iDreamPost
android-app
ios-app

కీరవాణి ఎస్ – రాజమౌళి మిస్

  • Published Dec 12, 2022 | 6:42 PM Updated Updated Dec 12, 2022 | 6:42 PM
కీరవాణి ఎస్ – రాజమౌళి మిస్

ఎలాగైనా ఆస్కార్ సాధించాలనే పట్టుదలతో ఉన్న ఆర్ఆర్ఆర్ మెల్లగా ఒక్కో అడుగు దానివైపు వేసుకుంటూ వెళ్తోంది. రిలీజై తొమ్మిది నెలలవుతున్నా ఇంకా సోషల్ మీడియాలో దాని గురించిన చర్చ జరుగుతోందంటే రాజమౌళి ఇంటర్నేషనల్ లెవెల్ లో నిలబెట్టేందుకు చేస్తున్న కృషి ఫలితమే. జపాన్ విజయవంతంగా ముత్తుని దాటేసి నెంబర్ వన్ ప్లేస్ ని కొట్టేసిన ట్రిపులార్ ఇప్పటికీ కెనడా లాంటి దేశాల్లో ప్రీమియర్లు జర్పుకుంటూనే ఉంది. నెట్ ఫ్లిక్స్ లో హిందీ వెర్షన్ వచ్చాక ఒరిజినల్ ఫీల్ కోసం తెలుగులోనే చూసేందుకు విదేశీయులు ఉత్సాహం చూపిస్తుండటం గమనార్హం. ఇప్పుడు ఫారిన్ అవార్డులు కూడా ఒక్కొక్కటిగా ఆర్ఆర్ఆర్ ని వరిస్తున్నాయి

తాజాగా లాస్ ఏంజెల్స్ ఫిలిం క్రిటిక్స్ నుంచి ఉత్తమ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అరుదైన పురస్కారాన్ని అందుకోబోతున్నారు. బెస్ట్ డైరెక్టర్ గా రాజమౌళికి దక్కేది కానీ తృటిలో మిస్ అయ్యింది. టోడ్ ఫీల్డ్ తీసిన సైకోలాజికల్ డ్రామా టర్ కు అవార్డు దక్కడంతో జక్కన్న రెండో స్థానంలో రన్నరప్ గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కీరవాణికి అంతర్జాతీయ స్థాయిలో బాహుబలితోనే గుర్తింపు వచ్చినప్పటికీ ఇలా ప్రత్యేకంగా కమిటీలు గుర్తించిన దాఖలాలు తక్కువ. ఆర్ఆర్ఆర్ ఇప్పుడు అన్నింటిని సాధ్యం చేసి చూపిస్తోంది. ఇంకొక్క రోజులో గోల్డెన్ గ్లోబ్ నామినేషన్లు రివీల్ చేయబోతున్నారు. అందులో కూడా రాజమౌళి బృందానికి కనీసం రెండు ఉంటాయనే అంచనాలున్నాయి

రాబోయే రోజుల్లో ఆస్కార్ సంబరం దగ్గర పడే కొద్దీ ఆర్ఆర్ఆర్ గురించిన చర్చలు మరింతగా ఎక్కువవుతాయి. మరోవైపు ఫారిన్ మీడియా నుంచి సైతం మంచి మద్దతు దక్కుతోంది. ఇండియా తరఫున అఫీషియల్ నామినేషన్ గా గుజరాతి మూవీ లాస్ట్ ఫిలిం వెళ్లిన సంగతి తెలిసిందే. దానికెలాగూ రావని విశ్లేషకులు ఆల్రెడీ జోస్యం చెప్పేస్తున్నారు. జనరల్ క్యాటగిరీలో అప్లై చేసుకున్న ఆర్ఆర్ఆర్ కనక నిజంగా అన్నంతపని చేస్తే ఆ గెలుపు మాములుగా ఉండదు.రాజమౌళి నెక్స్ట్ మహేష్ బాబుతో చేయబోయే గ్లోబల్ రేంజ్ మూవీకి డిస్నీ లాంటి సంస్థలు పెట్టుబడి పెట్టేందుకు ఉత్సాహం చూపిస్తున్న తరుణంలో ఈ పరిణామాలు చాలా కీలకం కానున్నాయి