iDreamPost
android-app
ios-app

Naa Saami Ranga: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘నా సామిరంగ’.. నాగ్ సేఫ్ గేమ్!

  • Published Jan 09, 2024 | 8:15 PM Updated Updated Jan 09, 2024 | 8:15 PM

జనవరి 14న 'నా సామిరంగ' అంటూ బాక్సాఫీస్ పై దండయాత్ర చేద్దానికి వస్తున్నాడు నాగార్జున. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది ఈ మూవీ. దీంతో నాగ్ సేఫ్ గేమ్ లో ఉన్నారని, ఫ్యాన్స్ తెగ సంతోష పడుతున్నారు.

జనవరి 14న 'నా సామిరంగ' అంటూ బాక్సాఫీస్ పై దండయాత్ర చేద్దానికి వస్తున్నాడు నాగార్జున. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది ఈ మూవీ. దీంతో నాగ్ సేఫ్ గేమ్ లో ఉన్నారని, ఫ్యాన్స్ తెగ సంతోష పడుతున్నారు.

Naa Saami Ranga: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘నా సామిరంగ’.. నాగ్ సేఫ్ గేమ్!

ఈసారి సంక్రాంతి పండగ మెుత్తం టాలీవుడ్ పైనే ఉంది. బడా హీరోలు తమ మూవీలతో ప్రేక్షకులను అలరించడనికి ముందుకువస్తున్నారు గుంటూరు కారం తో మహేష్ బాబు, హనుమాన్ మూవీతో తేజ సజ్జ, నా సామిరంగ తో సీనియర్ హీరో నాగార్జున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వీరితో పాటుగా మరికొన్ని సినిమాలు కూడా విడుదలకు సిద్దంగా ఉన్నాయి. సీనియర్ హీరో నాగార్జున మరోసారి సంక్రాంతి విన్నర్ గా నిలిచేందుకు రెడీ అవుతున్నాడు. జనవరి 14న ‘నా సామిరంగ’ అంటూ బాక్సాఫీస్ పై దండయాత్ర చేద్దానికి వస్తున్నాడు. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది ఈ మూవీ. దీంతో నాగ్ సేఫ్ గేమ్ లో ఉన్నారని, ఫ్యాన్స్ తెగ సంతోష పడుతున్నారు. మరి ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికెట్ ఇచ్చింది? దాని రన్ టైమ్ ఎంత? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

అక్కినేని నాగార్జున.. యంగ్ హీరోలతో పోటీగా సినిమాలు తీస్తూ, ప్రేక్షకులను అలరిస్తున్నాడు. లేటెస్ట్ గా నా సామిరంగ’ మూవీతో సంక్రాంతి పండక్కి మరో హిట్ కొట్టడానికి వస్తున్నాడు. తాజాగా ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఇక ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. మూవీ రన్ టైమ్ 2 గంటల 26 నిమిషాలకు లాక్ చేశారు. ఇది సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. దీంతో నాగ్ ఈ విషయంలో సేఫ్ గేమ్ ఆడుతున్నారని సినీ పండితులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 2 గంటల 26 నిమిషాలు కాబట్టి సినిమా ఫలితం కొద్దిగా అటూ, ఇటూ అయినా నెట్టుకురాగలుగుతుంది. సెన్సార్ తర్వాత నాగ్ అభిమానులు సినిమా ఫలితంపై మరింత ధీమాగా ఉన్నారు.

ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన ట్రైలర్ మూవీపై మరింత హైప్ ను క్రియేట్ చేసింది. ట్రైలర్ లో సినిమా కథను రివీల్ చేయకుండా యాక్షన్, రొమాంటిక్ సీన్స్ తో బజ్ తీసుకురావడంతో మేకర్స్ విజయవంతం అయ్యారనే చెప్పాలి. నాగ్ నుంచి ప్రేక్షకులు కోరుకుంటున్న అన్ని అంశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయని ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. ఇక నా సామిరంగ చిత్రంతో డ్యాన్స్ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ డైరెక్టర్ గా మారారు. అల్లరి నరేష్, రాజ్ తరుణ్, ఆషికా రంగనాథ్, రుక్సార్ థిల్లాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అల్లరి నరేష్, రాజ్ తరుణ్, నాగార్జునల మధ్య వచ్చే సన్నివేశాలు థియేటర్లలో నవ్వులు పూయించడం ఖాయమని ట్రైలర్ లో హింట్ ఇచ్చాడు దర్శకుడు. మరి నాగ్ ఈ సంక్రాంతికి మరో హిట్ ను ఖాతాలో వేసుకుంటాడో, లేదో చూడాలి.