iDreamPost
android-app
ios-app

తారక్ ఫ్యాన్స్ కి మరో గుడ్ న్యూస్.. పట్టాలెక్కిన NTR 31?

  • Published Aug 05, 2024 | 9:32 PM Updated Updated Aug 05, 2024 | 9:32 PM

Prashanth Neel- Jr NTR- Mythri Movie Makers: జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రస్తుతం దేవర నుంచి వచ్చిన డ్యూయెట్ సాంగ్ మూడ్ లో ఉన్నారు. అయితే వారికి ఇంకో క్రేజీ వార్త అందుతోంది. అది కూడా ప్రశాంత్ నీల్ ప్రాజెక్టుకు సంబంధించి ఆ గుడ్ న్యూస్ ఉంది.

Prashanth Neel- Jr NTR- Mythri Movie Makers: జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రస్తుతం దేవర నుంచి వచ్చిన డ్యూయెట్ సాంగ్ మూడ్ లో ఉన్నారు. అయితే వారికి ఇంకో క్రేజీ వార్త అందుతోంది. అది కూడా ప్రశాంత్ నీల్ ప్రాజెక్టుకు సంబంధించి ఆ గుడ్ న్యూస్ ఉంది.

  • Published Aug 05, 2024 | 9:32 PMUpdated Aug 05, 2024 | 9:32 PM
తారక్ ఫ్యాన్స్ కి మరో గుడ్ న్యూస్.. పట్టాలెక్కిన NTR 31?

జూనియర్ ఎన్టీఆర్– కొరటాల శివ కాంబోలో సెప్టెంబర్ 27న రాబోతున్న దేవర పార్ట్ 1కి సంబంధించి వరుస అప్ డేట్స్ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తారక్- జాన్వీ కపూర్ డ్యూయెట్ ని కూడా రిలీజ్ చేశారు. ఆ సాంగ్ చూసిన తర్వాత తారక్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ లోనే కాకుండా.. సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అవుతోంది. ఇదిలా ఉండగా.. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మరో గుడ్ న్యూస్ అందబోతుందని తెలుస్తోంది. అది కూడా ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న ఎన్టీఆర్ 31 ప్రాజెక్ట్ కి సంబంధించి. దాదాపుగా ప్రాజెక్ట్ పట్టాలెక్కినట్లే అని చెబుతున్నారు.

టాలీవుడ్ లో ఉన్న హీరోల్లో.. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు చేతినిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఒకవైపు కొరటాల శివతో దేవర సినిమా చేస్తూనే.. బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమా పూర్తి చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు షూటింగ్ పూర్తి కాగానే తారక్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ లో అడుగు పెట్టబోతున్నాడు అని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ గాసిప్స్ మాత్రమే అని కొందరు చెబుతున్నా కూడా.. వస్తున్న వార్తలు చూస్తుంటే నిజమని ఫ్యాన్స్ నమ్మక తప్పడం లేదు. ప్రశాంత్ నీల్- జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో ఎన్టీఆర్ 31 అధికారికంగా ప్రకటించి చాలా రోజులు అవుతోంది. ఆ తర్వాత ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఇప్పుడు డైరెక్ట్ గా ప్రాజెక్ట్ పట్టాలెక్కేసింది అంటున్నారు.

అవును.. ఎన్టీఆర్ 31 ప్రాజెక్ట్ పట్టాలెక్కేసింది అని టాలీవుడ్ లో గట్టిగానే వార్తలు వైరల్ అవుతున్నాయి. మైత్రీ మూవీస్ ఎన్టీఆర్ 31 కోసం ప్రాజెక్ట్ కోసం ఆఫీసును తీసుకున్నారంట. త్వరలోనే మూవీ ఓపెనింగ్ కూడా జరగబోతోంది అంటున్నారు. అయితే ఈ కొత్త ఆఫీస్ లో జరుగుతుందా? విడిగా ఎక్కడైనా ప్లాన్ చేస్తారా? అనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు అంటున్నారు. మొత్తానికి ప్రాజెక్ట్ అయితే పట్టాలెక్కిందని తెలుస్తోంది. త్వరలోనే అధికారికంగా కొబ్బరికాయ కొట్టేసి సెట్స్ మీదకు వెళ్లిపోవాలి అని తారక్ ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. ఈ మూవీని ప్రశాంత్ నీల్ చాలా కొత్తగా ప్లాన్ చేస్తున్నాడు అని ఎప్పటి నుంచో టాక్ ఉంది. ఎన్టీఆర్ ను వృద్ధుడి పాత్రలో కూడా చూపించబోతున్నారు అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ 31పై తెలుగు ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. మరి.. ఎన్టీఆర్ 31 పట్టాలెక్కేసింది అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet