iDreamPost
android-app
ios-app

దసరాకు ఫ్యాన్స్ కు పండగే..తారక్ నెక్స్ట్ మూవీ నుంచి బిగ్ అప్డేట్ !

  • Published Oct 07, 2024 | 11:41 AM Updated Updated Oct 07, 2024 | 11:41 AM

Prashanth neel NTR Movie Update: దేవర జోరు దసరా వరకు కొనసాగుతూనే ఉంటుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే ఇప్పుడు అభిమానుల ఫోకస్ అంతా కూడా తారక్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీదకు మళ్లింది. దీనితో ఇప్పుడు దానికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు అభిమానులు.

Prashanth neel NTR Movie Update: దేవర జోరు దసరా వరకు కొనసాగుతూనే ఉంటుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే ఇప్పుడు అభిమానుల ఫోకస్ అంతా కూడా తారక్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీదకు మళ్లింది. దీనితో ఇప్పుడు దానికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు అభిమానులు.

  • Published Oct 07, 2024 | 11:41 AMUpdated Oct 07, 2024 | 11:41 AM
దసరాకు ఫ్యాన్స్ కు పండగే..తారక్ నెక్స్ట్ మూవీ నుంచి బిగ్ అప్డేట్ !

మొత్తానికి దేవర విషయంలో అన్ని అనుకున్నట్లుగానే జరిగిపోయాయి. ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద 500 కోట్ల వైపు పరుగులు పెడుతుంది. డివైడ్ టాక్ తో మొదలైనా కానీ.. క్రమంగా అన్నీ తారు మారు అయ్యాయి. తారక్ ను అనుకున్నట్లుగా చూసినందుకు ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. సినిమా చూసి ఫ్యాన్స్ గర్వంగా కాలర్ ఎగరేస్తున్నందుకు తారక్ కూడా హ్యాపీనే. ఇక దసరా వరకు దేవర జోరు కొనసాగుతూనే ఉంటుంది. ఈ సినిమాకు పోటీగా ఏ సినిమాలు లేకపోవడం, దసరా సెలవులు రావడం.. ఇలా అన్ని దేవరకు కలిసొచ్చాయి. కాబట్టి మరికొన్ని రోజుల్లో.. ఇంకాస్త వసూళ్లు పెరిగే అవకాశం లేకపోలేదు. ఇక ఇప్పుడు తారక్ ఈ జోష్ ను ఇంకాస్త పెంచేలా.. ఫ్యాన్స్ కు మరో ట్రీట్ ఇవ్వనున్నాడట.

దేవర మూవీలో కొన్ని సీన్స్ , ఓ సాంగ్ కట్ చేశారు . మొన్నీమధ్యన వాటిని దసరా నుంచి యాడ్ చేస్తాం అని చెప్పారు. బహుశా ఈ ట్రీట్ అదే అయ్యుటుందిలే… అని అనుకుంటుంటే పొరపాటే. ఎందుకంటే ఈ ట్రీట్ దేవరకు సంబంధించింది కాదు. ఇది తారక్ నెక్స్ట్ మూవీస్ కు సంబంధించిన అప్డేట్. ప్రస్తుతం తారక్ వార్-2 షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఆ తర్వాత ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే దానికి సంబంధించి ఓ పోస్టర్ ను కూడా రివీల్ చేశారు. ప్రశాంత్ నీల్ తారక్ కాంబోలో రాబోతున్న ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ కూడా వినిపిస్తుంది. కానీ , మేకర్స్ నుంచి మాత్రం ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే దసరాకు కానుకగా ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను రివీల్ చేయనున్నారట మేకర్స్. ఈ మూవీ నుంచి 30 సెకండ్ల గ్లిమ్ప్స్ ను విడుదల చేయనున్నట్లు సమాచారం.

ఇప్పటికే ఈ కాంబో మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అటు ప్రశాంత్ నీల్ కూడా కథను బలంగా రెడీ చేస్తున్నాడు. బంగ్లాదేశ్ లో సెట్టిల్ అయిన ఓ తెలుగు ఫ్యామిలీ మయన్మార్ , వియాత్నం మాఫియాతో పోరాడే స్టోరీ లైన్ తో తెరకెక్కబోతుందని.. ఇప్పటికే ఈ సినిమా కథ గురించి డిస్కషన్స్ స్టార్ట్ అయ్యాయి. స్టోరీ లైన్ చాలా కొత్తగా ఉంది. ఇక ఈ స్టోరీ లైన్ కు ప్రశాంత్ నీల్ తన స్టైల్ లో మేక్ ఓవర్ చేస్తే ..అవుట్ పుట్ అదిరిపోతోంది. అటు ప్రశాంత్ నీల్ కూడా ఏకంగా 3000 కోట్ల వసూళ్లను రాబట్టేలా.. పక్కా ప్లాన్ ను రెడీ చేసే పనిలో ఉన్నాడు. సో ఇప్పటినుంచే ఈ సినిమాపై అందరికి భారీ అంచనాలు నెలకొన్నాయి. సరిగ్గా ఇప్పుడు గ్లిమ్ప్స్ కనుక రిలీజ్ అయితే, ఇక ఫ్యాన్స్ కు పండగే. ఏమౌతుందో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetjojobetcasibompokerklas giriş