iDreamPost
android-app
ios-app

జాతీయ అవార్డు విన్నర్ల ప్రైజ్ మనీతో పాటు ఏమేం ఇస్తారంటే..

  • Published Aug 26, 2023 | 4:41 PM Updated Updated Aug 26, 2023 | 4:41 PM
  • Published Aug 26, 2023 | 4:41 PMUpdated Aug 26, 2023 | 4:41 PM
జాతీయ అవార్డు  విన్నర్ల ప్రైజ్ మనీతో  పాటు  ఏమేం ఇస్తారంటే..

‘పుప్ప’.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతున్న సినిమా. కారణం 69వ జాతీయ చలన చిత్రం అవార్డులు దుమ్ములేపింది.  ఈ సినిమాలో అల్లు అర్జున్ నటకు ఉత్తమ జాతీయ నటుడు అవార్డు గెలుచుకున్నాడు. కేవలం అవార్డును గెలవడమే కాకుండా టాలీవుడ్ హిస్టరీలో బన్నీ ఓ సరికొత్త రికార్డు సొంతం చేసుకున్నాడు. టాలీవుడ్ చరిత్రలో జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న తొలి వ్యక్తిగా అల్లు అర్జున్ రికార్కడు సృష్టించాడు. దీంతో బన్నీ ప్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. అయితే విజేతలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ అవార్డులతో పాటు మరేం ఇస్తారని నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.

జాతీయ చలనచిత్ర అవార్జుల విజేతలకు స్వర్ణ కమలం, రజత కమలంతో పాటు నగదును బహుమతిగా అందిస్తారు. అంతేకాకుండా గుర్తింపుగా ప్రశంసా పత్రాలను కూడా అందిస్తారు. కానీ జ్యూరీ నుంచి అభినందలు అందుకున్న సినిమాలకు మాత్రం కేవలం సర్టిఫికేట్ మాత్రమే  అందిస్తారు. జ్యూరీ స్పెషల్ విజేతలకు మాత్రం ప్రశంసా పత్రంతో పాటు నగదు బహుమతి కూడా అందజేస్తారు. ఈక్రమంలో 69వ జాతీయ అవార్డు అందుకోబోతున్న విజేత జాబితా ఇప్పటికే జ్యూరి సభ్యలు విడుదల చేశారు.

ఇందులో భాగంగా ఉత్తమ నటుడిగా ఎంపికైన అల్లు అర్జున్, ఉత్తమ నటీమణులుగా ఎంపికైన అలియా భట్, కృతి సనన్ లకు ఒక్కొక్కరికి  రూ.50 వేల నగదుతో పాటు రజత కమలాన్ని కేంద్రం  అందిస్తుంది.  ఇక ఉత్తమ చిత్రంగా ఎంపికైన రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్ కు  రూ.2.50 లక్షల నగదుతో పాటు స్వర్ణ కమలాన్ని అందజేయనున్నారు. ఉత్తమ వినోదాత్మక చిత్రంగా ఎంపికైన RRR మూవీకి రూ.2 లక్షలతో పాటుగా స్వర్ణ కమలాన్ని అందజేయనున్నారు. ఉత్తమ అవార్డు గెలుచుకున్న నిఖిల్ మహాజన్ (గోదావరి మరాఠ మూవీ)కు రజత కమలంతో పాటుగా రూ. 2.50 లక్షల నగదు బహుమతిని ప్రధానం చేస్తారు.

ఉత్తమ జాతీయ సమగ్రత చిత్రంగా ఎంపికైన ‘ది కశ్మీర్ ఫైల్స్’ కు రజత కమలంతో పాటుగా రూ. 1.50 లక్షల డబ్బు ఇస్తారు. చివరిగా స్పెషల్ జ్యూరీ అవార్డుకు ఎంపికైన షేర్షా మూవీకి రజత కమలాన్ని, రూ. 2 లక్షల నగదును కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఇక బన్ని విషయానికి వస్తే.. పుష్ప సినిమాలో చేసిన పుష్పరాజ్ పాత్రకు గానూ 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ జాతీయ నటుడు అవార్డు గెల్చుకున్నాడు. అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కించుకున్నాడని తెలిసిన అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు. అందరూ బన్నీని పొగడ్తలతో ముంచెత్తారు. సుకుమార్ అయితే అల్లు అర్జున్ ని హగ్ చేసుకుని ఎమోషనల్ అయ్యాడు.

ఇదీ చదవండి: నేషనల్ అవార్డు విన్నర్స్ కు ప్రైజ్ మనీ ఎంత వస్తుందో తెలుసా?

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbayspin girişgrandpashabet