iDreamPost
android-app
ios-app

డబ్బు కోసం ఏమైనా చేస్తారా? సినిమా వాళ్లపై ఎందుకిలాంటి వ్యాఖ్యలు?

  • Published Oct 03, 2024 | 1:56 PM Updated Updated Oct 03, 2024 | 1:56 PM

Konda Surekha, Samantha, Nagarjuna, KTR: సమంత, నాగార్జునపై మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే.. అసలు సినిమా వాళ్లంటే ఎందుకింత చులకన భావం అనేది ఇప్పుడు చూద్దాం..

Konda Surekha, Samantha, Nagarjuna, KTR: సమంత, నాగార్జునపై మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే.. అసలు సినిమా వాళ్లంటే ఎందుకింత చులకన భావం అనేది ఇప్పుడు చూద్దాం..

  • Published Oct 03, 2024 | 1:56 PMUpdated Oct 03, 2024 | 1:56 PM
డబ్బు కోసం ఏమైనా చేస్తారా? సినిమా వాళ్లపై ఎందుకిలాంటి వ్యాఖ్యలు?

సినిమా హీరోలకు, హీరోయిన్లను చాలా మంది అభిమానిస్తుంటారు. వాళ్లను రోల్‌ మోడల్‌గా భావించేవాళ్లు కొన్ని కోట్ల మంది ఉన్నారు. కొంతమంది యాక్టర్లకు గుడి కట్టిన అభిమానులు కూడా ఉన్నారు. తమ అభిమాన హీరో సినిమా విడుదల అవుతుందంటే చాలు.. ఎక్కడలేని హంగామా చేస్తుంటారు ఫ్యాన్స్‌. ఇలా గ్లామర్‌ ప్రపంచంలో ఉంటే వాళ్లు డెమీ గాడ్స్‌లా జీవిస్తూ ఉంటారు. కానీ, ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే.. మరో వైపు సినిమా వాళ్లంటే చాలా మందిలో చులకన భావం, అనేక మందికి వాళ్లే సాఫ్ట్‌ టార్గెట్‌. సినిమా వాళ్లంటే డబ్బు కోసం ఏమైనా చేస్తారని, ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉన్న ఆడవాళ్ల మీద అయితే.. ఇష్టమొచ్చినట్లు కామెంట్స్‌ చేసే వారు కోకల్లలు.

తాజాగా తెలంగాణ మంత్రి కొండా సురేఖ సైతం ఇలాంటి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ప్రత్యర్థులుపై ఆరోపణలు చేయడమనేది కామన్‌. ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకులు చేసుకుంటున్న కామెంట్లకు, వాళ్లు మాట్లాడుకునే మాటలను ఎవరూ సీరియస్‌గా తీసుకోవడం లేదు. కానీ, కొండ సురేఖ.. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై పలు ఆరోపణలు చేసే క్రమంలో.. హీరోయిన్‌ సమంత, అలాగే హీరో నాగార్జున, నాగచైతన్యల గురించి ప్రస్తావిస్తూ చేసిన కామెంట్స్‌ అందరిని షాక్‌కు గురిచేశాయి. ‘ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చకుండా ఉండాలంటే.. సమంతను నా దగ్గరికి పంపాలని కేటీఆర్‌ అడిగితే.. నాగార్జున, సమంతాను వెళ్లమని ఆదేశిస్తే, సమంత వెళ్లలని చెప్పినందుకు ఆమెకు నాగచైతన్య విడాకులు ఇచ్చాడు’ ఇది కొండా సురేఖ చెప్పిన మాటలు. వినేందుకు థర్డ్‌క్లాస్‌ మాటల్లా ఉన్నాయి.

ఒక రాజకీయ ప్రత్యర్థిపై ఆరోపణలు చేసేందుకు.. వేరే వాళ్ల వ్యక్తిగత జీవితాలను ప్రస్తావించాల్సిన హక్కు కచ్చితంగా మంత్రి కొండా సురేఖకు లేదు. సమంత-నాగచైతన్య ఎందుకు విడాకులు తీసుకున్నారన్నది వాళ్ల వ్యక్తిగత విషయం. ఈ కామెంట్స్‌లో సురేఖ చేసిన మరో పెద్ద కామెంట్‌ ఏంటంటే.. కేటీఆర్‌ వద్దకు వెళ్లమని సమంతాను నాగార్జున కోరినట్లు పేర్కొన్నారు. ఇది ఎంత దారుణమైన స్టేట్‌మెంట్‌? సినిమా ఫీల్డ్‌లో ఉన్నంత మాత్రనా.. వాళ్లకు డబ్బే ముఖ్యం అనుకోవడం ఎంత ముర్ఖత్వం. తన కొడుకు భార్యగా ఉన్న మహిళను, తన కొడల్ని ఏ మామ అయినా అలా చెబుతారా? ఆ… సినిమా వాళ్లు, వాళ్ల గురించి ఏం చెప్పినా? ఎలాంటి కామెంట్స్‌ చేసినా? ఏం కాదులే అనే చులకన భావమా? లేదా రాజకీయ నాయకులం, పదవిలో ఉన్నాం ఏం చెప్పినా చెల్లిపోతుందనే అహంకారమా? ఎందుకు ఇలాంటి మాటలు?

నిజంగానే.. ఓ రాయకీయ నేత తన పదవిని అడ్డం పెట్టుకొని మహిళలను లొంగదీసుకోవాలని చూస్తుంటే.. అతని నిజస్వరూపాన్ని బయటపెట్టాల్సిన విధానం ఇదా? ఏదో గాలి మాటలు మాట్లాడేసి.. సమాజంలో గౌరవ మర్యాదలు ఉన్న ఓ కుటుంబంలో.. ఎలాంటి కుటుంబ విలువులు లేవు అనే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు కరెక్ట్‌? డబ్బులిస్తే.. సినిమాల్లో నటిస్తున్నార కదా అని.. అదే డబ్బు కోసం సొంత కోడల్ని, కూతుర్లని వేరే వాళ్ల దగ్గరికి పంపేంత నీచ స్థితికి దిగజారిపోయి ఎవరు బతకట్లేదు. అయినా.. గ్లామర్‌ ప్రపంచంలో చీకట్లో ఆడపిల్లలపై దారుణాలు జరుగుతుంటే.. ప్రభుత్వంలో ఉన్న వాళ్లు వాటిని అడ్డుకోవాలి కానీ, ఇలా హేమమైన వ్యాఖ్యలు చేసి.. నలుగురిలో చులకన కావొద్దని మనవి.