బాలీవుడ్లో అధిక బడ్జెట్ తో, పాన్ ఇండియా రేంజ్ లో భారీగా తెరకెక్కిస్తున్న సినిమా ‘బ్రహ్మాస్త్ర’. తెలుగులో బ్రహ్మాస్త్రంగా రిలీజ్ కానుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్బీర్ కపూర్, అలియాభట్ జంటగా నటిస్తుండగా బిగ్బీ అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎప్పుడో సెప్టెంబర్ లో రిలీజ్ కానున్న ఈ సినిమాకి ఎప్పట్నుంచో ప్రమోషన్స్ చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు మార్కెట్ మీద బాగా కాన్సంట్రేట్ చేశారు చిత్ర యూనిట్. టాలీవుడ్ లో ఒక […]
బిగ్ రియాలిటీ షో బిగ్బాస్ గతంలో అయిదు సీజన్లు పూర్తి చేసుకొని తర్వాత ఓటీటీలో బిగ్బాస్ నాన్ స్టాప్ పేరుతో టెలికాస్ట్ అయింది. అయితే దానికి అంతగా ఆదరణ దక్కకపోవడంతో అనుకున్న దానికంటే ముందుగానే బిగ్బాస్ నాన్ స్టాప్ ని ముగించేశారు. ఇటీవలే ఆ షో పూర్తయి బిందు మాధవి విన్నర్ గా నిలిచింది. గ్యాప్ కూడా లేకుండా ఈ సారి మళ్ళీ టీవిలో టెలికాస్ట్ చేసేందుకు నిర్వాహకులు అప్పుడే బిగ్బాస్ సీజన్ 6ని కూడా మొదలు […]
స్టార్ మా ఛానల్ లో అయిదు సీజన్ల పాటు ప్రేక్షకులను అలరించిన బిగ్ బాస్ షో ఓటిటి ద్వారా రెగ్యులర్ గా రన్ అవుతున్న సంగతి తెలిసిందే. టీవీ అంత ఆదరణ ఉందో లేదో రేటింగ్స్ కి సంబంధించిన సమాచారం స్పష్టంగా ఇవ్వడం లేదు కానీ ఫాలో అవుతున్న సంఖ్య బాగానే ఉందని సోషల్ మీడియా ట్రెండ్స్ ని బట్టి అర్థమవుతోంది. ఎప్పుడైనా చూసే వెసులుబాటు ఉండటం, ఇరవై నాలుగు గంటలు రన్ చేసే విధంగా డిజైన్ […]
కామెడీ ప్లస్ యాక్షన్ ని బ్యాలన్స్ చేస్తూ రివెంజ్ డ్రామాతో ప్రేక్షకులను మెప్పించడం అంత సులభం కాదు. ట్రీట్మెంట్ ఎంత బాగున్నా హీరో ఇమేజ్ తో పాటు వివిధ భాషల ఆడియన్స్ టేస్ట్ లను పరిగణనలోకి తీసుకోవడం చాలా అవసరం. లేకపోతే ఫలితం మారిపోతుంది. ఎలాగో చూద్దాం. 1989లో మోహన్ లాల్ హీరోగా ప్రియదర్శన్ దర్శకత్వంలో వచ్చిన ‘వందనం’ మలయాళంలో పెద్ద హిట్టు. గీతాంజలి ఫేమ్ గిరిజ హీరోయిన్ గా నటించింది. హాలీవుడ్ మూవీ ‘స్టేక్ అవుట్’ని […]
టాలీవుడ్ ఇలాంటి సంక్రాంతిని చూసి దశాబ్దం పైనే అయ్యింది. తెలుగు సినిమాకు ఎంత ప్రాముఖ్యం కలిగిన ఈ పండగ సీజన్ ఈసారి చాలా నీరసంగా గడిచిపోయింది. బంగార్రాజు లేకపోతే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది కానీ నాగార్జున ధైర్యం చేసి రిలీజ్ కు సిద్ధపడటం మంచిదయ్యింది. కాకపోతే రౌడీ బాయ్స్, హీరో ఆశించిన ఫలితాలను అందుకోలేకపోవడం నిరాశ పరిచింది. సూపర్ మచ్చి గురించి మాట్లాడుకోకపోవడం మంచిది. ఇప్పటిదాకా ఈ నాలుగు కలిసి 50 కోట్ల మార్కు అందుకోవడానికే […]
