iDreamPost
android-app
ios-app

NTR-ప్రశాంత్ నీల్ మూవీ! ఈ ప్రయోగానికి ధైర్యం ఉండాలి!

  • Published Aug 09, 2024 | 9:24 PM Updated Updated Aug 09, 2024 | 9:24 PM

NTR31: టాలీవుడ్​లో మరో బ్లాస్టింగ్ మాస్ కాంబో మూవీ స్టార్ట్ అయింది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్​తో పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా ఇవాళ పూజా కార్యక్రమాలతో మొదలైంది.

NTR31: టాలీవుడ్​లో మరో బ్లాస్టింగ్ మాస్ కాంబో మూవీ స్టార్ట్ అయింది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్​తో పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా ఇవాళ పూజా కార్యక్రమాలతో మొదలైంది.

  • Published Aug 09, 2024 | 9:24 PMUpdated Aug 09, 2024 | 9:24 PM
NTR-ప్రశాంత్ నీల్ మూవీ! ఈ ప్రయోగానికి ధైర్యం ఉండాలి!

టాలీవుడ్​లో మరో బ్లాస్టింగ్ మాస్ కాంబో మూవీ స్టార్ట్ అయింది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్​తో పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా ఇవాళ పూజా కార్యక్రమాలతో మొదలైంది. రామానాయుడు స్టూడియోస్​లో ఓపెనింగ్ సెర్మనీ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు తారక్, ప్రశాంత్ నీల్ కుటుంబసభ్యులు హాజరయ్యారు. సినిమాను ప్రారంభించిన రోజే రిలీజ్ డేట్​ను కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. 2026, జనవరి 9వ తేదీన ఈ ఫిల్మ్​ను వరల్డ్ వైడ్​గా గ్రాండ్​గా విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబో మూవీ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురుచూసిన అభిమానులు, మూవీ లవర్స్​కు ఇది సూపర్ న్యూస్ అనే చెప్పాలి.

‘ఎన్టీఆర్ 31’ స్టార్ట్ అవడంతో ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. తారక్ వరుసబెట్టి ప్రాజెక్ట్​లను లైన్​లో పెట్టడం, ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత వచ్చిన గ్యాప్​ను భర్తీ చేసేందుకు ప్రయత్నించడం అభిమానులకు ఎనలేని సంతోషాన్ని ఇస్తోంది. ఎన్టీఆర్​తో ప్రశాంత్ నీల్ తెరకెక్కించే సినిమా ఎలా ఉంటుంది? దీని కథ ఏంటి? ఎక్స్​పెక్టేషన్స్​ను అందుకుంటారా? లాంటి చర్చలు ఇప్పుడు జోరుగా నడుస్తున్నాయి. అయితే ఈ మూవీ కోసం ప్రశాంత్ నీల్ అంచనాలకు అందని రీతిలో ప్రయోగం చేస్తుండటం గమనార్హం. సాధారణంగా నీల్ బలం యాక్షన్ మూవీస్ తీయడం. సింపుల్ స్టోరీ లైన్​ను డిఫరెంట్ స్క్రీన్​ప్లేతో విజువల్ వండర్​గా తీర్చిదిద్దడం ఆయన స్టైల్. ఫ్రెండ్​షిప్, మదర్ సెంటిమెంట్ లాంటివి థ్రెడ్​గా తీసుకొని కథలు అల్లుకుంటారు నీల్. అయితే తన బలమైన యాక్షన్​ జోనర్​ను వదిలి తారక్​తో సరికొత్త ప్రయోగం చేయనున్నట్లు స్వయంగా ఆయనే రివీల్ చేశారు.

‘ఎన్టీఆర్ 21’ స్టోరీ గురించి ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. ఇది యాక్షన్ మూవీ అని భావిస్తారని తనకు తెలుసునని.. కానీ ఆ జోనర్​లోకి వెళ్లాలనుకోవడం లేదన్నారు. డిఫరెంట్ ఎమోషన్స్​తో కూడిన వైవిధ్యభరితమైన సినిమా అన్నారు. ప్రశాంత్ నీల్ ఎంత చెప్పినా గానీ ఎన్టీఆర్​తో కాంబో అనగానే కచ్చితంగా యాక్షన్ మూవీనే ఆడియెన్స్, ఫ్యాన్స్ ఎక్స్​పెక్ట్ చేస్తారు. కొత్త కథ అని చెప్పి యాక్షన్ పాళ్లు తగ్గిస్తే వాళ్లు ఒప్పుకోకపోవచ్చు. అయితే తారక్​కు మంచి కథ దొరికితే నట విశ్వరూపం చూపిస్తారు. సీట్లకు ఆడియెన్స్​ను కట్టిపడేస్తారు. ఒకవేళ యాక్షన్ లాంటివి తగ్గినా తన నటనాపటిమతో దాన్ని భర్తీ చేసేస్తారనే నమ్మకం, భరోసా ఉండబట్టే నీల్ ఈ ప్రాజెక్ట్​ను ముందుకు తీసుకెళ్తున్నాడని వినిపిస్తోంది.