ajaykrishna Updated - 04:24 PM, Sat - 16 September 23
సైమా అవార్డ్స్ 2023: టాప్ లో RRR, సీతారామం.. పూర్తి వివరాలివే!

సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2023 ఫెస్టివల్ దుబాయ్ లో ఘనంగా ప్రారంభమైంది. దక్షిణాది చిత్రాలకు, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఈ సైమా వారి ప్రతిభకు పట్టం కడుతూ అవార్డులు అందిస్తుంది. గత పదేళ్లుగా జరుగుతున్న సైమా వేడుకలు.. ఈసారి 11వ వసంతం జరుపుకుంటున్నాయి. ఈ ఈవెంట్ కి టాలీవుడ్ స్టార్స్ రానా దగ్గుబాటి, మంచు లక్ష్మి వ్యాఖ్యతలు వ్యవహారించారు. కాగా.. మొదటి రోజు అనగా.. సెప్టెంబర్ 15న తెలుగుతో పాటు కన్నడ భాషకు సంబంధించిన అవార్డులు అందించడం పూర్తయింది. సెప్టెంబర్ 16న తమిళం, మలయాళం ఇండస్ట్రీలకు సంబంధించి అవార్డుల వేడుకలు జరగనున్నాయి.

ఇక ఈ ఏడాది సైమా వేడుకలలో.. తెలుగు నుండి పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్, బ్లాక్ బస్టర్ సీతారామం సినిమాలు అత్యధిక అవార్డులు కైవసం చేసుకున్నాయి. ఆర్ఆర్ఆర్ కు బెస్ట్ యాక్టర్, డైరెక్టర్, లిరిక్స్ తో పాటు సీతారామం మూవీకి బెస్ట్ మూవీ, బెస్ట్ ఫిమేల్ డెబ్యూ అవార్డులతో పాటు మరికొన్ని వరించాయి. కాగా.. ఈ వేడుకలకు దర్శకుడు రాజమౌళి రాకపోవడంతో అవార్డును జూనియర్ ఎన్టీఆర్ అందుకోగా.. కీరవాణి అవార్డును లిరిసిస్ట్ చంద్రబోస్ అందుకున్నారు. అనంతరం బెస్ట్ యాక్టర్ అవార్డు పొందిన ఎన్టీఆర్.. ఎమోషనల్ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి పూర్తి విజేతల లిస్ట్ ఇప్పుడు చూద్దాం!

సైమా 2023 విన్నర్స్:

  • ఉత్తమ నటుడు – ఎన్టీఆర్ (RRR)
  • ఉత్తమ నటి – శ్రీ లీల (ధమాకా)
  • ఉత్తమ దర్శకుడు – ఎస్ఎస్ రాజమౌళి
  • ఉత్తమ చిత్రం- సీతారామం
  • ఉత్తమ సంగీత దర్శకుడు – ఎంఎం కీరవాణి (RRR)
  • ఉత్తమ ఛాయాగ్రాహకుడు – కె. సెంథిల్ కుమార్ (RRR)
  • ఉత్తమ సాహిత్యం – చంద్రబోస్ (RRR)
  • ఉత్తమ నటుడు (క్రిటిక్స్) – అడివి శేష్ (మేజర్)
  • ఉత్తమ నటి (క్రిటిక్స్) – మృణాల్ ఠాకూర్ (సీతారామం)
  • బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ – వశిష్ఠ (బింబిసార)
  • బెస్ట్ డెబ్యూ (హీరో) – అశోక్ గల్లా (హీరో)
  • బెస్ట్ డెబ్యూ (హీరోయిన్) – మృణాల్ ఠాకూర్ (సీతారామం)
  • బెస్ట్ డెబ్యూడెంట్ ప్రొడ్యూసర్స్ – శరత్ & అనురాగ్ (మేజర్)
  • సెన్సేషనల్ ఆఫ్ ది ఇయర్ – కార్తికేయ 2
  • ఉత్తమ సహాయ నటుడు – రానా దగ్గుబాటి (భీమ్లా నాయక్)
  • ఉత్తమ సహాయ నటి – సంగీత (మాసూద)
  • ఉత్తమ విలన్ – సుహాస్ (హిట్ 2)
  • ఉత్తమ హాస్యనటుడు – శ్రీనివాస రెడ్డి (కార్తికేయ 2)
  • ఫ్యాషన్ యూత్ ఐకాన్ – శృతి హాసన్
  • ప్రామిసింగ్ స్టార్ – బెల్లంకొండ గణేష్