Tirupathi Rao
NTR- Prashanth Neel Movie Poster Details- NTR31 Detailed Storyline: ఫ్యాన్స్ అంతా ఎంతగానో ఎదురుచూసిన ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ పట్టాలెక్కేసింది. పూజా కార్యక్రమంతో షూటింగ్ ని ప్రారంభించేశారు. అయితే ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ పై కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. వాటిని బట్టి చూస్తే అసలు కథ ఇదే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
NTR- Prashanth Neel Movie Poster Details- NTR31 Detailed Storyline: ఫ్యాన్స్ అంతా ఎంతగానో ఎదురుచూసిన ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ పట్టాలెక్కేసింది. పూజా కార్యక్రమంతో షూటింగ్ ని ప్రారంభించేశారు. అయితే ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ పై కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. వాటిని బట్టి చూస్తే అసలు కథ ఇదే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
Tirupathi Rao
తారక్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ప్రశాంత్ నీల్- జూనియర్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కేసింది. తాజాగా ఈ మూవీకి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పూజకు ప్రశాంత్ నీల్ సతీసమేతంగా, జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సమేతంగా పాల్గొన్నాడు. మైత్రీ మూవీ మేకర్స్- ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూజా కార్యక్రమాన్ని ఎంతో నిరాడంబరంగా నిర్వహించినా కూడా.. అప్ డేట్స్ మాత్రం గట్టిగానే ఇచ్చారు. ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించేశారు. 2026 జనవరి 9న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా విడుదల చేయబోతున్నాం అంటూ టీమ్ అయితే ప్రకటించింది. ఇంక ఈ మూవీకి సంబంధించి ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ ని క్లియర్ గా గమనిస్తే కథ మొత్తం పోస్టర్ లోనే చెప్పేశారు అని అర్థమవుతుంది.
ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కి సంబంధించి టైటిల్ ని అయితే ఖరారు చేయలేదు. కానీ, డ్రాగన్ అనే పేరును కన్ఫామ్ చేశారు అంటూ వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో అయితే డ్రాగన్ పేరిట కొన్ని పోస్టర్స్ కూడా దర్శనమిస్తున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రశాంత్ నీల్ చేసిన కామెంట్స్ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తాను ఇప్పుడు ఒక కొత్త జానర్ ని టచ్ చేస్తున్నాను అని చెప్పాడు. దీన్ని అంతా యాక్షన్ చిత్రంగా భావిస్తారని తనకు తెలుసన్నాడు. కానీ, తాను ఆ జానర్ లోకి వెళ్లాలి అనుకోవట్లేదునే విషయాన్ని స్పష్టం చేశారు. నిజానికి తనకు ఇది ఒక కొత్త కథ అని చెప్పుకొచ్చాడు. అంటే సినిమాలో ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైతే పోస్టర్ మీద ఉన్న డీటెయిల్స్ ని బట్టి చూస్తే ఒక కథ ప్రచారంలోకి వచ్చింది.
నీల్- ఎన్టీఆర్ మూవీ పోస్టర్ ని గమనిస్తే వెనుక వరల్డ్ మ్యాప్ ఉంది. దానిలో ఒకవైపునకు 1969 అని రాసుంది. దానికి ఆపోజిట్ లో గోల్డెన్ ట్రయాంగిల్ అని ఉంది. టాప్ లెఫ్ట్ కార్నర్లో చైనా, భూటాన్, బెంగాల్- కోల్ కతా అని రాసుంది. ఇవన్నీ చూస్తుంటే.. 1969 ఓపియం మాఫియాకి రిలేట్ చేస్తోంది. ఈ ఓపియం డ్రగ్ మాఫియాలో ఎన్టీఆర్ డ్రగ్ లార్డ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇందులో ఇప్పటికే ఎన్టీఆర్ ని 70 ఏళ్ల వృద్ధుడిగా కూడా చూపించే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. అంటే అతను ఈ ఓపీయం మార్కెట్ లో కింగ్ పిన్ అవ్వచ్చు. ఆ తర్వాత కుర్ర ఎన్టీఆర్ కూడా ఈ మాఫియాలో కీలక పాత్రధారి కావచ్చు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 1969 రోజుల్లో కలకత్తా పోర్ట్ గోల్డెన్ ట్రయాంగిల్ కి దగ్గరగా ఉండటంతో.. ఓపియం స్మగ్లింగ్ కి అడ్డాగా ఉండేదంట. ఆ పోర్టు నుంచే స్మగ్లింగ్ ఎక్కువగా జరిగేది.
And so it begins…🔥🔥#NTRNeel Pooja Ceremony took place today and sets the stage to redefine Mass Explosion on the Big Screens 💥💥
Worldwide Grand Release on 𝐉𝐚𝐧𝐮𝐚𝐫𝐲 𝟗𝐭𝐡, 𝟐𝟎𝟐𝟔 ❤️🔥
Man of Masses @tarak9999 #PrashanthNeel @MythriOfficial @NTRArtsOfficial pic.twitter.com/33vlssRzeC
— Vamsi Kaka (@vamsikaka) August 9, 2024
చైనా ఓపియం మాఫియా సభ్యులు కోల్ కతాలో కూడా యాక్టివ్ గా ఉండేవారు. కలకత్తాలో ఉండే లోకల్ సిండికేట్స్ తో కలిసి ఓపియం స్మగ్లింగ్ చేసేవి. కలకత్తా వీధుల్లో ఓపియం విచ్చలవిడిగా దొరికేదని చెబుతారు. అలా ఈ ఓపియం నేపథ్యంలో గ్యాంగులు ఏర్పడటం.. వాటి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ లింకులు సౌత్ ఈస్ట్ ఆసియాకే కాకుండా.. యూరప్ దాకా విస్తరించాయి అంటారు. ఇప్పుడు ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ మూవీ ఈ పాయింట్ మీదే వస్తుంది అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చైనా ప్రమేయం ఉండటంతోనే.. ఈ ప్రాజెక్ట్ కి డ్రాగన్ అనే పేరు కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఇప్పటి వరకు ఇవి ప్రచారాలు మాత్రమే. మరి.. అసలు కథ తెలియాలి అంటే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఎన్టీఆర్- నీల్ మూవీ కథ ఎలా ఉండబోతోంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.