iDreamPost
android-app
ios-app

తారక్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ .. ప్రశాంత్ నీల్ మూవీపై క్రేజీ అప్ డేట్

  • Published Aug 01, 2024 | 12:36 PM Updated Updated Aug 01, 2024 | 12:36 PM

Prashanth Neel- NTR: ప్రస్తుతం తారక్ అభిమానుల ఆశలన్నీ కూడా దేవర మూవీ మీదే ఉన్నాయి. సినిమా ఎలా ఉంటుంది అనే సంగతి పక్కన పెడితే.. తారక్ ను వెండి తెరపై ఎప్పుడెప్పుడు చూద్దామా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తారక్ అభిమానులకు మరొక గుడ్ న్యూస్ వచ్చేసింది.

Prashanth Neel- NTR: ప్రస్తుతం తారక్ అభిమానుల ఆశలన్నీ కూడా దేవర మూవీ మీదే ఉన్నాయి. సినిమా ఎలా ఉంటుంది అనే సంగతి పక్కన పెడితే.. తారక్ ను వెండి తెరపై ఎప్పుడెప్పుడు చూద్దామా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తారక్ అభిమానులకు మరొక గుడ్ న్యూస్ వచ్చేసింది.

  • Published Aug 01, 2024 | 12:36 PMUpdated Aug 01, 2024 | 12:36 PM
తారక్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ .. ప్రశాంత్ నీల్ మూవీపై క్రేజీ అప్ డేట్

ప్రస్తుతం తారక్ దేవర సినిమాతో బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టడానికి రెడీ అయిపోతున్నాడు. కొరటాల శివ , తారక్ కాంబినేషన్ లో ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి.. ఇప్పటి వరకు ఈ సినిమా గురించి వచ్చిన ప్రతి అప్ డేట్ కూడా.. సినిమాపై రోజు రోజు కు అంచనాలను పెంచుతూ వచ్చింది. దీనితో ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని ఎంతో ఇంట్రెస్ట్ తో ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ఈ క్రమంలో ఆల్రెడీ మూవీ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. సెప్టెంబర్ 27న భారీ అంచనాల మధ్యన థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ప్రస్తుతం దేవర రిలీజ్ హైప్ లో ఉన్న తారక్ అభిమానులు మరొక గుడ్ న్యూస్ వచ్చేసింది.

సాధారణంగా ప్రేక్షకులు ఎప్పుడు కూడా తమ అభిమాన నటి నటులు.. నెక్ట్ మూవీస్ ఏంటా ఎప్పుడు వస్తాయా అనే ఆసక్తితో ఎదురుచూస్తూనే ఉంటారు. ఈ క్రమంలో తారక్ అభిమానులు ప్రస్తుతం దేవర హైప్ లో ఉన్నారు. దేవర రెండు పార్ట్శ్ గా ఉండనున్న సంగతి తెలిసిందే. ఇక దేవర పార్ట్-1 రిలీజ్ తర్వాత తారక్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ సినిమాను ఆల్రెడీ అనౌన్స్ చేశారు. తాజాగా ఈ సినిమాను సంబంధించిన అప్ డేట్ కూడా వచ్చేసింది. ప్రశాంత్ నీల్ తారక్ కాంబినేషన్ లో మూవీని.. ఈ సెప్టెంబర్ ఎండ్ లోనే సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నారట మేకర్స్. అయితే మొదట తారక్ లేకుండానే షూటింగ్ స్టార్ట్ చేయనున్నారట.. తారక్ మాత్రం దేవర రిలీజ్ తర్వాత షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని అప్ డేట్స్ ఇంకా రావాల్సి ఉంది.

jr ntr

ఆల్రెడీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ప్రశాంత్ నీల్ మూవీస్ పై.. అందరికి స్పెషల్ ఫోకస్ ఉంటుంది. ఇప్పటికే కేజీఎఫ్ , సలార్ సినిమాలతో తన మూవీ మేకింగ్ స్టైల్ ఏంటో చూపించి.. ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్టాండర్డ్ ను సెట్ చేసుకున్నాడు ప్రశాంత్ నీల్. ఇక తారక్ గురించి తెలియనిది కాదు. దీనితో ఇప్పుడు ప్రశాంత్ నీల్ తారక్ తో ఎలాంటి కథను రూపొందించబోతున్నాడా అనే ఆసక్తి మొదలైంది. ఎలాగూ అనుకున్న టైమ్ కి దేవర రిలీజ్ అయ్యి భారీ హిట్ కొట్టేయడం పక్కా.. ఇప్పుడు ప్రశాంత్ నీల్ మూవీ గురించి కూడా అప్ డేట్ వచ్చేసింది కాబట్టి.. తారక్ అభిమానులను ఎలా సర్ప్రైజ్ చేస్తాడో వేచి చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbahsegel girişgrandpashabet