iDreamPost
android-app
ios-app

ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టిన జేమ్స్ కామెరాన్!

  • Published Jan 22, 2023 | 12:04 AM Updated Updated Dec 05, 2023 | 5:23 PM

సినిమాలో మా హీరోనే మెయిన్, మా హీరోనే బాగా నటించాడు, మా హీరోకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది..

సినిమాలో మా హీరోనే మెయిన్, మా హీరోనే బాగా నటించాడు, మా హీరోకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది..

  • Published Jan 22, 2023 | 12:04 AMUpdated Dec 05, 2023 | 5:23 PM
ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టిన జేమ్స్ కామెరాన్!

రాజమౌళి ఏ ముహూర్తాన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తో ఆర్ఆర్ఆర్ అనే మల్టీస్టారర్ తీసాడో గాని అప్పటినుంచి ఇద్దరు హీరోల ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా గొడవ పడుతూనే ఉన్నారు. సినిమాలో మా హీరోనే మెయిన్, మా హీరోనే బాగా నటించాడు, మా హీరోకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.. ఇలా రకరకాల అంశాల మీద గొడవ పడుతూనే ఉన్నారు. వాళ్లు గొడవ పడే అంశాలు మారుతున్నాయి కానీ గొడవకు మాత్రం ఫుల్ స్టాప్ పడట్లేదు. ఇక తాజాగా హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్ సైతం తెలిసో తెలియకో ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టేశాడు.

ఇటీవల క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ లో బెస్ట్ ఫారెన్ ల్యాంగ్వేజ్ ఫిల్మ్, బెస్ట్ సాంగ్ విభాగాల్లో ఆర్ఆర్ఆర్ అవార్డులు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలో రాజమౌళితో జేమ్స్ కామెరాన్ ప్రత్యేకంగా ముచ్చటించడం హిట్ టాపిక్ గా మారింది. ఆర్ఆర్ఆర్ ను ఆయన ప్రశంసించారని తెలిసింది కానీ ఏమని ప్రశంసించారు అనేది మాత్రం తెలియలేదు. అయితే ఆయన రాజమౌళితో మాట్లాడిన వీడియో క్లిప్స్ తాజాగా రివీల్ అయ్యాయి. ఒక క్లిప్ లో ఆయన యాక్టర్ ఇంట్రడక్షన్ బాగుందని, కళ్ళు ఓపెన్ చేయగానే వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుందని చెప్పాడు. అయితే ఆయన మాట్లాడింది భీమ్ ఇంట్రడక్షన్ గురుంచి అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ గర్వంగా ఆ వీడియో క్లిప్ ను షేర్ చేస్తున్నారు. చరణ్ ఫ్యాన్స్ మాత్రం క్లిప్ లో మాట్లాడింది రామ్ ఇంట్రో గురించి అని స్పష్టంగా తెలుస్తున్నా కావాలని క్రెడిట్ కొట్టేయడానికి చూస్తున్నారు అంటూ మండిపడుతున్నారు. సైడ్ హీరో, యాక్టింగ్ రాదు అంటూ మొదలై ఒకరినొకరు బూతులు తిట్టుకునే దాకా వెళ్ళిపోయారు. ఇలా ఇరు హీరోల అభిమానుల మధ్య గొడవ తారాస్థాయికి చేరింది.

సోషల్ మీడియాలో మాటల యుద్ధం చేస్తున్న ఎన్టీఆర్, చరణ్ అభిమానుల తీరుపై న్యూట్రల్ సినీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఏ తెలుగు సినిమాకి రానంత గుర్తింపు అంతర్జాతీయ స్థాయిలో ఆర్ఆర్ఆర్ కి దక్కింది. ఆస్కార్ బరిలో నిలిచే అవకాశం ఉందని హాలీవుడ్ బడా మీడియా సంస్థలే అంచనా వేస్తున్నాయి. తమ హీరో నటించిన సినిమాకి ఈ స్థాయి గుర్తింపు వచ్చిందని గర్వపడాల్సింది పోయి.. ఇలా సోషల్ మీడియాలో గొడవ పడుతూ.. తమ హీరో పరువుతో పాటు తెలుగు సినిమా పరువు తీస్తున్నారు అంటూ సినీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş