iDreamPost
android-app
ios-app

69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు చిత్రాలివే!

69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు చిత్రాలివే!

2021వ సంవత్సరానికి సంబంధించి కేంద్రం 69వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించింది. ఈ జాతీయ అవార్డుల్లో తెలుగు చిత్రాలు సత్తా చాటాయి. ఉత్తమ జాతీయ నటుడిగా అల్లు అర్జున్ కు అవార్డు దక్కింది. టాలీవుడ్ నుంచి ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న తొలి నటుడిగా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించాడు. సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప సినిమాకి అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. ఈ అవార్డుల్లో మరికొన్ని తెలుగు చిత్రాలు సత్తా చాటాయి. ఉత్తమ తెలుగు చిత్రంగా ఉప్పెన నిలిచింది. ఉత్తమ కొరియోగ్రఫీ, ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ అవార్డులు RRRకు దక్కాయి.

ఉత్తమ తెలుగు సాంగ్ కేటగిరీలో కొండపొలం సినిమాకి సంబంధించి చంద్రబోస్ కు అవార్డు దక్కింది. ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు దేవీశ్రీ ప్రసాద్(పుష్ప)కి దక్కింది. బెస్ట్ బీజీఎం కేటిగిరీలో ట్రిపులార్ సినిమాకి గానూ ఎంఎం కీరవాణికి జాతీయ అవార్డు దక్కింది. బెస్ట్ వీఎఫ్ఎక్స్ కింద ట్రిపులార్ సినిమాకి  గానూ వీ శ్రీనివాస మోహన్ కు అవార్డు దక్కింది. ఉత్తమ ప్రజాధరణ పొందిన చిత్రంగా RRR నిలిచింది. ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ మేల్ గా కాలబైరవను జాతీయ అవార్డు వరించింది. ఈ అవార్డుల్లో ట్రిపులార్ సినిమాకి మొత్తం 7 అవార్డులు దక్కగా.. పుష్ప సినిమాకి 2 జాతీయ అవార్డులు దక్కాయి. ఉత్తమ నటుడిగా అవార్డు దక్కడంపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ అవార్డులు దక్కించుకున్న చిత్రాలు, టెక్నీషియన్స్ కు సోషల్ మీడియాలో వేదికగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.