KGF సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రశాంత్ నీల్ ఏ రేంజ్ ప్రభంజనం సృష్టించాడో అందరికి తెలిసిందే. KGF రెండు పార్టులతో బాక్సాఫీస్ ని షేక్ చేసి పాన్ ఇండియా డైరెక్టర్ గా నిలిచాడు. ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లో ప్రశాంత్ నీల్ ఒకడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్నాడు. అంతేకాక ఎన్టీఆర్ తో కూడా సినిమా అనౌన్స్ చేశాడు. ఇవాళ (జూన్ 4) ప్రశాంత్ నీల్ పుట్టిన […]
స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, అనుకున్నట్లుగానే జూ ఎన్టీయార్ ఫాన్స్ కు అదిరిపోయే గిఫ్ట్ నిచ్చాడు. జూ.ఎన్టీయార్ 31వ సినిమాకు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశాడు. ఇదికూడా కేజీఎఫ్, సలార్ స్టైల్ లోనే కనిపిస్తోంది. రక్తంతో తడిచిన నేల మాత్రమే ఎప్పుడూ గుర్తిండిపోతుంది. కాని ఈ నేలే ఆయన వారసత్వం, రక్తం కాదు అంటూ సూపర్ కొటేషన్ తో రిలీజ్ చేశారు. ఈ లుక్ లో ఎన్టీయార్ చాలా ఇంటెన్సీవ్ గా కనిపిస్తున్నారు. ఈసినిమాను మైత్రీ […]
ఆర్ఆర్ఆర్ హడావిడి జరుగుతోంది కాబట్టి కెజిఎఫ్ 2 టీమ్ ఇంకా పూర్తి స్థాయి ప్రమోషన్లు మొదలుపెట్టలేదు. రాజమౌళి సినిమా చల్లబడ్డాక తమ అస్త్రాలను బయటికి తీయబోతున్నారు. ఇప్పటికి సైలెంట్ గా అనిపిస్తోంది కానీ ఏప్రిల్ 14 లోపు హైప్ అమాంతం ఎక్కడికో వెళ్ళిపోతుంది. స్టార్ హీరోల రేంజ్ లో దీనికీ తెల్లవారుఝామున ప్రీమియర్లు వేసేందుకు ప్లానింగ్ జరుగుతోంది. కర్ణాటకలో కాదు ఇక్కడే తెలుగు రాష్ట్రాల్లో కూడా షోలు వేస్తారట. రాఖీ భాయ్ అంచనాలు అలా ఉన్నాయి మరి. […]
నాలుగేళ్ల నిరీక్షణకు ఫలితంగా అద్భుతమైన బ్లాక్ బస్టర్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ జూన్ నుంచి కొరటాల శివ దర్శకత్వంలో ప్రారంభం కాబోయే సినిమా తాలూకు రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఇప్పటికే చాలా లేట్ కావడంతో అభిమానులు త్వరగా మొదలుపెట్టామని ఒత్తిడి చేస్తున్నారు. ఆచార్య రిలీజ్ అయితే తప్ప కొరటాల ఫ్రీ కాలేరు. ఇప్పుడు స్టార్ట్ చేసి మళ్ళీ గ్యాప్ ఇవ్వడం ఎందుకని పక్కా ప్లానింగ్ తో మూడు నెలల తర్వాత స్కెచ్ వేశారు. దీని తర్వాత […]
నిన్న సాయంత్రం బెంగళూరు వేదికగా కెజిఎఫ్ 2 ట్రైలర్ లాంచ్ చాలా గ్రాండ్ గా జరిగింది. దేశవ్యాప్తంగా మీడియాని ప్రత్యేకంగా పిలిపించి హోంబాలే ఫిలిమ్స్ ఈ వేడుకను చేశారు. ఈవెంట్ వినడానికి చిన్నదే అనిపించినా భారీగా ఖర్చు పెట్టారనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. సంజయ్ దత్ తో పాటు కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. మూడేళ్ళ క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా రూపొందిన కెజిఎఫ్ 2 విజువల్స్ […]
