iDreamPost
android-app
ios-app

Big Boss 8: ప్రేరణ ఇంట్లో విషాదం.. హౌస్ నుంచి బయటకు వచ్చేస్తుందా?

  • Published Sep 17, 2024 | 9:31 PM Updated Updated Sep 17, 2024 | 9:31 PM

Big Boss 8: బిగ్‌బాస్ 8 స్టార్ట్ అయ్యి రెండు వారాలు గడిచింది. ఈ సీజన్ ఫస్ట్ నుంచి బాగానే ఆకట్టుకుంటోంది.

Big Boss 8: బిగ్‌బాస్ 8 స్టార్ట్ అయ్యి రెండు వారాలు గడిచింది. ఈ సీజన్ ఫస్ట్ నుంచి బాగానే ఆకట్టుకుంటోంది.

  • Published Sep 17, 2024 | 9:31 PMUpdated Sep 17, 2024 | 9:31 PM
Big Boss 8: ప్రేరణ ఇంట్లో విషాదం.. హౌస్ నుంచి బయటకు వచ్చేస్తుందా?

బిగ్‌బాస్ 8 స్టార్ట్ అయ్యి ఇప్పటికి రెండు వారాలు గడిచింది. హౌస్ నుంచి బేబక్క, శేఖర్ భాష ఎలిమినేట్ అయిపోయారు. ఈ సీజన్ ఫస్ట్ నుంచి కూడా బాగానే ఆకట్టుకుంటోంది. ఈ సీజన్లో టాస్కులు బాగానే ప్లాన్ చేశారు. హౌస్ లో గొడవలు, నామినేషన్స్ హీటు మాములుగా లేదనే చెప్పాలి. ఎక్కువగా గొడవలు చేసి వాదించే వాళ్లే ఎక్కువ హైలెట్ అవుతున్నారు.సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నారు. ఇక గత వారం బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయిన శేఖర్ భాషా కూడా కావాలనే బయటకి వచ్చేశాడు. ఎందుకంటే అంతకు ముందు అతనికి కొడుకు పుట్టాడు. తనకు కొడుకు పుట్టిన విషయాన్ని శనివారం నాడు ఎపోసిడ్‌లో నాగార్జున చెప్పారు.

ఈ విషయం చెప్పిన దగ్గర నుంచి తాను హౌస్ నుంచి బయటకి రావాలని అనుకున్నాడు. ఆ విషయం కెమెరాలకి కూడా చెప్పాడు. అవకాశముంటే తనని ఎలిమినేట్ అయ్యేలా చూడమని మిగిలిన హౌస్‌మేట్స్‌తో కూడా అన్నాడు. అయితే ఈ ఫుటేజీని నిర్వహకులు మనకు ఎపిసోడ్‌లో చూపించలేదు. కానీ బయటకి వచ్చిన తర్వాత శేఖర్ భాషా స్వయంగా ఇదంతా చెప్పాడు. ఇక శేఖర్ భాష లాగే హౌస్ లో ఉన్న ప్రేరణ కూడా బయటకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆమె ఇంట్లో విషాదం జరిగినట్టు సమాచారం తెలిసింది. ప్రేరణ భర్త వాళ్ల అమ్మమ్మ చనిపోయారని తెలిసింది. ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ప్రేరణ కొన్ని నెలల క్రితమే పెళ్లి చేసుకుంది. ఈమె కన్నడ అమ్మాయి. తాను పేరుకే కన్నడ అమ్మాయి కానీ తెలుగు సీరియల్స్ చేస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ కంట్లో పడింది. తన ఆటతో బాగానే క్రేజ్ సంపాదించుకుంటుంది. ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్ లో టాప్ 5 రేసులో నిలిచే హౌస్ మేట్ గా నిలుస్తుంది. అలాంటిది ఇప్పుడు ఈమె ఇంట్లో విషాదం జరిగింది. దీని గురించి రాబోయే ఎపిసోడ్‌లో ఈమెకు చెప్పే అవకాశమున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ ఆమె ఈ వార్త విన్నాక బయటకి వెళ్ళే అవకాశాలు లేకపోలేదు. ఇక ఈ విషయం తెలిశాకా ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఇక ఇలాంటి సమయంలో ప్రేరణ బయటకి వస్తే కరెక్టా? లేదా హౌస్ లో గేమ్ ని కొనసాగించడం కరెక్టా? అనే దానిపై మీరేమి అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetmeritbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom