Swetha
సంక్రాంతి హడావిడి అయిపోయింది. ఇప్పుడు సినిమా లవర్స్ అంతా ఎదురుచూసేది సమ్మర్ సీజన్ కోసమే. సంక్రాంతి తర్వాత ఆ రేంజ్ లో సినిమాలు రిలీజ్ అయ్యేది సమ్మర్ కే. సమ్మర్ లో ఐపిఎల్ ప్రభావం గట్టిగానే ఉంటుంది. దానివలన సినిమాలు కాస్త అటు ఇటుగా రిలీజ్ అవుతూ ఉంటాయి. కానీ ఈసారి మాత్రం కాస్త కాంపిటీషన్ టఫ్ గానే కనిపిస్తుంది అలానే ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంది.

సంక్రాంతి హడావిడి అయిపోయింది. ఇప్పుడు సినిమా లవర్స్ అంతా ఎదురుచూసేది సమ్మర్ సీజన్ కోసమే. సంక్రాంతి తర్వాత ఆ రేంజ్ లో సినిమాలు రిలీజ్ అయ్యేది సమ్మర్ కే. సమ్మర్ లో ఐపిఎల్ ప్రభావం గట్టిగానే ఉంటుంది. దానివలన సినిమాలు కాస్త అటు ఇటుగా రిలీజ్ అవుతూ ఉంటాయి. కానీ ఈసారి మాత్రం కాస్త కాంపిటీషన్ టఫ్ గానే కనిపిస్తుంది అలానే ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంది. ప్రస్తుతం సమ్మర్ లో ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్న సినిమాలు రామ్ చరణ్ పెద్ది , నాని ప్యారడైజ్. ఈ రెండు సినిమాలలో ఏది ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది ఇంకా క్లారిటీ రాలేదు.
కానీ ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ రెండిటిలో ఒకటి వస్తే మరొకటి పోస్ట్ పోన్ అవుతుందట. అయితే ఇందులో నాని ప్యారడైజ్ సినిమా డ్రాప్ అవ్వబోతున్నట్లు అఫీషియల్ టాక్స్ వినిపిస్తున్నాయి. ఈ విషయాన్నీ స్వయంగా సినిమా నిర్మాత సుధాకర్ చెరుకూరి అనౌన్స్ చేశారు. ‘పారడైజ్ మార్చిలో తీసుకురాడానికి ప్రయుత్నిస్తున్నాం. అయితే చరణ్ గారి సినిమా వస్తే ఆ సినిమా మీద వేసే పరిస్థితి వుండదు. సమ్మర్ పెద్ద సీజన్. ఈ సమ్మర్ లో చాలా గ్యాప్ వుంది. సినిమాలు పెద్దగా లేవు. నెలకొక పెద్ద సినిమాకి అవకాశం వుంది. క్లాస్ వుండదు’ అన్నారు.
సో ఈ లెక్కన రామ్ చరణ్ పెద్ది సినిమా వస్తే.. నాని ప్యారడైజ్ వాయిదా పడినట్టే. రెండు పెద్ద సినిమాలే రెండు పాన్ ఇండియా సినిమాలే కాబట్టి గ్యాప్ తీసుకున్నా వచ్చే నష్టమైతే ఏమి లేదు. ఒకవేళ ప్యారడైజ్ వస్తే పెద్ది పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ కూడా లేకపోలేదు . ఇక ఎవరి కోసం ఎవరు శాక్రిఫైజ్ చేస్తారో చూడాలి. ముందు ముందు ఈ సినిమాల నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో అవి ఈ సినిమాల మీద ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.