హాలీవుడ్ సినిమాలు ఇప్పుడంటే ఓటిటిలో విచ్చలవిడిగా దొరికి ఏది ఎక్కడి కాపీనో ఈజీగా గుర్తుపడుతున్నాం కానీ ఒకప్పుడు ఆ ఛాన్స్ లేదు. వీడియో క్యాసెట్లు రెగ్యులర్ గా చూసే అలవాటు ఉన్న వాళ్లకు మాత్రమే ఈ సౌలభ్యం దక్కేది. అందుకే అంత వేగంగా ఈ కహానీలు బయటికి వచ్చేవి కావు. ఓ మంచి ఉదాహరణ చూద్దాం. 1993 ఇంగ్లీష్లో ‘ఫ్యుజిటివ్’ అనే మూవీ వచ్చింది. హారిసన్ ఫోర్డ్ హీరోగా నటించిన ఈ క్రైమ్ ఎంటర్ టైనర్ కు […]
సంక్రాంతికి చెప్పుకోదగ్గ పోటీ లేకుండా మల్టీ స్టారర్ గా విడుదలైన బంగార్రాజు అనూహ్యంగా నెమ్మదించింది. ఏపిలో సగం ఆక్యుపెన్సీ, సెకండ్ షోల రద్దు లాంటి కారణాలు ఉన్నప్పటికీ ఇటు నైజామ్ లోనూ అంతే స్థాయిలో డ్రాప్ కనిపిస్తోంది. ఇప్పటిదాకా రాబట్టిన షేర్ సుమారు 30 కోట్ల దాకా ఉండొచ్చని ట్రేడ్ రిపోర్ట్. అంటే బ్రేక్ ఈవెన్ చేరుకోవడానికి ఇంకో పది కోట్ల దాకా రావాలి. ఈ శుక్రవారం కూడా చెప్పుకోదగ్గ రిలీజులు ఏవీ లేకపోవడం బంగార్రాజుకు కలిసొచ్చే […]
ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్, భీమ్లా నాయక్ లాంటి పెద్ద సినిమాలన్నీ సంక్రాంతి రేస్ నుంచి తప్పుకోవడం బంగార్రాజుకి బాగా కలిసి వస్తోంది. ఇండస్ట్రీ రికార్డులు కాదు కానీ నాగార్జున నాగ చైతన్య కెరీర్లోనే హయ్యెస్ట్ నెంబర్స్ ని నమోదు చేసే దిశగా పరుగులు పెడుతోంది. శుక్రవారంతో మొదలుపెట్టి నిన్నటిదాకా ప్రధాన కేంద్రాల్లో హౌస్ ఫుల్ బోర్డులు వేసుకున్న ఈ ఎంటర్ టైనర్ కు మొదటి వారం చాలా కీలకంగా మారనుంది. ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ బాగా దక్కించుకున్న […]
పండక్కి కొత్త అల్లుడు వస్తాడేమో కానీ, బంగార్రాజు మాత్రం పాత అల్లుడే. సొగ్గాడే చిన్నినాయనేకి సీక్వెల్గా వచ్చింది. కొత్తదనమేమీ లేకుండా దాన్నే మళ్లీ తీసారు. నాగార్జునకి బదులు నాగచైతన్య వున్నాడు. పాత బంగార్రాజు అలాగే వుంటాడు. ఈయన మనుమడు బంగారురాజు. సినిమా ప్రారంభంలో ఎవరో దుండగులు నిధి కోసం శివలింగాన్ని పెకలించడం, చంద్రముఖిలో వున్నటు వంటి గ్రాఫిక్స్ పాము వాళ్లని వెంటబడి తరమడంతో కథ మొదలవుతుంది. పార్ట్ వన్లో నరకం నుంచి భూలోకానికి వచ్చిన నాగార్జున ఈ […]