iDreamPost
android-app
ios-app

మూడో సారి సంక్రాంతి బరిలో.. ఆ రెండు సార్లు ఎవరు గెలిచారు!

Venkatesh And Nagarjuna: నాగార్జున ‘నా సామిరంగ’ సినిమాతో.. వెంకటేష్‌ సైంధవ్‌ మూవీతో సంక్రాంతి బరిలో దిగుతున్నారు. ఓ రోజు తేడాతో ఇద్దరి చిత్రాలు విడుదల కానున్నాయి. ఇద్దరూ గతంలో పలు సార్లు సంక్రాంతికి పోటీ పడ్డారు.

Venkatesh And Nagarjuna: నాగార్జున ‘నా సామిరంగ’ సినిమాతో.. వెంకటేష్‌ సైంధవ్‌ మూవీతో సంక్రాంతి బరిలో దిగుతున్నారు. ఓ రోజు తేడాతో ఇద్దరి చిత్రాలు విడుదల కానున్నాయి. ఇద్దరూ గతంలో పలు సార్లు సంక్రాంతికి పోటీ పడ్డారు.

మూడో సారి సంక్రాంతి బరిలో.. ఆ రెండు సార్లు ఎవరు గెలిచారు!

ఈ సంక్రాంతికి టాలీవుడ్‌లో సినిమాల పోటీ గట్టిగానే ఉంది. ఇద్దరు ముగ్గురు స్టార్‌ హీరోలు బరిలో నిలుస్తున్నారు. సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ‘ గుంటూరు కారం’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. జనవరి 12వ తేదీ సినిమా విడుదల కానుంది. మరుసటి రోజు విక్టరీ వెంకటేష్‌ ‘ సైంధవ్‌’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆ తర్వాత 14వ తేదీన నాగార్జున ‘ నాసామిరంగ’ చిత్రం విడుదల కానుంది. ఈ సారి ఈ ముగ్గురు హీరోల మధ్య గట్టీ పోటీ ఉండనుంది.

ఈ మూడు సినిమాలకు మంచి బజ్‌ ఉన్నా.. సంక్రాంతి బరిలో నిలుస్తున్న వెంకీ, నాగ్‌ల సినిమాలపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఎందుకంటే.. వెంకటేష్‌, నాగార్జున సంక్రాంతి బరిలో పోటీ పడటం కొత్తేమీ కాదు. గతంలో కూడా పలు సార్లు సంక్రాంతికి పోటీ పడ్డారు. దాదాపు రెండు సార్లు ఇద్దరూ సంక్రాంతి బరిలో దిగారు. ఇప్పుడు మూడో సారి పోటీ పడబోతున్నారు. గతంలో పోటీ పడ్డ రెండు సార్లు ఎవరు గెలిచారు? ఇ‍ద్దరూ ఏఏ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు? అంటే..

వెంకటేష్‌ నాగార్జున మొదటి సారి 1992లో సంక్రాంతి బరిలో పోటీకి దిగారు. వెంకీ చంటీ అనే సినిమాతో.. నారార్జున కిల్లర్‌ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. చంటి మూవీ బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌గా నిలిచింది. కిల్లర్‌ పర్లేదు అనిపించింది. చంటి చిత్రంలో వెంకీ నటన అందర్నీ ప్రత్యేకంగా మెప్పించింది. కథ కూడా ఫ్యామిలీ బ్యాక్‌ డ్రాప్‌ కావటంతో అందరికీ ఎక్కేసింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఇద్దరూ బాక్సాఫీస్‌ వద్ద పోటీ పడ్డారు. 1996లో మరోసారి సంక్రాంతి సందర్భంగా పోటీ పడ్డారు.

నాగార్జున ‘వజ్రం’ సినిమాతో.. వెంకటేష్‌ ‘ధర్మ చక్రం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ధర్మచక్రం మూవీ బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హిట్‌ అయింది. వజ్రం ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేకపోయింది. ముచ్చటగా మూడో సారి ఇద్దరూ సంక్రాంతి బరిలో నిలుస్తున్నారు. ఈ సారి నాగార్జున ‘ నాసామిరంగ’ సినిమాతో వస్తుండగా.. వెంకటేష్‌ ‘సైంధవ్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నా సామి రంగ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ కాగా.. సైంధవ్‌ ఫ్యామిలీ మాస్‌ డ్రామా. ఇందులో కూతురి సెంటిమెంట్‌ మిళితమై ఉంది. ఇక, ఈ సారి ఎవరు పై చెయ్యి సాధిస్తారో చూడాలి. మరి, ఈ సారి సంకాంత్రి బరిలో దిగుతున్న ఇద్దరిలో ఎవరు పై చెయి సాధాస్తారని మీరు భావిస్తున్నారో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.