iDreamPost
android-app
ios-app

అప్పుడు ఆ సినిమాలో నాగార్జున పక్కన.. ఇప్పుడు నా సామిరంగలో అమ్మగా..

  • Published Jan 31, 2024 | 7:45 AM Updated Updated Jan 31, 2024 | 11:10 AM

నా సామిరంగ సినిమాలో నాగార్జునకి అమ్మలాంటి పాత్రలో చేసిన ఒకప్పటి హీరోయిన్ తాజాగా నాసామిరంగ సక్సెస్ మీట్ లో ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

నా సామిరంగ సినిమాలో నాగార్జునకి అమ్మలాంటి పాత్రలో చేసిన ఒకప్పటి హీరోయిన్ తాజాగా నాసామిరంగ సక్సెస్ మీట్ లో ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

  • Published Jan 31, 2024 | 7:45 AMUpdated Jan 31, 2024 | 11:10 AM
అప్పుడు ఆ సినిమాలో నాగార్జున పక్కన.. ఇప్పుడు నా సామిరంగలో అమ్మగా..

టాలీవుడ్ మన్మథుడు నాగార్జున తాజాగా నటించిన మూవీ నా సామిరంగ. విజయ్ బిన్ని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఈ సినిమాలో నాగార్జున, ఆషికా రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటించారు. కింగ్ నాగార్జున నటించిన ఈ సినిమాకు ఆడియెన్స్ నుంచి మంచి టాక్ వచ్చింది. అయితే ఈ సినిమాలో నాగార్జునకి అమ్మలాంటి పాత్రలో చేసిన ఒకప్పటి హీరోయిన్ తాజాగా నాసామిరంగ సక్సెస్ మీట్ లో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. దాదాపు 21 ఏళ్ల క్రితం కింగ్ నాగార్జున నటించిన సినిమాలో చేసి.. ఇప్పుడు నా సామిరంగ సినిమాలో అమ్మ లాంటి పాత్రలో నటించానని వెల్లడించింది.

సినిమా ఇండస్ట్రీలో తరాలు మారుతున్నాయి. సీనియర్ హీరోలా పిల్లలు హీరో హీరోయిన్లుగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్నారు. కొంత మంది సీనియర్ హీరోలు మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి హీరోకు తండ్రి పాత్రలు, విలన్ పాత్రలు చేస్తూ రాణిస్తున్నారు. మరికొంత మంది మాత్రం 60లో ఇరవైల కనిపిస్తూ హీరోలుగా సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కింగ్ నాగార్జున నటించిన సంతోషం సినిమాలో ఓ పాత్రలో అలరించిన ఒకప్పటి హీరోయిన్ మధుమణి ఇప్పుడు నా సామిరంగలో నాగార్జునకు అమ్మలాంటి పాత్రలో ఆకట్టుకుంది. అప్పుడు హీరో పక్కన.. ఇన్నేళ్ల తర్వాత హీరోకు అమ్మ లాంటి పాత్రలో నటించడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేసింది.

తెలుగులో సీరియల్స్ తో కెరీర్ మొదలుపెట్టిన హీరోయిన్ మధుమణి ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. కాగా నాగార్జున నటించిన సంతోషం సినిమా 2002లో విడుదలైంది. ఆ సినిమాలో మధుమణి హీరోయిన్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తుల్లో మాలిక అనే పాత్రలో అలరించింది. అప్పట్లో నాగార్జునతో దిగిన ఫోటో ఇదివరకే సోషల్ మీడియాలో పోస్టు చేసింది మధుమణి. ఇప్పుడు సుమారు 21 ఏళ్ళ తర్వాత మళ్ళీ నాగార్జునతో నా సామిరంగ సినిమాలో అమ్మ లాంటి పాత్రలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

 

View this post on Instagram

 

A post shared by Madhumani Mady (@madhumani_naidu)

 

View this post on Instagram

 

A post shared by Madhumani Mady (@madhumani_naidu)

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetine girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom