iDreamPost
android-app
ios-app

బిగ్‌బాస్‌లోకి అమృత ప్రణయ్ ఎంట్రీ? ఇది సీజన్ కే హైలెట్!

  • Published Jul 24, 2024 | 3:31 PM Updated Updated Jul 24, 2024 | 3:31 PM

Amrutha Pranay: తెలుగు బుల్లితెరపై వస్తున్న పాపులర్ రియాల్టీ షో బిగ్ బాస్ ఇప్పటి వరకు ఏడు సీజన్లు పూర్తి చేసుకొని 8వ సీజన్ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతుంది. ఇందుకు సంబంధించిన ప్రోమో ఒకటి అధికారికంగా ప్రకటించారు.

Amrutha Pranay: తెలుగు బుల్లితెరపై వస్తున్న పాపులర్ రియాల్టీ షో బిగ్ బాస్ ఇప్పటి వరకు ఏడు సీజన్లు పూర్తి చేసుకొని 8వ సీజన్ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతుంది. ఇందుకు సంబంధించిన ప్రోమో ఒకటి అధికారికంగా ప్రకటించారు.

బిగ్‌బాస్‌లోకి అమృత ప్రణయ్ ఎంట్రీ? ఇది సీజన్ కే హైలెట్!

దేశ వ్యాప్తంగా ఎంతో ప్రజాదరణ పొందిన రియాల్టీ షో ఏదంటే వెంటనే గుర్తుకు వచ్చేది ‘బిగ్ బాస్’. బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ హూస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ కి విపరీతమైన క్రేజ్ రావడంతో ఇతర భాషల్లో కూడా మొదలు పెట్టారు. తెలుగు లో బిగ్ బాస్ సీజన్ 1 కి ఎన్టీఆర్, సీజన్ 2 కి నేచురల్ స్టార్ నాని, 3వ సీజన్ నుంచి మొన్న ముగిసిన 7వ సీజన్ వరకు కింగ్ నాగార్జున హూస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇంటి సభ్యుల మధ్య జరిగే గొడవలు, టాస్కులు, గేమ్స్, కాంట్రవర్సీలు.. వీక్ ఎండ్ ఒకరు ఎలిమినేట్ కావడం ఇలా బిగ్ బాస్ షో ప్రతిరోజూ ఎంటర్‌టైన్‌మెంట్ గా ఉంటుంది. త్వరలో బిగ్ బాస్ సీజన్ 8 రాబోతుంది. ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్ కి సంబంధించిన వార్తలు సోషల్ మీడిమాలో వైరల్ అవుతున్నాయి.

తెలుగు లో బిగ్ బాస్ సీజన్ 8 కి సంబంధించిన కొత్త లోగో ప్రోమో రిలీజ్ అయ్యింది. త్వరలో ప్రేక్షకు ముందుకు బిగ్ బాస్ సీజన్ 8 రాబోతుందని తెలియంతో ప్రేక్షకులు అందులో కంటెస్టెంట్స్ ఎవరా అన్న క్యూరియాసిటీ పెరిగిపోతుంది. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 8 లో ఇంటి సభ్యులు వీరే అంటే తెగ వార్తలు వస్తున్నాయి..కాకపోతే అఫిషియల్ గా ఎలాంటి అనౌన్స్ మెంట్ రాలేదు. సెప్టెంబర్ 1 న కొత్త సీజన్ మొదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఈ క్రమంలోనే ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. బిగ్ బాస్ సీజన్ 8 లోకి మిర్యాల‌గూడ పరువు హత్యకు సంబంధించిన సెన్సెషన్ సృష్టించిన కేసులో బాధితురాలు అమృత ప్రణయ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే అమృత తన కొడుకు నిహాన్ తో కలిసి యూట్యూబ్ వీడియోలు చేస్తుంది. అమృత తర్వరలో బిగ్ బాస్ సీజన్ 8లోకి ఎంట్రీ ఇవ్వబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.. ఇందులో ఎంత నిజముందో అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ చేస్తే తెలియదు. ఆ మధ్య బెదురులంక 2012 మూవీ ప్రమోషన్ సందర్భంగా హీరో కార్తికేయతో డ్యాన్స్ చేసింది. త్వరలో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుందని వార్తలు వచ్చాయి. కానీ అలా జరగలేదు. కాకపోతే బిగ్ బాస్ సీజన్ 8 లో ఆమె ఎంట్రీ ఉంటుందని అంటున్నారు. ఇక అమృత విషయానికి వస్తే.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో 2018 సెప్టెంబర్ 14న జరిగిన ప్రణయ్ హత్య అప్పట్లో పరువు హత్యగా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అమృత తండ్రి వ్యాపారవేత్త మారుతీ రావు ఓ కిల్లర్ కి సుపారీ ఇచ్చి హత్య చేయించారు. తన భర్తను హత్య చేయించాడని మారుతీరావు కూతురు అమృత తండ్రిపై కేసు పెట్టింది.

ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే హైదరాబాద్ లో మారుతీరావు ఆర్యవైశ్య భవన్ లో ఆత్మహత్యకు పాల్పపడ్డారు. ప్రస్తుతం తన కొడుకు నిహాన్ తో యూట్యూబ్ లో వ్లాగ్స్ చేస్తూ బిజీగా ఉంటుంది. తన అత్తగారి ఇంట్లో ఉంటున్న అమృతను చాలా ఏళ్ల తర్వాత ఆమె తల్లి కలిసింది. ఈ వ్లాగ్ ఆ మధ్య వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఇన్ స్పైరింగ్ లైఫ్ జర్నీ చేస్తున్న అమృత తెలుగు రాష్ట్ర ప్రజలకు మంచి సుపరిచితమే. మరి ఈమె బిగ్ బాస్ సీజన్ 8 లో అడుతు పెడితే సెంటిమెంట్ వర్క్ఔట్ అవుతుందా..తన ఆట తీరుతో ఆడియన్స్ మనసు గెల్చి కప్పు కొడుతుందా చూడాలి. మరి ఇదంతా జరగాలంటే బిగ్ బాస్ సీజన్ 8 ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.. అప్పటి వరకు ఆగాల్సిందే.

Jojobet GirişmeritbetmeritbetcasibomvbetcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişbetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetin