iDreamPost
android-app
ios-app

#D51: భారీ ధరకు అమ్ముడైన ధనుష్ – శేఖర్ కమ్ముల సినిమా ఓవర్సీస్ రైట్స్!

  • Published Feb 11, 2024 | 1:00 PM Updated Updated Feb 11, 2024 | 1:00 PM

ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ముల కాంబినేషన్లో వస్తున్న #D51 (DNS) సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ మూవీ ఓవర్సిస్ హక్కులను ప్రముఖ కంపెనీ భారీ ధరకు దక్కించుకున్నట్లు సమాచారం.

ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ముల కాంబినేషన్లో వస్తున్న #D51 (DNS) సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ మూవీ ఓవర్సిస్ హక్కులను ప్రముఖ కంపెనీ భారీ ధరకు దక్కించుకున్నట్లు సమాచారం.

  • Published Feb 11, 2024 | 1:00 PMUpdated Feb 11, 2024 | 1:00 PM
#D51: భారీ ధరకు అమ్ముడైన ధనుష్ – శేఖర్ కమ్ముల సినిమా ఓవర్సీస్ రైట్స్!

కొన్ని సినిమాలు నిజానికి సెట్స్ పైకి వెళ్లే ముందే మంచి క్రేజ్ పొందుతాయి. దానికి కారణం ఆ కాంబినేషన్ కు వచ్చే హైప్ మాత్రమే. అలానే ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ముల కాంబినేషన్లో వస్తున్న #D51 (DNS) సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాగా, ఓవర్సీస్ రైట్స్ గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ధనుష్ – శేఖర్ కమ్ముల సినిమా ఓవర్సీస్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయినట్లు సమాచారం.

ఈ క్రేజీ సినిమా ఇంకా షూటింగ్ స్టార్ట్ కాకముందే యూకేకు చెందిన డ్రీమ్జ్ ఎంటర్టైన్మెంట్ టోటల్ ఓవర్సీస్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుందని వినికిడి. ధనుష్ క్రేజ్ ఒక కారణం కాగా ఎన్ఆర్ఐలలో బాగా పాపులర్ అయిన దర్శకుడు శేఖర్ కమ్ములతో చేయడం కూడా మరో కారణంగా చెప్పుకోవచ్చు. ఇక నాగార్జున ఒక ముఖ్య పాత్రలో నటించడం, ‘నేషనల్ క్రష్’ రష్మిక మందన్న హీరోయిన్ గా ఉండటం వంటి కారణాలతో ఈ సినిమా రైట్స్ హాట్ కేక్ లాగా అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. గతంలో యూకేలో కొన్ని సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసిన ఈ సంస్థ ఇప్పుడు మొత్తంగా ఓవర్సీస్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. శేఖర్ కమ్ముల సినిమాలన్నీ ఓవర్సీస్ లో మంచి విజయాలే సాధించాయి. ఇక ధనుష్ స్టార్ డం కూడా తోడైతే కలెక్షన్లు భారీ స్థాయిలోనే ఉంటాయి.

మరో వైపు అలిపిరి పరిసర ప్రాంతాల్లోని కొన్ని రియల్ లొకేషన్స్ లో ధనుష్ DNS చిత్రీకరణను ప్రారంభించారు. షూటింగ్ వద్దకు వచ్చే పబ్లిక్ ను నియంత్రించడానికి పోలీసులు నానా తంటాలు పడటంతో సినిమాకు కొన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. శేఖర్ కమ్ములతో ఆయన పని చేయడం ఇదే మొదటి సారి కావటం విశేషం. మరి ఈ వెరైటీ కాంబినేషన్లో ఎలాంటి ఆల్బమ్ వస్తుందో చూద్దాం.

ఇదికూడా చదవండి: Dalljiet Kaur: భర్తతో విభేదాలు.. పెళ్లైన ఏడాదికే విడాకులు తీసుకున్న నటి?

Jojobet GirişmeritbetmeritbetcasibomvbetcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişbetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetin