iDreamPost
android-app
ios-app

రేపే ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ మూవీకి ముహూర్తం.. కానీ, ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్!

  • Published Aug 08, 2024 | 4:41 PM Updated Updated Aug 08, 2024 | 4:41 PM

Prashanth Neel- Jr NTR Movie Pooja- Bad News For Fans: ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రశాంత్ నీల్- జూనియర్ ఎన్టీఆర్ కాంబో పట్టాలెక్కే సమయం ఆసన్నమైంది. ఆగస్టు 9న పూజా కార్యక్రమం కూడా నిర్వహించనున్నారంట. అయితే ఈ విషయంలో మాత్రం ఫ్యాన్స్ కి నిరాశ తప్పడం లేదు.

Prashanth Neel- Jr NTR Movie Pooja- Bad News For Fans: ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రశాంత్ నీల్- జూనియర్ ఎన్టీఆర్ కాంబో పట్టాలెక్కే సమయం ఆసన్నమైంది. ఆగస్టు 9న పూజా కార్యక్రమం కూడా నిర్వహించనున్నారంట. అయితే ఈ విషయంలో మాత్రం ఫ్యాన్స్ కి నిరాశ తప్పడం లేదు.

  • Published Aug 08, 2024 | 4:41 PMUpdated Aug 08, 2024 | 4:41 PM
రేపే ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ మూవీకి ముహూర్తం.. కానీ, ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్!

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా దేవర పార్ట్ 1కి సంబంధించి ఆసక్తిగా ఉన్నారు. పాన్ ఇండియా లెవల్లో తారక్- జాన్వీ కపూర్ రాక కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే ఈ మూవీపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరో విషయం గురించి కూడా ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అదే ఎన్టీఆర్ 31 గురించి. ప్రశాంత్ నీల్- తారక్ కాంబోలో వస్తుంది.. వస్తుంది అంటున్న ఎన్టీఆర్ 31కి ముహూర్తం ఖరారు అయ్యింది. ఆగస్టు 9న ఈ మూవీకి సంబంధించి పూజా కార్యక్రమం నిర్వహించనున్నారు. అయితే ఇక్కడ తారక్ ఫ్యాన్స్ కి ఒక బ్యాడ్ న్యూస్ మాత్రం తప్పడం లేదు.

ఎన్టీఆర్ 31 కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న చిత్రం కాబట్టి. ఈ మూవీ చాలా ఆలస్యంగా పట్టాలెక్కుతుందని గతంలో చాలానే వార్తలు వచ్చాయి. అవన్నీ పక్కన పెట్టేసి చిత్రాన్ని ప్రారంభించేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమానికి వచ్చేసింది. ఆగస్టు 9న రామానాయుడు స్టూడియో వేదికగా ఈ చిత్రానికి పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం కోసం మైత్రీ మూవీస్ ఒక ఆఫీసును కూడా ఏర్పాటు చేసిందటం. రేపటి నుంచి ఈ ప్రాజెక్ట్ చకా చకా దూసుకెళ్తుందని చెబుతున్నారు. ఇక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ మాత్రమే కాదు.. బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. దాని విషయంలోనే ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు.

విషయం ఏంటంటే.. ఎన్టీఆర్ 31 పూజా కార్యక్రమం నిజమే. అయితే రామానాయుడు స్టూడియోలో చాలా ప్రైవేటుగా ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారంట. అంటే కనీసం మీడియాకి కూడా అనుమతి లేదు అని చెబుతున్నారు. కేవలం మూవీకి సంబంధించిన ప్రముఖులు, ఇండస్ట్రీలోని అతి కొద్ది మందితోనే ఈ మూవీ పూజా కార్యక్రమం పూర్తి చేస్తారంట. కార్యక్రమం అయిన తర్వాత ఫొటోలు రిలీజ్ చేస్తారని చెబుతున్నారు. ఇంత గోప్యంగా ఎందుకు నిర్వహించాల్సి వస్తోంది అనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. మూవీ స్టార్ట్ అవుతోంది అనే విషయంపై ఫ్యాన్స్ ఆనందంగా ఉన్నా.. ఆ కార్యక్రమానికి ఎవరికీ అనుమతి లేదు అనే విషయంలో మాత్రం కాస్త పెదవి విరుస్తున్నారు. ఫొటోలు ఎప్పుడు వస్తాయో కాస్త సమయం చెప్పండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ మూవీకి డ్రాగన్ అనే పేరును దాదాపుగా ఖరారు చేశారు అంటున్నారు. మరి.. ప్రశాంత్ నీల్- జూనియర్ ఎన్టీఆర్ కాంబోకి పూజా కార్యక్రమం అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet girişjojobet giriş