iDreamPost
బడ్జెట్ వందల కోట్లు పెట్టినా అంతకంతా దానికి రెట్టింపు రాబట్టడంలో ఆయన ఆలోచన, ప్లానింగ్, అమలు చేసే విధానం అన్నీ వేరే లెవెల్ లో ఉంటాయి. అన్నిటిని మించి స్టార్ హీరోలను హ్యాండిల్ చేసే తీరు హీరోయిజంని ఎలివేట్ చేసే విధానం ఇప్పటిదాకా ఓటమి లేకుండా చేసింది.
బడ్జెట్ వందల కోట్లు పెట్టినా అంతకంతా దానికి రెట్టింపు రాబట్టడంలో ఆయన ఆలోచన, ప్లానింగ్, అమలు చేసే విధానం అన్నీ వేరే లెవెల్ లో ఉంటాయి. అన్నిటిని మించి స్టార్ హీరోలను హ్యాండిల్ చేసే తీరు హీరోయిజంని ఎలివేట్ చేసే విధానం ఇప్పటిదాకా ఓటమి లేకుండా చేసింది.
iDreamPost
తెలుగు సినిమా స్థాయిని ఆస్కార్ గడప దాకా తీసుకెళ్తున్న ఘనత సొంతం చేసుకున్న రాజమౌళి గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమి లేదు. బడ్జెట్ వందల కోట్లు పెట్టినా అంతకంతా దానికి రెట్టింపు రాబట్టడంలో ఆయన ఆలోచన, ప్లానింగ్, అమలు చేసే విధానం అన్నీ వేరే లెవెల్ లో ఉంటాయి. అన్నిటిని మించి స్టార్ హీరోలను హ్యాండిల్ చేసే తీరు హీరోయిజంని ఎలివేట్ చేసే విధానం ఇప్పటిదాకా ఓటమి లేకుండా చేసింది. ఇటీవలే ఓ వెబ్ మ్యాగజైన్ నిర్వహించిన ముఖాముఖీ కార్యక్రమంలో జక్కన్న పాల్గొన్నారు. తనతో పాటు కమల్ హాసన్ లాంటి లెజెండరీ యాక్టర్స్ వివిధ బాషల నుంచి వచ్చిన స్టార్లు అందులో భాగమై తమ అభిప్రాయాలు పంచుకున్నారు.
కాంతార ప్రస్తావన తెచ్చిన రాజమౌళి ఒక మూవీ వందల కోట్లు వసూలు చేయాలంటే అంతే ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని అంత గొప్పగా తీర్చిదిద్దిన తీరు అందరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఇక్కడే కొందరు అపార్థాలకు తెరతీశారు. బడ్జెట్ పరిమితులను దాటేసి మంచి నీళ్ల ప్రాయంలాగా కోట్లను కుమ్మరించి స్టార్ల రెమ్యునరేషన్లు అమాంతం పెరిగిపోవడానికి, టికెట్ రేట్లకు అడ్డుకట్ట లేకపోవడానికి కారణంగా నిలిచిన వ్యక్తి ఇలా చెప్పడం ఏంటనే కామెంట్లు సోషల్ మీడియాలో వినిపించాయి. నిజానికి ఆయన అన్నది కథ బలంగా ఉంటే కంటెంట్ ని బాగా ప్రెజెంట్ చేయగలిగితే చాలు ఎలాంటి అద్భుతాలైనా సృష్టించవచ్చని.
ఇదే రాజమౌళి సునీల్ లాంటి కమెడియన్ తో మర్యాద రామన్న లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చారు. నానిని చంపేసి కేవలం ఈగని టైటిల్ రోల్ లో పెట్టి గొప్ప విజయం అందుకున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సై లాంటి చిత్రంతో వాహ్ అనిపించారు. అలాంటి మేకర్ కి రెండు వైపులా ఎలా తీయాలో తెలుసు. కానీ ఇప్పుడు రేంజ్ మారిపోయింది. దిగాలనుకున్నా కుదరదు. మహేష్ బాబుతోనే కాదు భవిష్యత్తులో ఇంకెవరితో చేసినా ప్రపంచవ్యాప్త మూవీ లవర్స్ దృష్టి తన మీద ఉంటుంది. అలాంటపుడు బడ్జెట్ కావొచ్చు గ్రాండియర్ స్కేల్ కావొచ్చు పెంచుకుంటూ పోవాలే తప్పించి తగ్గడం కుదరదు. ఒకే కోణంలో ఆలోచిస్తేనే ఆయన కామెంట్స్ లో లేని అర్థాలు కనిపిస్తాయి