iDreamPost
android-app
ios-app

డార్లింగ్ ఫ్యాన్స్ కి క్రేజీ న్యూస్.. సలార్ 2 రెగ్యులర్ షూట్ ఎప్పటినుంచంటే?

  • Published Jul 03, 2024 | 3:53 PM Updated Updated Jul 03, 2024 | 3:53 PM

Prashanth Neel And Prabhas Is Gearing Up For Salaar 2: ప్రభాస్ ఫ్యాన్స్ కి క్రేజీ వార్త వచ్చేసంది. అదేంటంటే.. ప్రశాంత్ నీల్- ప్రభాస్ ఇద్దరూ సలార్ 2 కోసం సెట్స్ మీదకు వెళ్లబోతున్నారు. రెగ్యూలర్ షూట్ కూడా స్టార్ట్ కాబోతోంది.

Prashanth Neel And Prabhas Is Gearing Up For Salaar 2: ప్రభాస్ ఫ్యాన్స్ కి క్రేజీ వార్త వచ్చేసంది. అదేంటంటే.. ప్రశాంత్ నీల్- ప్రభాస్ ఇద్దరూ సలార్ 2 కోసం సెట్స్ మీదకు వెళ్లబోతున్నారు. రెగ్యూలర్ షూట్ కూడా స్టార్ట్ కాబోతోంది.

  • Published Jul 03, 2024 | 3:53 PMUpdated Jul 03, 2024 | 3:53 PM
డార్లింగ్ ఫ్యాన్స్ కి క్రేజీ న్యూస్.. సలార్ 2 రెగ్యులర్ షూట్ ఎప్పటినుంచంటే?

ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషీలో ఉన్నారు. కల్కి 2898 ఏడీ మూవీ బాక్సాఫీస్ ని షేక్ చేయడం చూసి ఎంతో ఆనంద పడిపోతున్నారు. కల్కి రోజు రోజుకి బ్రేక్ చేస్తున్న రికార్డులు, కురిపిస్తున్న కాసులు చూసి తెగ సంబర పడి పోతున్నారు. వాళ్లకు అంతకు మించిన ఒక క్రేజీ వార్త అయితే వచ్చేసింది. అదేంటంటే సలారోడి గురించి. అవును.. ఇప్పటి వరకు ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ 2 సినిమా గురించి ఆలోచన చేయలేదు. ఎందుకంటే ఇప్పుడల్లా ఆ మూవీ సెట్స్ మీదకు రాదు అని అంతా భావించారు. కానీ, ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. అదేంటంటే.. ప్రశాంత్ నీల్ సలార్ 2 రెగ్యూలర్ షూట్ స్టార్ట్ చేయబోతున్నాడు అని.

సాధారణంగా ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ది రాజా సాబ్ మూవీ గురించే ఆలోచిస్తున్నారు. ఆ తర్వాత ఉంటే స్పిరిట్ మూవీ ఉంటుంది అని అనుకుంటున్నారు. అంతా సలార్ 2 సినిమా గురించి ఆలోచన చేయలేదు. ఎందుకంటే అటు ప్రశాంత్ నీల్ కూడా జూనియర్ ఎన్టీఆర్ తో డ్రాగన్ మూవీ పనుల్లో ఉంటాడు అని అంతా సైలెంట్ గా ఉన్నారు. కానీ, ఇప్పుడు అసలు విషయం ఏంటంటే.. సలారోడు సెట్స్ లోకి వెళ్లడానికి రెడీగా ఉన్నాడు అంట. అంతేకాదండోయ్.. రెగ్యూలర్ షూటింగ్ కూడా స్టార్ట్ కాబోతోంది అని చెబుతున్నారు. అలాగే ఇందులో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కూడా ఒక శుభవార్త ఉంది మరి.

విషయం ఏంటంటే.. ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఒక క్రేజీ బాధ్యతను తలకెత్తుకుంటున్నాడు. అదేంటంటే.. అటు సలార్ 2 షూటింగ్.. ఇటు జూనియర్ ఎన్టీఆర్ తో డ్రాగన్ షూటింగ్ కూడా ఒకేసారి చేసేయాలి అని ఫిక్స్ అయ్యాడంట. అది కూడా 2024, 2025 సంవత్సరాల్లో రెండు సినిమాలు షూటింగ్ పూర్తి చేయాలి అని డెడ్ లైన్ పెట్టుకున్నాడు అంటున్నారు. రెండు సినిమాల ప్రొడ్యూసర్లతో ఇప్పటికే స్వయంగా కలిసి మాట్లాడి వారిని కూడా ఒప్పించినట్లు చెబుతున్నారు. అంటే ఇంకేముంది.. ఆగస్టు 10 నుంచి ప్రశాంత్ నీల- ప్రభాస్ సలార్ 2 సినిమా సెట్స్ లోకి అడుగుపెడతారు అంటున్నారు. ఇప్పటికే సలార్ సినిమాతో ప్రభాస్ గట్టిగానే కొట్టాడు.

ఇప్పుడు పార్ట్ 2లో అసలు కథ ఉండబోతోంది. సలార్ 2 సెట్స్ మీదకు అనగానే ఫ్యాన్స్ కూడా ఎగ్జైట్ అవుతున్నారు. ఈ పార్ట్ లో ఇద్దరు స్నేహితులు ఎదురెదురు పడకతప్పదు. ఎందుకంటే తాను క్రియేట్ చేసిన సీల్ ని తానే అడ్డుకున్నాడు. అంటే కచ్చితంగా అంతా సలార్ మీదకు యుద్ధానికి వెళ్తారు. వాళ్లలో తన ప్రాణస్నేహితుడు కూడా ఉంటాడు. అందుకే ఫ్యాన్స్ అంతా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈసారి సలార్ కి మించి రికార్డులు క్రియేట్ చేస్తుందని అంచనాలు కూడా ఉన్నాయి. మరి ప్రశాంత్ నీల్.. ప్రభాస్- జూనియర్ ఎన్టీఆర్ తో ఒకే టైమ్ లైన్ లో సినిమాలు చేస్తాను అనడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş