iDreamPost
android-app
ios-app

సంక్రాంతికి వస్తున్నాం సిక్వెల్ స్టార్ట్ అవుతుందా !

  • Published Jan 20, 2026 | 4:03 PM Updated Updated Jan 20, 2026 | 4:03 PM

సంక్రాంతి వస్తుందంటే ముందుగా గుర్తొచ్చేది అనిల్ రావిపూడి సినిమాలే. ప్రతి ఏడాది సంక్రాంతికి ఓ అదిరిపోయే సినిమాతో రావడం హిట్ కొట్టడం వెళ్లిపోవడం. ఇది అనిల్ రావిపూడికి రొటీన్ అయిపోయింది. పైగా కోట్లు కోట్లు బడ్జెట్ ఇన్వెస్ట్ చేయడం .. నెలల తరబడి షూటింగ్స్ చేయడం ఇవేమి ఉండవు. మహా అయితే గట్టిగ ఓ ఆరు నెలలు షూటింగ్ ఉంటుంది అంతే.

  • Published Jan 20, 2026 | 4:03 PMUpdated Jan 20, 2026 | 4:03 PM
సంక్రాంతికి వస్తున్నాం సిక్వెల్ స్టార్ట్ అవుతుందా !

సంక్రాంతి వస్తుందంటే ముందుగా గుర్తొచ్చేది అనిల్ రావిపూడి సినిమాలే. ప్రతి ఏడాది సంక్రాంతికి ఓ అదిరిపోయే సినిమాతో రావడం హిట్ కొట్టడం వెళ్లిపోవడం. ఇది అనిల్ రావిపూడికి రొటీన్ అయిపోయింది. పైగా కోట్లు కోట్లు బడ్జెట్ ఇన్వెస్ట్ చేయడం .. నెలల తరబడి షూటింగ్స్ చేయడం ఇవేమి ఉండవు. మహా అయితే గట్టిగ ఓ ఆరు నెలలు షూటింగ్ ఉంటుంది అంతే. కానీ రిటర్న్స్ మాత్రం బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టే విధంగా ఉంటాయి. ఈ సంక్రాంతి అయితే అయిపోయింది.

ఇక అప్పుడే అనిల్ నెక్స్ట్ సంక్రాంతిని టార్గెట్ చేసే ప్లాన్ వేస్తున్నాడు. అప్పుడెప్పుడో సంక్రాంతికి వస్తున్నాం సిక్వెల్ గురించి కొన్ని టాక్స్ వినిపించాయి . ఆ సినిమా టైటిల్ కూడా మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం అని అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఎలాగూ ఈ సంక్రాంతి కంప్లీట్ అయింది కాబట్టి.. ఈసారి సంక్రాంతికి మరోసారి వెంకటేష్ ను బరిలోకి దింపే ప్లాన్ లో ఉన్నాడట అనిల్ రావిపూడి. అటు వెంకటేష్ మరో డైరెక్టర్ తో ఓ కొత్త సినిమాతో బిజిగా ఉన్నాడు. మరి అనిల్ రావిపూడికి డేట్స్ ఇస్తాడా లేదా అనేది చూడాలి. అలాగే ఇంకా ఆ కథను ముందుకు తీసుకువెళ్ళడానికి అనిల్ ఎలాంటి ప్లాట్స్ రాసుకున్నాడో తెలియదు.

అలాగే మరోవైపు ఈ సినిమాకు రీమేక్ ను కూడా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. హిందీలో స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఓ దర్శకుడితో ఈ సినిమాను తీయాలని అనుకున్నాడు . కానీ కొన్ని కారణాల వలన ఇది సాధ్యపడలేదు. మరి ఇకనైనా ఆ రీమేక్ ఉంటుందో.. లేదా ఈ సిక్వెల్ ఉంటుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.