iDreamPost
android-app
ios-app

‘RRR’ సీక్వెల్ కోసం క్లాస్ డైరెక్టర్ ఎంటర్ అవుతున్నాడా?

  • Author ajaykrishna Updated - 09:12 AM, Tue - 25 July 23
  • Author ajaykrishna Updated - 09:12 AM, Tue - 25 July 23
‘RRR’ సీక్వెల్ కోసం క్లాస్ డైరెక్టర్ ఎంటర్ అవుతున్నాడా?

దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన పాన్ ఇండియా మల్టీస్టారర్ మూవీ ‘RRR’. బాహుబలి సిరీస్ తో వరల్డ్ వైడ్ ఊహించని రికార్డులు కొల్లగొట్టిన రాజమౌళి.. అదే సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు, మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. దీంతో రాజమౌళి సినిమా అంటే.. వరల్డ్ క్లాస్ మూవీ అని ప్రేక్షకులకు అర్థమైంది. అయితే.. బాహుబలి తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమా ఏ రేంజ్ లో విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో మల్టీస్టారర్ గా రూపొందిన ఆ సినిమా.. గతేడాది బాక్సాఫీస్ ని షేక్ చేసింది. పైగా ఆస్కార్ అవార్డులలో సత్తా చాటి ‘నాటు నాటు’ సాంగ్ కి ఆస్కార్ సైతం అందుకుంది.

ఇక ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డుల తర్వాత ఏకంగా ఆస్కార్ వరించేసరికి ఒక్కసారిగా మళ్ళీ అందరి దృష్టి ఆర్ఆర్ఆర్ సీక్వెల్ పై పడింది. ఈ మధ్యకాలంలో ఏ సినిమా హిట్ అయినా దానికి సీక్వెల్స్ లేదా ప్రీక్వెల్స్ తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే. ఆ విధంగా ఆర్ఆర్ఆర్ కి కూడా సీక్వెల్ కావాలని ఫ్యాన్స్ అనుకున్నారు. ఆ తర్వాత దీనిపై రాజమౌళి తండ్రి, రైటర్ విజయేంద్ర ప్రసాద్ కూడా ఓ ఇంటర్వ్యూలో ఆర్ఆర్ఆర్ కి సీక్వెల్ ప్లాన్ జరుగుతుందని క్లారిటీ ఇచ్చాడు. పైగా స్టోరీ లైన్ కూడా వేరు అని.. ఈసారి ఎక్కువ హాలీవుడ్ ధోరణిలో సాగనుందని కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పి మళ్ళీ ఆర్ఆర్ఆర్ 2 పై అంచనాలు పెంచేశారు.

ఇంకేముంది బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 1200 కోట్లు వసూల్ చేసిన ఆర్ఆర్ఆర్ కి సీక్వెల్ అంటే మినిమమ్ అంచనాలు సెట్ అయిపోయాయి. ఈసారి కూడా ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తారని అంటున్నారు. కానీ.. ఆర్ఆర్ఆర్ సీక్వెల్ కి డైరెక్టర్ రాజమౌళి అని మాత్రం క్లారిటీ ఇవ్వలేనని, రాజమౌళి పర్యవేక్షణలో వేరే డైరెక్టర్ RRR 2ని తెరకెక్కించే అవకాశం ఉందని అన్నారు. దీంతో వేరే డైరెక్టర్ అంటే.. హాలీవుడ్ నుండి అనుకున్నారు అంతా. కానీ.. తాజా సమాచారం ప్రకారం.. టాలీవుడ్ నుండే రాజమౌళికి బాగా ఇష్టమైన దర్శకులలో ఒకరైన క్లాస్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి ఈ క్రేజీ సీక్వెల్ ని డైరెక్ట్ చేస్తారని టాక్. దీనిపై క్లారిటీ రావాలంటే ఇంకొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే. ఇదిలా ఉండగా.. రాజమౌళి తదుపరి సినిమా మహేష్ బాబుతో చేస్తున్నాడు. మరి RRR 2 గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet