iDreamPost
android-app
ios-app

రాజమౌళికి నిరాశ.. NTR, రామ్ చరణ్ లకు అరుదైన గౌరవం!

  • Author Soma Sekhar Published - 03:40 PM, Thu - 29 June 23
  • Author Soma Sekhar Published - 03:40 PM, Thu - 29 June 23
రాజమౌళికి నిరాశ.. NTR, రామ్ చరణ్ లకు అరుదైన గౌరవం!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ RRR. దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇక ఈ సినిమా వసూళ్ల పరంగా ఎలాంటి రికార్డులు సాధించిందో అందరికి తెలిసిందే. అదీకాక ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డును సైతం కొల్లగొట్టింది ఆర్ఆర్ఆర్ మూవీ. ఇక వరల్డ్ వైడ్ గా ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది ఈ మూవీ. ఈ క్రమంలోనే మరో అరుదైన ఫీట్ ను అందుకున్నారు ఆర్ఆర్ఆర్ టీమ్. కాగా.. రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు అరుదైన గౌరవం దక్కింది. అయితే ఆర్ఆర్ఆర్ ను తెరకెక్కించిన జక్కన్నకు మాత్రం ఈ విషయంలో నిరాశే ఎదురైంది. మరి జక్కన్నకు ఏ విషయంలో నిరాశ ఎదురైంది? రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు దక్కిన అరుదైన గౌరవం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

RRR.. దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం. ఇక ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు కలిసి నటించగా.. ఎన్నో రికార్డులను కొల్లగొట్టింది. భారీ వసూళ్లతో పాటుగా సినిమా ఇండస్ట్రీ ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డును కూడా కైవసం చేసుకుంది ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో.. ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. దీంతో ఇండియా మెుత్తం గర్వించింది. తాజాగా మరోసారి ఇండియన్ సినీ ప్రేక్షకులు గర్వించే క్షణం వచ్చింది. తాజాగా ఆస్కార్ కమిటీ నుంచి ఆర్ఆర్ఆర్ టీమ్ కు ఆహ్వానం అందింది.

ఆ ఆహ్వానంలో ఏముందంటే? అకడెమీ జ్యూరీ మెంబర్స్ గా ఆరుగురిని సెలెక్ట్ చేశారు. అందులో రామ్ చరణ్, ఎన్టీఆర్, సాబుసిరిల్, సెంథిల్ కుమార్, చంద్రబోస్, కీరవాణిలకు జ్యూరీ మెంబర్స్ గా స్థానం లభించింది. దాంతో ఈ గౌరవం పొందిన అతి తక్కువ నటీ, నటుల జాబితాలో వీరు చేరారు. ఇక జాబితాలో దర్శక ధీరుడికి చోటు దక్కకపోవడం గమనార్హం. ఆర్ఆర్ఆర్ సినిమాకు కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన జక్కన్నకే అకాడెమీ జ్యూరీ మెంబర్ గా సెలక్ట్ చేయలేదు. దాంతో ఫ్యాన్స్ జక్కన్నకు కూడా అవకాశం కల్పిస్తే బాగుండేది అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. వీరితో పాటుగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం, కరణ్ జోహార్, సిద్దార్థ్ రాయ్ లకు కూడా జ్యూరీ మెంబర్స్ గా స్థానం లభించింది.