iDreamPost
android-app
ios-app

NTR31: యన్టీఆర్ – నీల్ మూవీ స్టార్ట్! పూజ రోజే.. రిలీజ్ డేట్ ప్రకటన!

  • Published Aug 09, 2024 | 12:46 PM Updated Updated Aug 09, 2024 | 1:04 PM

NTR-Prashanth Neel Movie Latest Update: ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తారక్ ,ప్రశాంత్ నీల్ తో ఓ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమాను సంబందించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.

NTR-Prashanth Neel Movie Latest Update: ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తారక్ ,ప్రశాంత్ నీల్ తో ఓ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమాను సంబందించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.

  • Published Aug 09, 2024 | 12:46 PMUpdated Aug 09, 2024 | 1:04 PM
NTR31: యన్టీఆర్ – నీల్ మూవీ స్టార్ట్! పూజ రోజే.. రిలీజ్ డేట్ ప్రకటన!

ఆల్రెడీ తారక్ అభిమానులు దేవర సినిమా రిలీజ్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్ డేట్ సినిమాపై భారీగా అంచనాలను క్రియేట్ చేస్తుంది. ఇక రిలీజ్ తర్వాత ఈ సినిమా అందరి అంచనాలను నిలబెట్టుకుంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినిమా తర్వాత తారక్, ప్రశాంత్ నీల్ తో ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న వార్త.. సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఇండస్ట్రీలో అటు ప్రశాంత్ నీల్ సినిమాలకు, తారక్ సినిమాలకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. ఇక ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఓ ప్రాజెక్ట్ చేస్తే.. ఆ సినిమా అందరి అంచనాలను మించి ఉంటుందన్న సంగతి తెలియనిది కాదు. ఇక ఇప్పుడు తారక్ , ప్రశాంత్ నీల్ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ సినిమాకు ఎన్టీఆర్ 31 అనే వర్కింగ్ టైటిల్ తో.. రామానాయుడు స్టూడియోస్ లో.. ఈ రోజు ఈ మూవీ షూటింగ్ ను.. పూజ కార్యక్రమాలతో ప్రారంభించారు. కాగా ఈ వేడుకకు తారక్ , ప్రశాంత్ నీల్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనితో “NTRNeel” అనే హ్యాష్ ట్యాగ్ నెట్టింట ఇంట్రెస్టింగ్ గా మారింది. పైగా ఈ సినిమాకు ‘డ్రాగాన్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది. అలాగే ఈ సినిమాను 2026 జనవరి 9 న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్.

ఇక ప్రశాంత్ నీల్ సినిమాలంటే.. అందరికి గుర్తొచ్చేది కెజీఎఫ్, సలార్ సినిమాలే.. మరి ఈసారి తారక్ ను కూడా ప్రశాంత్ నీల్ అలానే చూపిస్తారా అనే సందేహాలు అభిమానులలో మొదలయ్యాయి. అయితే ఆల్రెడీ ప్రశాంత్ నీల్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేశారు. అందరూ దీన్ని కూడా ఓ యాక్షన్ సినిమాలనే ఊహించుకుంటారు కానీ.. ఈసారి ఆ జోనర్ లో వెళ్లడం లేదని.. ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్ అని చెప్పుకొచ్చారు. కాగా ఈ సినిమాను కూడా రెండు భాగాలుగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. ఇక రానున్న రోజుల్లో ఈ సినిమాపై వచ్చే అప్ డేట్స్ .. ప్రేక్షకులలో ఎలాంటి హైప్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి. మరి ఈ లేటెస్ట్ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişmarsbahis girişgrandpashabet