iDreamPost
android-app
ios-app

Naa Saami Ranga: పనిలో పని…డేట్ కూడా పెట్టేశారు.. జనవరి 14న నా సామి రంగా విడుదల!

నాగార్జున హీరోగా తెరకెక్కిన నా సామి రంగ సినిమా సంక్రాంతికి విడుదల కానున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ అయింది. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

నాగార్జున హీరోగా తెరకెక్కిన నా సామి రంగ సినిమా సంక్రాంతికి విడుదల కానున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ అయింది. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Naa Saami Ranga: పనిలో పని…డేట్ కూడా పెట్టేశారు.. జనవరి 14న నా సామి రంగా విడుదల!

సంక్రాంతి రిలీజుల్లో నా సామి రంగా సినిమా కూడా సందడి చేస్తోంది. ఏది ముందు ఏది వెనుక అన్న సందేహం లేకుండా ఎవరి మట్టుకు వారు సిద్ధమై పోతున్నారు. ఏదో దీనికి సంబంధించి దిల్ రాజు నాయకత్వంలో మాట వరసకి సమావేశాలు జరిగాయి గానీ, ఎవ్వరూ తగ్గడం లేదు. అందరికీ సంక్రాంతి పండగే కావాల. ఎందుకంటే సినిమా ఏ మాత్రం బాగున్నా పండగ కలెక్షన్లు బాగా హెల్ప్ అవుతాయి. అది ఏనాటి నుంచో ప్రూ అవుతున్న నిజం. నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కాంబినేషన్లో తయారైనా నా సామి రంగా సినిమా మీద నేచురల్‌గానే మంచి అంచనాలున్నాయి.

దీనికి తోడు సంక్రాంతి రిలీజ్ అయితే ఆ హడావుడి కూడా యాడ్ అవుతుందనే ఆశ, నమ్మకం, ఆనవాయితీ….ఒకటి కాదు…వందల సెంటిమెంట్లు ఎదురొస్తాయి. ఇప్పుడు అదే జరిగింది. ఇవ్వాళ సాయంత్రం తాజాగా షూట్ చేసిన ఫాట లిరికల్ వీడియోని 4.05 నిమిషాలకు విడుదల చేశారు. కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఈ మాస్ సాంగ్ భలేగా అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంది. దినేష్ మాస్టర్ కొరియోగ్రాఫీలో మాస్ మువ్ మెంట్స్ సూపర్ బీట్ తో రెచ్చగొట్టే విధంగా ఉండడమే ఇందులో విశేషం. ఈ మధ్యనే అన్నపూర్ణ స్టూడియోలో నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కాంబినేషన్లో తీసిన ఈ మాస్ సాంగ్ మాత్రం కరెక్ట్ గా ఉభయగోదావరి జిల్లాల్లోగానీ, ఉత్తరాంధ్రలో గానీ పండగల్లో మాస్ యూత్ ఎలా ఉంటారో అలా ఉన్నట్టుగా కనిపిస్తున్నారు ముగ్గురికీ ముగ్గురూ.

na saami ranga movie

ఆకాడెమీ అవార్డు విన్నర్ కీరవాణి స్వరపరచిన ఈ మాస్ నంబర్ మరో అకాడెమీషియన్ చంద్రబోస్ రాయడం విశేషం. కాగా వీరిద్దరి కాంబోలో లెక్కలేనన్ని హిట్స్ వచ్చిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ లిరికల్ వీడియో ద్వారా సినిమా రిలీజ్ డేట్ కూడా మరోసారి అందరికీ తెలిసేట్టుగా చేశారు నా సామి రంగా టీం. జనవరి 14న విడుదల కాబోతున్న ఈ తాజా నాగార్జున స్టారర్ కి విజయ్ బిన్ని డైరెక్టర్, చిట్టూరి శ్రీనివాసరావు నిర్మాత. ఇంతకు ముందే విడుదలైన టీజర్ సినిమాలో కంటెంట్ గురించి చెప్పేసింది.

అల్లరి నరేష్ రాజ్ తరుణ్, నాగార్జున మధ్యలో స్నేహబంధం, అందులో ఉండే కిక్కు అంతా బ్రహ్మాండంగా కేచ్ అయింది. ఇప్పుడింక సినిమా ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే….పైగా నాగార్జునకి ఈ సినిమా హిట్ కావడం చాలా ముఖ్యమని ఇవతల ట్రేడ్, అటుపక్క అభిమాన ప్రపంచం కూడా అభిప్రాయపడుతోంది. మరి, సంక్రాంతికి నా సామి రంగ సినిమా విడుదల అవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.