iDreamPost
android-app
ios-app

Jr NTR, రిషబ్ శెట్టి ప్రత్యేకంగా దర్శనం చేసుకున్న మూడగల్లు గుడి విశిష్టత తెలుసా?

  • Published Sep 02, 2024 | 1:16 PM Updated Updated Sep 02, 2024 | 1:16 PM

Jr NTR, Rishab Shetty, Prashanth Neel visited Keshavanatheshwara Temple: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కర్ణాటకలో ఆధ్యాత్మిక టూర్ లో ఉన్నాడు. అందులో భాగంగా ప్రముఖ ఆలయాలను దర్శించుకుంటున్నాడు. తాజాగా ఎంతో విశిష్టిత కలిగిన శ్రీ కేశవనాథేశ్వర గుహ ఆలయాన్ని దర్శించుకున్నాడు. ఆ గుడి విశిష్టతలను ఇప్పుడు తెలుసుకుందాం.

Jr NTR, Rishab Shetty, Prashanth Neel visited Keshavanatheshwara Temple: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కర్ణాటకలో ఆధ్యాత్మిక టూర్ లో ఉన్నాడు. అందులో భాగంగా ప్రముఖ ఆలయాలను దర్శించుకుంటున్నాడు. తాజాగా ఎంతో విశిష్టిత కలిగిన శ్రీ కేశవనాథేశ్వర గుహ ఆలయాన్ని దర్శించుకున్నాడు. ఆ గుడి విశిష్టతలను ఇప్పుడు తెలుసుకుందాం.

Jr NTR, రిషబ్ శెట్టి ప్రత్యేకంగా దర్శనం చేసుకున్న మూడగల్లు గుడి విశిష్టత తెలుసా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గత మూడు రోజులుగా కర్ణాటకలోని ప్రముఖ దేవాలయాలను కుటుంబంతో కలిసి దర్శించుకుంటున్నాడు. తారక్ ఫ్యామిలీతో పాటుగా రిషబ్ శెట్టి, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కుటుంబం కూడా ఉన్నారు. ఈ టూర్ లో భాగంగా ఉడిపి శ్రీకృష్ణ ఆలయాన్ని తారక్ దర్శించుకున్న విషయం తెలిసిందే. ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో కూడా పంచుకున్నాడు తారక్. ఇక ఇప్పుడు తాజాగా మరో విశిష్టత కలిగిన దేవాలయాన్ని దర్శించుకున్నాడు. మూడగల్లులోని శ్రీ కేశవనాథేశ్వర గుహ ఆలయాన్ని రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్ ఫ్యామిలీలతో కలిసి సందర్శించాడు. ఈ గుడి చాలా పవర్ ఫుల్ అని అక్కడి వారు చెబుతున్నారు. మరి ఈ టెంపుల్ విశిష్టత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి కర్ణాటకలోని ప్రముఖ ఆలయాలను సందర్శిస్తూ వస్తున్నాడు. తాజాగా రిషబ్ శెట్టి గ్రామం అయిన కెరడి సమీపంలో ఉన్న మూడగల్లు లోని శ్రీ కేశవనాథేశ్వర గుహ ఆలయాన్ని ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టి ఫ్యామిలీతో కలిసి సందర్శించాడు. కుటుంబంతో కలిసి ప్రత్యేక పూజలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను రిషబ్ శెట్టి ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. ప్రస్తుతం ఆ వీడియో ఇటు తారక్, అటు రిషబ్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మోకాళ్ల లోతు నీటిలో గుహలో కొంత దూరం వెళ్లాక ఆ స్వామి దర్శనం కలుగుతుంది. ఇక అక్కడి సహజ సౌందర్యానికి తారక్ ఆకర్షితుడు అయ్యాడు. గుడి విశిష్టతను రిషబ్ ఎన్టీఆర్ కు వివరించాడు.

ఇదిలా ఉండగా.. ఈ ఆలయానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. గుహలో స్వయంభుగా కోలువై ఉన్న ఆ పరమేశ్వరుడు చాలా పవర్ ఫుల్ అని అక్కడి ప్రజలతో పాటుగా దర్శనం చేసుకున్న భక్తులు కూడా నమ్ముతారు. కోరిన కోర్కెలను కచ్చితంగా తీరుస్తాడని భక్తుల నమ్మకం. పైగా స్వయంభుగా వెలియడంతో.. గుడికి శక్తులు ఎక్కువ అని నమ్ముతుంటారు. మూడగల్లు లో కేవలం 5 నుంచి 6 కుటుంబాలు మాత్రమే ఉంటాయి. కాగా.. సంవత్సరానికి ఒకసారి వచ్చే ‘ఎల్లు అమావాస్య’ నాడు 1000 నుంచి 1500 మంది వరకు భక్తులు ఆ పరమ శివుణ్ణి దర్శించుకోవడానికి వస్తారు.

ఇక ఈ అమావాస్యకు వచ్చే భక్తుల కోసం అక్కడి కుటుంబాలు రోడ్డును బాగుచేస్తారు. అయితే ఎల్లు అమావాస్య తర్వాత ప్రతీరోజు కేవలం అర్చకులు మాత్రమే పూజలు నిర్వహిస్తారు. మోకాళ్ల లోతు నీటిలో వెళ్తుంటే.. అందులో చాపలు, పాములు ఉన్నప్పటికీ అవి మనకు హాని కలిగించవని, ఇదంతా ఆ శివుడు లీల అని నమ్ముతుంటారు. అక్కడి నీటిలో ఉండే చాపలకు ఆహారం వేస్తే.. పుణ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఇంత విశిష్టత కలిగిఉన్నప్పటికీ.. శ్రీ కేశవనాథేశ్వర ఆలయానికి తగిన గుర్తింపు రాలేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ గుడికి పబ్లిసిటీ కల్పించాలని భక్తులు కోరుతున్నారు.