iDreamPost
android-app
ios-app

Naa Saami Ranga: చాలా త్వరగానే OTTలోకి నా సామిరంగ! డేట్ ఎప్పుడంటే?

సీనియర్‌ హీరో నాగార్జున తాజాగా ‘నా సామిరంగ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా.. జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సీనియర్‌ హీరో నాగార్జున తాజాగా ‘నా సామిరంగ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా.. జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Naa Saami Ranga: చాలా త్వరగానే  OTTలోకి నా సామిరంగ! డేట్ ఎప్పుడంటే?

నాగార్జున హీరోగా నటించిన ‘నా సామిరంగ’ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ జనవరి 14న విడుదల అయింది. థియేటర్లలో చిత్రానికి మంచి స్పందన వచ్చింది. కేవలం ప్రేక్షకులే కాదు.. రివ్యూవర్లు కూడా మంచి రివ్యూలు ఇచ్చారు. కలెక్షన్ల విషయంలో కూడా మూవీ దూసుకువెళుతోంది. ఇప్పటికే బ్రేక్‌ ఈవెన్‌ పాయింట్‌ను దాటేసింది. మొదటి రోజు 5 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. ఇక, ఎనిమిది రోజుల్లో 45 కోట్ల రూపాయలు కలెక్ట్‌ చేసింది.

సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో నా సామిరంగ రెండో క్లీన్‌ హిట్‌గా నిలిచింది. ఇక, నా సామిరంగ ఓటీటీ స్ట్రీమింగ్‌ డేట్‌కు సంబంధించి ఓ న్యూస్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. నా సామిరంగ ఫిబ్రవరి మూడో వారంలో ఓటీటీకి వచ్చే అవకాశం ఉంది. మూడో వారంనుంచి స్ట్రీమింగ్‌ అయ్యే అవకాశం ఉంది. అయితే, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

NAA SAAMI RANGA MOVIE IN OTT

సినిమా టీం నుంచి అఫిషియల్‌ అప్‌డేట్‌ రావాల్సి ఉంది. కాగా, నా సామిరంగ సినిమాకు విజయ్‌ బిన్ని దర్శకత్వం వహించారు. నాగార్జునకు జంటగా.. అషిక రంగనాథ్‌ నటించారు. అల్లరి నరేష్‌, రాజ్‌ తరుణ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఎమ్‌ఎమ్‌ కీరవాణ సంగీతం అందించారు. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌, అన్నపూర్ణ స్టూడియోస్‌ సంయుక్తంగా సినిమాను తెరకెక్కించాయి. దాదాపు 25 కోట్ల రూపాయలతో మూవీ తెరకెక్కింది. ఎనిమిది రోజుల్లోనే బ్రేక్‌ ఈవెన్‌ సాధించింది.

ఇంతకీ మూవీ కథ ఏంటంటే..

కోనసీమలోని అంబాజీ పేట అనే ఊరిలో కిష్టయ్య(నాగార్జున) ఉంటాడు. అతడు ఓ అనాథ. అతనిని ఓ తల్లి ఆదరించి, దగ్గరికి తీసుకుంటుంది. ఆమె చనిపోయాక ఆమె కొడుకు అంజిని కిష్టయ్య అన్నీ తానై చూసుకుంటాడు. ఇక కిష్టయ్య ఆ గ్రామంలోని వరాలుని చిన్నప్పనుంచి ప్రేమిస్తుంటాడు. పెద్దయ్య అనే ఊరి పెద్ద మాటను ఈ ఇద్దరు అన్నదమ్ములు వేద వాక్కులా పాటిస్తుంటారు. అంబాజీ పేటకు చెందిన భాస్కర్ తన ప్రేమ వ్యవహారంతో చిక్కుల్లో పడతాడు. పెద్దయ్య భాస్కర్‌ను కాపాడే బాధ్యతను కిష్టయ్యకి అప్పగిస్తాడు. ఈ క్రమంలో కిష్టయ్య, అంజి ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటి? అన్నదే “నా సామిరంగ” కథ. మరి, నా సామిరంగ ఓటీటీ రిలీజ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.