iDreamPost
android-app
ios-app

డాన్ సినిమాలో “ఇంత అందంగా ఉన్నావే” సాంగ్ ఇంత పాతదా? సేమ్ టూ సేమ్ దించేశారు!

  • Published Jun 29, 2024 | 8:14 PM Updated Updated Jun 29, 2024 | 8:14 PM

టాలీవుడ్ కింగ్ నాగర్జున నటించిన డాన్ సినిమా అందరికి గుర్తేండే ఉంటుంది. అయితే ఈ సినిమాలో నాగర్జున, అనుష్కల మధ్య ఇంత అందంగా ఉన్నావే అనే సాంగ్ ఉంటుంది. అయితే ఈ సాంగ్ వేరో సినిమాలో సేమ్ టూ సేమ లిరిక్స్ ను కాపీ చేశారు. ఇంతకి ఆ సినిమా ఏదంటే..?

టాలీవుడ్ కింగ్ నాగర్జున నటించిన డాన్ సినిమా అందరికి గుర్తేండే ఉంటుంది. అయితే ఈ సినిమాలో నాగర్జున, అనుష్కల మధ్య ఇంత అందంగా ఉన్నావే అనే సాంగ్ ఉంటుంది. అయితే ఈ సాంగ్ వేరో సినిమాలో సేమ్ టూ సేమ లిరిక్స్ ను కాపీ చేశారు. ఇంతకి ఆ సినిమా ఏదంటే..?

  • Published Jun 29, 2024 | 8:14 PMUpdated Jun 29, 2024 | 8:14 PM
డాన్ సినిమాలో “ఇంత అందంగా ఉన్నావే” సాంగ్ ఇంత  పాతదా?  సేమ్ టూ సేమ్ దించేశారు!

ప్రస్తుతం ఇండియాన్ సినిమాలు హాలీవుడ్ మూవీస్ కథకు దగ్గరగా.. అదే రేంజ్ లో బహు భాషల్లో తీయడం చాలా కామన్ అయిపోయింది. ముఖ్యంగా కొన్ని కొన్ని సినిమాల్లో అయితే ఇఫ్ సీన్ టూ సీన్ కాపీలా కూడా అనిపిస్తుంటుంది. అయితే ఒక సినిమాను వేరే భాషల్లో కాపీ చేయడం అనే ట్రెండ్ కొత్తేమీ కాదు.కానీ, ఇప్పుడు సినిమాలనే కాదు.. మ్యూజిక్ ను కూడా కాపీ చేయడం ట్రెండ్ గా మారిపోయింది.ఇప్పటికే పలు సినిమాల్లో మ్యూజిక్ కంపోజిషన్.. మునపటి సినిమాల సంగీతానికి దగ్గరగా ఉన్నట్లు అనిపించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు సినిమాలు, మ్యూజిక్ మాత్రమే కాపీ చేస్తున్నారని అనుకున్నాం. కానీ, సినిమాలో పాటల లిరిక్స్ ను కూడా వేరొక సినిమాలో కాపీ చేశారనే విషయం ఎవరికైనా తెలుసా.. ప్రస్తుతం ఓ స్టార్ హీరో సినిమాలో కాపీ చేసిన లిరిక్స్ అనేవి నెట్టింట వైరల్ గా మారాయి. ఇంతకి ఆ సినిమా ఏదంటే..

టాలీవుడ్ కింగ్ నాగర్జున నటించిన ‘డాన్’ సినిమా అందరికి గుర్తేండే ఉంటుంది. ఇక ఈ సినిమాకు రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించడమే కాకుండా.. అందులో కీలక పాత్ర కూడా చేశాడు. అయితే ఇదులో అనుష్క హీరోయిన్ గా నటించన విషయం తెలిసిందే. ఇకపోతే డాన్ మూవీ 2007, డిసెంబర్ 20వ తేదీన థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే.కాగా, ఈ మూవీకి సంగీతాన్ని కూడా రాఘర లారెన్స్ అందించారు. ఇకపోతే డాన్ మూవీ అప్పటిలో ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఆ సినిమాలోని పాటలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే ఆ సినిమాలో నాగర్జున, అనుష్కల మధ్య ‘ఎంత అందంగా ఉన్నావే ఎవరె నువ్వు‘ అనే సాంగ్ వస్తుంది. ఇక ఆ సాంగ్ లెరిక్స్ చాలా బాగుంటాయి. కాకపోతే ఆ సాంగ్ లో వచ్చిన మొదటి రెండు లైన్ల లెరిక్స్ వేరో సినిమాలో కాపీ చేసినవి. అదేంటి సాంగ్ లెరిక్స్ కాపీ చేయడమా.. అది నాగర్జున సినిమాలో అని ఆశ్చర్యపోతున్నారా.. అవును మీరు విన్నది నిజమే.

డాన్ సినిమాలోని ఆ సాంగ్ లిరిక్స్.. వేరో సినిమాకు సంబంధించిన పాటలో కాపీ చేసినవి. ఇంతకి ఆ సినిమా ఏదంటే.. యాక్టర్, బుల్లితెర నటుడు సాయి కిరణ్ అప్పటిలో హీరోగా ‘సువర్ణ’ అనే సినిమాలో నటించాడు. ఇక ఈ సినిమాని డైరెక్టర్ బాలాజీ జనవరి 4 2007లో తెరకెక్కించారు.కాగా, అందులో జయంతి హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాలో సాయి కిరణ్,జయంతి మధ్య కూడా ఎంత అందంగా ఉన్నావే అనే సాంగ్ ఉంటుంది. పైగా ఆ సాంగ్ లో మొదట రెండు లైన్లలో వచ్చిన లెరిక్స్ ను నాగర్జున డాన్ సినిమాలో కాపీ చేశారు. అంతేకాకుండా ఇక్కడ గమనించ దగ్గ విషయం ఏమిటంటే.. సువర్ణ సినిమా జనవరిలో విడుదల కాగా, డాన్ సినిమా డిసెంబర్ లో విడుదలైంది. అయితే రెండు సినిమాల్లో మొదటి 2 లైన్స్ ఒకేళా ఉండటంతో చివరికి పాటలను కూడా విడిచిపెట్టడం లేదా అంటూ నెట్టింట ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడయాలో వైరల్ గా మారింది. మరి, ఈ సాంగ్ లెరిక్స్ ను కూడా కాపీ చేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibommeritbet girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetholiganbet