iDreamPost
android-app
ios-app

ఫ్యాన్స్ ఆకలి తీర్చేందుకు కసిగా కష్టపడుతున్న NTR.. రెండేళ్లలో 4 సినిమాలతో విందు!

  • Published Aug 09, 2024 | 4:33 PM Updated Updated Aug 09, 2024 | 4:33 PM

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వేగం పెంచారు. అభిమానుల ఆకలి తీర్చేందుకు ఆయన కసిగా కష్టపడుతున్నారు. ఫ్యాన్స్​కు ఫుల్​మీల్స్ పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వేగం పెంచారు. అభిమానుల ఆకలి తీర్చేందుకు ఆయన కసిగా కష్టపడుతున్నారు. ఫ్యాన్స్​కు ఫుల్​మీల్స్ పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.

  • Published Aug 09, 2024 | 4:33 PMUpdated Aug 09, 2024 | 4:33 PM
ఫ్యాన్స్ ఆకలి తీర్చేందుకు కసిగా కష్టపడుతున్న NTR.. రెండేళ్లలో 4 సినిమాలతో విందు!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్​ను బిగ్ స్క్రీన్​పై చూసేందుకు అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఫ్యాన్సే కాదు.. ఆడియెన్స్, మూవీ లవర్స్ కూడా వెండితెరపై తారక్ నటనను చూసి ఎంజాయ్ చేయాలని వెయిట్ చేస్తున్నారు. కానీ అందుకు మరికొంత టైమ్ పట్టనుంది. ఆయన ప్రస్తుతం నటిస్తున్న ‘దేవర’ చిత్రం సెప్టెంబర్ 24న విడుదల కానుంది. ఎన్టీఆర్ గత సినిమా ‘ఆర్ఆర్ఆర్’ రిలీజై దాదాపు రెండున్నర ఏళ్లు కావొస్తోంది. ఈ గ్యాప్​లో ఆయన నుంచి మరే ఫిల్మ్ కూడా రాలేదు. దీంతో అభిమానులకు బాగా బాకీ పడిపోయారు తారక్. అయితే ఈ లోటును భర్తీ చేసేందుకు ఆయన కసిగా కష్టపడుతున్నారు. ఫ్యాన్స్​కు ఫుల్​మీల్స్ పెట్టేందుకు నందమూరి హీరో సిద్ధమవుతున్నారు.

2019 నుంచి 2023 మధ్యలో ఎన్టీఆర్ నుంచి కేవలం ఒకే సినిమా వచ్చింది. అదే దర్శకధీరుడు తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’. ఈ నాలుగేళ్లలో ఆయన తెరపై కనిపించింది ఒకేసారి. కానీ ఇక మీదట ఇలా ఉండదు. టాప్ గేర్​ వేసేందుకు రెడీ అయిపోయారు ఎన్టీఆర్. ఇకపై ఆయన నుంచి వరుసగా సినిమాలు రానున్నాయి. వచ్చే రెండేళ్లలో ఏకంగా 4 మూవీస్​తో ఫ్యాన్స్​కు బిగ్ ట్రీట్ ఇవ్వనున్నారు. 2024 నుంచి 2026 మధ్యలో నాలుగు చిత్రాలను విడుదల చేసేందుకు తారక్ ప్లాన్ చేస్తున్నారు. ఇది ఆయన అభిమానులకే కాదు చిత్ర పరిశ్రమకు కూడా పూనకాలు తెప్పించే న్యూస్ అనే చెప్పాలి. తొలుత ‘దేవర’తో థియేటర్లలో సందడి చేయనున్నారు ఎన్టీఆర్. ఆ తర్వాత సోలో హీరోగా మరో రెండు సినిమాలు, అలాగే ఓ మల్టీస్టారర్​తో ప్రేక్షకుల్ని పలకరించనున్నారు.

Tarak

ఎన్టీఆర్ నటిస్తున్న ‘దేవర’ చిత్రం వచ్చే నెలలో విడుదల కానుంది. ఈ సినిమా పనులు ముగించుకొని ఇతర మూవీస్ వర్క్స్​లో ఆయన ఫుల్ బిజీ అయిపోతారు. ఆల్రెడీ బాలీవుడ్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ ‘వార్ 2’లో తన పోర్షన్​ షూటింగ్​లో పాల్గొంటున్నారు ఎన్టీఆర్. పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్​ దర్శకత్వంలో ఆయన నటించే సినిమాపై ఇవాళ అఫీషియల్ అనౌన్స్​మెంట్ వచ్చింది. ఒకవైపు ‘వార్ 2’, మరోవైపు నీల్ రూపొందించే ఫిల్మ్​లో తారక్ ప్యారలల్​గా యాక్ట్ చేయనున్నారు. ఇవి రెండూ పూర్తయ్యాక ‘దేవర 2’లో నటించే అవకాశం ఉందని సమాచారం. ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ శౌర్యువ్​తో ఎన్టీఆర్ మూవీ ఉంటుందని రూమర్స్ వచ్చినా అవి నిజం కాదని తేలింది. అయితే ఈ న్యూస్ ఏదో ఒక రోజు నిజమవుతుందని దర్శకుడు హింట్ ఇవ్వడంతో ప్రాజెక్ట్​పై ఆశలు రేకెత్తుతున్నాయి. ఒకవేళ ఈ కాంబోలో కాకపోయినా మధ్యలో ఏదైనా ప్రాజెక్ట్ నచ్చితే ‘దేవర 2’ పూర్తి చేసి దాని పనుల్లో నిమగ్నమయ్యే ఛాన్స్ ఉంది. మొత్తానికి వచ్చే రెండేళ్లలో కనీసం నాలుగు చిత్రాలు రిలీజ్ అయ్యేలా తారక్ ప్లాన్ చేస్తున్నారు. మరి.. ఎన్టీఆర్ ప్లానింగ్ మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by Movies4u Official (@movies4u_official)