iDreamPost
android-app
ios-app

పాకిస్తాన్‌లో నాగార్జునను పోలిన వ్యక్తి.. నెలకు లక్షల్లో సంపాదన

  • Published Mar 12, 2024 | 12:53 PM Updated Updated Mar 12, 2024 | 12:53 PM

ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారనే నానుడి వింటూ ఉంటాం. అయితే ఈ క్రమంలో టాలీవుడ్ హీరో నాగార్జునను పోలిన ఓ వ్యక్తి.. పాకిస్తాన్ లో తెగ వైరల్ అయిపోతున్నాడు. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారనే నానుడి వింటూ ఉంటాం. అయితే ఈ క్రమంలో టాలీవుడ్ హీరో నాగార్జునను పోలిన ఓ వ్యక్తి.. పాకిస్తాన్ లో తెగ వైరల్ అయిపోతున్నాడు. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Mar 12, 2024 | 12:53 PMUpdated Mar 12, 2024 | 12:53 PM
పాకిస్తాన్‌లో నాగార్జునను పోలిన వ్యక్తి.. నెలకు లక్షల్లో సంపాదన

సాధారణంగా కొందరు వ్యక్తులను చూస్తూ ఉంటే.. వాళ్ళు మనకు పరిచయం లేకపోయినా సరే.. మనకు బాగా తెల్సిన వ్యక్తులల అనిపిస్తూ ఉంటారు. అలాగే ఇప్పటివరకు మనం.. సోషల్ మీడియాలో కొంతమందిని హీరో హీరోయిన్ల పోలికలతో ఉన్నవాళ్ళని కూడా చూశాం. అలా సోషల్ మీడియాలో తెగ పాపులర్ అయిపోతుంటారు కొంత మంది వ్యక్తులు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి కూడా ఈ కోవకు చెందిన వాడే. ఇంతకీ ఈ వ్యక్తి ఇంత పాపులర్ అవ్వడానికి కారణం.. ఇతను ఓ ప్రముఖ టాలీవుడ్ హీరో పోలికలు కలిగి ఉండడమే. మరి, ఇంతకీ ఈ వ్యక్తి ఎవరు ? ఏ హీరో పోలికలు కలిగి ఉన్నాడు ! అనే విషయాలను చూద్దాం.

ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి పాకిస్తాన్ కు చెందిన ఓ ఫుడ్ వ్లోగర్. ఆ వ్యక్తి పేరు జైన్ అక్మల్ ఖాన్ అలియాస్ షికారి మాస్. ఈ వ్యక్తి 2019 నుంచి టిక్ టాక్ లో వీడియోస్ చేస్తుండేవాడు. అయితే, అలా టిక్ టాక్ వీడియోస్ చేస్తుండగా.. ఆ వ్యక్తికీ ఎవరో .. తానూ టాలీవుడ్ హీరో కింగ్ నాగార్జునలా ఉన్నట్లు చెప్పారట. దీనితో ఆ వ్యక్తి నాగార్జున గురించి తెలుసుకున్నాడు. ఇక ఆ తర్వాత సేమ్ నాగార్జునల మేక్ అప్ వేసుకుని వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇక అప్పటినుంచి ఈ వ్యక్తి మరింత పాపులర్ అయిపోయాడు. రోజు రోజుకి ఇతనికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ వ్యక్తి ఫుడ్ వ్లోగింగ్ చేస్తున్నాడు.

కాగా, పాకిస్తాన్ లో ఫుడ్ వ్లోగింగ్ చేస్తూ.. ఫేమస్ ఫుడ్ వ్లోగర్ గా మంచి నేమ్ తెచ్చుకున్న.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు. “నేను నాగార్జున పోలికలతో ఉండడం నాకు బాగా కలిసొస్తుంది. ఫుడ్ వీడియోస్ చేసుకుంటూ నెలకు రూ. 4-5 లక్షల వరకు సంపాదిస్తున్నాను. ప్రస్తుతం జీవితం హ్యాపీగా ఉంది.” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక దీనిని చూసిన నెటిజన్లు.. కింగ్ నాగ్ పోలికలు అతనికి ఉండడం బాగా ప్లస్ అయిందంటూ .. కామెంట్స్ చేస్తున్నారు. ఇలా ఎంతో మంది సోషల్ మీడియాలో కొంతమంది స్టార్ సెలెబ్రిటీల పోలికలతో ఫేమస్ అవుతూ ఉన్నారు. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetcasibomvbetcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişbetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetin