iDreamPost
android-app
ios-app

ప్రశాంత్ నీల్ ఇంట్లో ఎన్టీఆర్-రిషబ్ శెట్టి!

  • Published Mar 02, 2024 | 3:29 PM Updated Updated Mar 02, 2024 | 3:29 PM

స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇంటికి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్​తో పాటు ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి వెళ్లారు. అసలు వాళ్లందరూ ఒకే చోట ఎందుకు కలుసుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇంటికి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్​తో పాటు ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి వెళ్లారు. అసలు వాళ్లందరూ ఒకే చోట ఎందుకు కలుసుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Mar 02, 2024 | 3:29 PMUpdated Mar 02, 2024 | 3:29 PM
ప్రశాంత్ నీల్ ఇంట్లో ఎన్టీఆర్-రిషబ్ శెట్టి!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టితో పాటు స్టార్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ కలసి ఉన్న పిక్స్ ప్రస్తుతం ఇంటర్నెట్​లో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా, ప్రశాంత్ నీల్ ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమానికి తారక్ తన భార్య లక్ష్మీ ప్రణతితో కలిసి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఇక, అదే కార్యక్రమానికి ‘కాంతార’ హీరో/డైరెక్టర్ రిషబ్ శెట్టి తన కుటుంబంతో కలసి వచ్చారు. అక్కడే వీరంతా కలసి సరదాగా మాట్లాడుకున్నారు. ఇప్పుడు అవే ఫోటోస్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తూ ఉండటంతో చక్కర్లు కొడుతున్నాయి.

అంతకుముందు చాలా రోజులకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలసి కనిపించి అభిమానులను అలరించారు. వీరిద్దరూ బేగంపేట్ ఎయిర్ పోర్టులో కలసి కనిపించిన వీడియోస్ ఇంటర్నెట్​లో ఉదయం నుంచి వైరల్ అవుతున్నాయి. కాగా, రామ్ చరణ్ అంబానీ ఇంట జరుగుతున్న ప్రీ వెడ్డింగ్ సెలబ్రెషన్స్ కోసం జామ్ నగర్ వెళ్లగా.. ఎన్టీఆర్ బెంగుళూరుకు వెళ్లారు. అక్కడ మైత్రి రవి, హోంబాలే ఫిల్మ్స్ నిర్మాత విజయ్, హీరో రిషబ్ శెట్టి, డైరెక్టర్ ప్రశాంత్ నీల్‏తో కలసి సందడి చేశారు.

ఇక, ఈ ఫొటోస్ చూసిన తారక్ అభిమానులు రిషబ్ శెట్టి కాంబినేషన్​లో ఒక సినిమా కావాలని కోరుకుంటున్నారు. ఇటీవల ఫిల్మ్ ఫేర్ అవార్డు వేడుకలో రిషబ్ శెట్టి, ఎన్టీఆర్ మధ్య జరిగిన సంభాషణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరూ స్టేజ్ పైనే కన్నడలో ఆప్యాయంగా మాట్లాడి అక్కడ ఉన్న అందరినీ ఆశ్చర్యపరిచారు. కాగా, ఎన్టీఆర్ తనను ‘కిరిక్ పార్టీ’ సినిమాకు అభినందించారని రిషబ్ శెట్టి తెలిపారు. ప్రస్తుతం కొరటాల శివ కాంబినేషన్​లో ‘దేవర’ సినిమా షూటింగ్​లో ఎన్టీఆర్ పాల్గొంటున్నారు. ఇక, రిషబ్ శెట్టి ‘కాంతార 2’ పనుల్లో బిజీగా ఉన్నారు. మరి.. అభిమానుల కోరిక మేరకు వీరిద్దరి కాంబోలో ఒక సినిమా రావాలని కోరుకుందాం.

ఇదీ చదవండి: కార్తీ నుండి ఖైదీ 2 అప్డేట్.. షూటింగ్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే?

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom