iDreamPost
కనీసం రెండు, మూడు విభాగాల్లోనైనా ఆర్ఆర్ఆర్ నిలుస్తుందని భావించారు. అయితే తాజాగా ప్రకటించిన కొన్ని కేటగిరీల్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా నాటు నాటు షార్ట్ లిస్ట్ అయింది.
కనీసం రెండు, మూడు విభాగాల్లోనైనా ఆర్ఆర్ఆర్ నిలుస్తుందని భావించారు. అయితే తాజాగా ప్రకటించిన కొన్ని కేటగిరీల్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా నాటు నాటు షార్ట్ లిస్ట్ అయింది.
iDreamPost
‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఆస్కార్ బరిలో నిలుస్తుందని తెలుగు ప్రేక్షకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆస్కార్ నామినేషన్స్ కి షార్ట్ లిస్ట్ అయిన 15 చిత్రాల వివరాలు ప్రకటిస్తున్నారని తెలిసి అందరూ చాలా ఎక్సైట్ అయ్యారు. కనీసం రెండు, మూడు విభాగాల్లోనైనా ఆర్ఆర్ఆర్ నిలుస్తుందని భావించారు. అయితే తాజాగా ప్రకటించిన కొన్ని కేటగిరీల్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా నాటు నాటు షార్ట్ లిస్ట్ అయింది.
మరే ఇండియన్ సినిమాకి దక్కని విధంగా హాలీవుడ్ ప్రేక్షకులు, విశ్లేషకుల ప్రశంసలు ఆర్ఆర్ఆర్ కి దక్కాయి. ఈ చిత్రం పలు విభాగాల్లో ఆస్కార్ నామినేషన్స్ లో నిలుస్తుందనే అంచనాలు ముందు నుంచే ఉన్నాయి. ఆ అంచనాలను నిజం చేస్తూ ఒరిజినల్ సాంగ్ విభాగంలో షార్ట్ లిస్ట్ అయ్యి సత్తా చాటింది ఆర్ఆర్ఆర్.
కేటగిరీకి 15 చొప్పున.. డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్, ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్, మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్, ఒరిజినల్ స్కోర్, ఒరిజినల్ సాంగ్, సౌండ్, విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు మరో మూడు షార్ట్ ఫిల్మ్ కేటగిరీలు కలిపి.. మొత్తం 10 విభాగాల్లో షార్ట్ లిస్ట్ అయిన చిత్రాల వివరాలను ఆస్కార్స్ ప్రకటించింది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ నుంచి నాటు నాటు సాంగ్ స్థానం సంపాదించుకుంది. ఇక ఆర్ఆర్ఆర్ ని కాదని ఇండియా తరఫున అఫిషియల్ ఎంట్రీగా పంపిన గుజరాతీ ఫిల్మ్ ‘లాస్ట్ ఫిల్మ్ షో’ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో చోటు దక్కించుకోవడం విశేషం.
ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఒక ఊపు ఊపిన సాంగ్ నాటు నాటు అనడంలో ఎలాంటి అనుమానం లేదు. భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా అన్ని చోట్లా ఈ పాట ప్రభంజనం కనిపించింది. మిగతా విభాగాల్లో ఆర్ఆర్ఆర్ ఎలా సత్తా చాటుతుందో తెలీదు కానీ నాటు నాటు మాత్రం ఖచ్చితంగా ఆస్కార్ గెలుస్తుందని అభిప్రాయపడిన వాళ్ళు ఉన్నారు. మరి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా సత్తా చాటిన నాటు నాటు.. ఇదే ఊపులో ఆస్కార్ గెలిచి సంచలనం సృష్టిస్తుందేమో చూడాలి.