బాక్సాఫీస్ వద్ద ఆర్ఆర్ఆర్ హవా కొనసాగుతోంది. ఫైనల్ వర్డిక్ట్ చెప్పేయడం తొందపాటు అవుతుంది కాబట్టి కనీసం రెండు వారాలు వేచి చూడాల్సిందే. ప్రస్తుతానికి భారీ రికార్డులు నమోదవుతున్నాయి. ప్యాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టు వసూళ్లు వస్తున్నాయి. టాక్ కొంత డివైడ్ గా ఉన్న మాట వాస్తవమే కానీ రాజమౌళి సినిమాలకు ఇది ఎప్పుడూ జరిగేదే. కాకపోతే బాహుబలి స్థాయిలో నిలుస్తుందా దాన్ని దాటగలదా లేదా అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా ఇప్పుడీ ఆర్ఆర్ఆర్ రెస్పాన్స్ […]
వచ్చే నెల ఏప్రిల్ 14న మోస్ట్ వెయిటెడ్ మూవీస్ అఫ్ ది ఇయర్ లో ఒకటైన కెజిఎఫ్ 2కి సోలో రిలీజ్ దక్కడం లేదు. విజయ్ బీస్ట్ ని ఒక రోజు ముందు 13న విడుదల చేసేందుకు నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్ణయించుకుని అధికారికంగా చెప్పేసింది. దాని తాలూకు కొత్త పోస్టర్ కూడా వదిలారు. సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. 2 గంటల 35 నిమిషాల నిడివితో ఫైనల్ వెర్షన్ లాక్ అయిపోయింది. తెలుగు డబ్బింగ్ హక్కుల […]
ఈ ఏడాది మోస్ట్ వెయిటెడ్ పాన్ ఇండియా మూవీస్ లిస్టులో ఉన్న కెజిఎఫ్ 2 ఏప్రిల్ 14 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా రేస్ నుంచి తప్పుకోవడంతో యష్ కు ఈ మార్పు చాలా పెద్ద ప్లస్ కాబోతోంది. విజయ్ బీస్ట్ అదే డేట్ కి వస్తుందన్న అంచనాలు ఉన్నాయి కానీ యూనిట్ ఇంకా అఫీషియల్ గా ప్రకటించలేదు కాబట్టి అప్పుడే ఒక నిర్ధారణకు రాలేం. కెజిఎఫ్ 2 లాగే […]
కెజిఎఫ్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ తీస్తున్న సలార్ మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులో ఇండియన్ మ్యాచో స్టార్ ప్రభాస్ హీరో కావడంతో రిలీజ్ టైంకి హైప్ ఏ రేంజ్ కు వెళ్తుందో ఊహించుకోవడం కూడా కష్టమే. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ సగానికి పైగానే అయిపోయింది. ఇంకా గుమ్మడి కాయ కొట్టలేదు కానీ దీనికి సంబంధించిన న్యూస్ ఒకటి ఇప్పుడు హాట్ టాపిక్ గా […]
ఒమిక్రాన్ పుణ్యమాని పాన్ ఇండియా సినిమాలకు గట్టి చిక్కులే వచ్చి పడుతున్నాయి. సోలో రిలీజ్ ఉంటే తప్ప వందల కోట్ల పెట్టుబడులు సేఫ్ కాలేని పరిస్థితుల్లో తీవ్రమైన పోటీని ఎదురుకోవాల్సి వస్తోంది. ఇది ఎవరూ కావాలని చెయకపోయినా దీని వల్ల వసూళ్ల మీద గట్టి దెబ్బ పడుతుందనే ఆందోళన డిస్ట్రిబ్యూటర్లలో వ్యక్తమవుతోంది. కెజిఎఫ్ 2 మీద ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాంపిటీషన్ ఉండకూడదనే ఉద్దేశంతో నెలల క్రితమే ఏప్రిల్ 14 విడుదల తేదీని […]